మీకు ఇకపై మీ Gmail అడ్రస్, ఇమెయిల్‌లు వద్దనుకున్నట్లయితే, మీరు వాటిని మీ Google ఖాతా నుండి తీసివేయవచ్చు. వాటిని తొలగించడం వల్ల మీ మొత్తం Google ఖాతా తొలగించబడదు.
మీ Gmail సర్వీస్‌ను మీరు తొలగించినప్పుడు ఏం జరుగుతుంది
- 30 రోజుల తర్వాత మీ ఈమెయిల్‌లు, మెయిల్ సెట్టింగ్‌లు తొలగించబడతాయి.
- ఇమెయిల్ పంపడానికి లేదా అందుకోవడానికి మీరు ఇకపై మీ Gmail అడ్రస్‌ను ఉపయోగించలేరు. మీరు మనసు మార్చుకుంటే, మీ Gmail అడ్రస్‌ను మీరు తిరిగి పొందవచ్చు.
- మీ Gmail అడ్రస్‌ను భవిష్యత్తులో మరెవరూ ఉపయోగించలేరు.
- మీ Google ఖాతా తొలగించబడదు; మీ Gmail సర్వీస్ మాత్రమే తీసివేయబడుతుంది. మీరు ఇప్పటికీ మీ యాక్టివిటీని, Google Playలో మీరు చేసిన కొనుగోళ్లను కలిగి ఉంటారు.
Gmailను తొలగించండి
మీరు మీ ఆఫీస్, స్కూల్, లేదా ఇతర గ్రూప్ ద్వారా Gmailను ఉపయోగిస్తున్నట్లయితే, మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.
- మీ Gmail సర్వీస్‌ను తొలగించడానికి ముందు, మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి.
- మీ Google ఖాతాకు వెళ్లండి.
- ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- "మీరు వినియోగించే యాప్‌లు, అలాగే సర్వీస్‌ల నుండి డేటా" ఆప్షన్‌కు స్క్రోల్ చేయండి.
- "మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి లేదా తొలగించండి" ఆప్షన్ కింద, Google సర్వీస్‌ను తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
- "Gmail" పక్కన ఉన్న, తొలగించండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీరు సైన్ ఇన్ చేయాలనుకొనే ఇప్పటికే ఉన్న ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి, అలాగే ధృవీకరణ ఇమెయిల్‌ను పంపు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఈ ఇమెయిల్ అన్నది Gmail అడ్రస్ కాకూడదు.
- ఇప్పటికే ఉన్న మీ ఇమెయిల్ అడ్రస్‌ను వెరిఫై చేయడానికి, ఇప్పటికే ఉన్న ఇమెయిల్ అడ్రస్‌లో మీరు ఇమెయిల్‌ను అందుకుంటారు. మీ కొత్త ఇమెయిల్ అడ్రస్‌ను మీరు వెరిఫై చేసేంత వరకు, మీ Gmail అడ్రస్ తొలగించబడదు.
గమనిక: మీరు Gmail ఆఫ్‌లైన్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు మీ బ్రౌజర్ కాష్ అలాగే కుక్కీలను క్లియర్ చేయడం కూడా అవసరం.
సమస్యలను పరిష్కరించండి
మీరు మనసు మార్చుకుంటే, మీ Gmail అడ్రస్‌ను మీరు తిరిగి పొందవచ్చు. మీ Gmail సర్వీస్‌ను మీరు తీసివేసి కొంత కాలమైతే, మీ ఇమెయిల్‌లను మీరు తిరిగి పొందలేకపోవచ్చు.
- Gmailకు వెళ్లండి
- స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
మీ Google ఖాతాను తొలగించడం ఎలాగో తెలుసుకోండి. ఈ చర్య మీ Gmail సర్వీస్‌ను మాత్రమే కాకుండా మీ మొత్తం Google ఖాతాను తొలగిస్తుంది.
మీ Gmail సర్వీస్‌ను తొలగించడానికి ముందు మీరు సైన్ ఇన్ చేయాలి. మీ ఖాతాను యాక్సెస్ చేయడంలో సహాయం పొందండి.