Googleతో వినియోగం & విశ్లేషణల సమాచారాన్ని షేర్ చేయండి

Androidను మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి, మీరు మీ పరికరాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, అలాగే అది ఎలా పని చేస్తోంది అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మాకు పంపడానికి మీరు మీ డివైజ్‌ను అనుమతించవచ్చు.

మీరు అదనపు వెబ్ & యాప్ యాక్టివిటీని ఆన్ చేసినట్లయితే, ఈ సమాచారం మీ ఖాతాతో స్టోర్ చేయబడవచ్చు. అలా అయితే, మీరు దాన్ని నా యాక్టివిటీలో చూడవచ్చు, తొలగించవచ్చు. మీ Google సర్వీస్‌లను మరింత బాగా వ్యక్తిగతీకరించడానికి, అలాగే అందరికీ మా ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మెరుగుపరచడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని Android 8.0, ఆపైన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Googleతో ఏ సమాచారం షేర్ చేయబడుతుంది

మీరు 'వినియోగం & విశ్లేషణల'ను ఆన్ చేస్తే, ఏవేవి పని చేస్తున్నాయి, ఏవేవి పని చేయట్లేదు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని మీ డివైజ్ Googleకు పంపుతుంది. ఉదాహరణకు, మీ డివైజ్ ఇలాంటి సమాచారాన్ని పంపవచ్చు:

  • బ్యాటరీ స్థాయి
  • మీ యాప్‌లను మీరు ఎంత తరచుగా ఉపయోగిస్తారు
  • మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ల క్వాలిటీ, పొడవు (ఉదాహరణకు, మొబైల్, Wi-Fi, బ్లూటూత్)

వినియోగం & విశ్లేషణలను ఆన్ లేదా ఆఫ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు 'వినియోగం & విశ్లేషణల'ను ఆఫ్ చేస్తే, మీ డివైజ్ ఇప్పటికీ Android కొత్త వెర్షన్ వంటి అవసరమైన సర్వీస్‌లను పొందగలదు. 'వినియోగం & విశ్లేషణల'ను ఆఫ్ చేయడం వలన యాప్‌లు సేకరించగల సమాచారం ప్రభావితం కాదు.

'వినియోగం & విశ్లేషణల' సమాచారాన్ని Googleకు పంపాలా వద్దా అని ఎంచుకోవడానికి ఇలా చేయండి:

  1. మీ డివైజ్ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మరిన్ని  ఆ తర్వాత వినియోగం & విశ్లేషణలను ట్యాప్ చేయండి.
  3. వినియోగం & విశ్లేషణలను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: మీరు షేర్ చేసిన డివైజ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ఇతర యూజర్ ప్రొఫైల్‌లు ఈ సెట్టింగ్‌ను మార్చే అవకాశం ఉంది.

Google ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది

Google యాప్‌లు, Android డివైజ్‌లు వంటి ప్రోడక్ట్‌లను, అలాగే సర్వీస్‌లను మెరుగుపరచడానికి Google వినియోగం & విశ్లేషణల సమాచారాన్ని ఉపయోగిస్తుంది. మొత్తం సమాచారం Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.

ఉదాహరణకు, వీటిని మెరుగుపరచడానికి Google వినియోగం & విశ్లేషణల సమాచారాన్ని ఉపయోగించవచ్చు:

  • బ్యాటరీ జీవితకాలం: సాధారణంగా ఉపయోగించబడే ఫీచర్‌లు తక్కువ బ్యాటరీని ఉపయోగించడంలో సహాయపడటానికి, Google మీ డివైజ్‌లో ఎక్కువ బ్యాటరీని ఏవేవి వినియోగిస్తున్నాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • డివైజ్‌లలో క్రాష్ అవ్వడం లేదా స్తంభించడం: Android ఆపరేటింగ్ సిస్టమ్‌ను మరింత విశ్వసనీయమైనదిగా చేయడంలో సహాయపడటానికి, మీ డివైజ్‌లో యాప్‌లు ఎప్పుడు క్రాష్ అవుతాయి, స్తంభిస్తాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని Google ఉపయోగించవచ్చు.

కొంత సమగ్ర సమాచారం Android డెవలపర్‌లు వంటి పార్టనర్‌లకు కూడా, వారి యాప్‌లు, ప్రోడక్ట్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16564318534771509878
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false