Googleను మీ హోమ్ పేజీగా చేయండి

Googleను మీ హోమ్ పేజీగా సెట్ చేసుకోవడం ద్వారా మీ బ్రౌజర్‌ను తెరిచిన ప్రతిసారి మీరు త్వరగా Googleకు వెళ్లగలరు. 

మీ హోమ్ పేజీని మార్చండి

దిగువున బ్రౌజర్‌ను ఎంచుకుని, ఆపై మీ కంప్యూటర్‌లోని సూచనలను ఫాలో అవ్వండి. దిగువున మీ బ్రౌజర్ కనిపించకపోతే, మీ బ్రౌజర్‌లో "సహాయం" విభాగానికి వెళ్లి, మీ బ్రౌజర్ హోమ్ పేజీని మార్చడం ఎలా అనే సమాచారం కోసం చూడండి.

Firefox
  1. మీ బ్రౌజర్‌ను తెరిచి, www.google.comను సందర్శించండి.
  2. ట్యాబ్‌ను హోమ్ బటన్ వద్దకు లాగి, ఆపై రిలీజ్ చేయండి. 
  3. అవునుని క్లిక్ చేయండి.
Google Chrome
  1. మీ కంప్యూటర్ బ్రౌజర్‌లో ఎగువన కుడి మూలన, మరిన్ని More ఆ తర్వాత సెట్టింగ్‌లును క్లిక్ చేయండి.
  2. "ప్రదర్శన రూపం" కింద, హోమ్ బటన్‌ను చూపించును ఆన్ చేయండి.
  3. మీ ప్రస్తుత హోమ్ పేజీని ఎంచుకోండి లేదా అనుకూల వెబ్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి. ఆపై, దీన్ని ఎంటర్ చేయండి: www.google.com.
Safari
  1. మీ స్క్రీన్‌పై ఎగువున ఎడమ మూలన, Safari ఆ తర్వాత ప్రాధాన్యతలు ఆ తర్వాత సాధారణంను ఎంచుకోండి.
  2. "కొత్త విండోలను దీనితో తెరువు", అలాగే "కొత్త ట్యాబ్‌లను దీనితో తెరువు" ఎంపికల పక్కన, హోమ్ పేజీని ఎంచుకోండి. 
  3. "హోమ్ పేజీ" పక్కన, దీన్ని ఎంటర్ చేయండి: www.google.com.
Internet Explorer
  1. మీ బ్రౌజర్ పైభాగంలోని మెనూ బార్‌లో, టూల్స్‌ని క్లిక్ చేయండి.
  2. ఇంటర్నెట్ ఆప్షన్‌లను ఎంచుకోండి.
  3. సాధారణం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. "హోమ్ పేజీ" కింద, దీన్ని ఎంటర్ చేయండి: www.google.com.
  5. సరేను క్లిక్ చేయండి.
  6. మీ బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయండి.
Microsoft Edge
  1. మీ బ్రౌజర్‌లో ఎగువన కుడి మూలన, మరిన్ని More ఆ తర్వాత సెట్టింగ్‌లను ఎంపిక చేయండి.
  2. "మీ హోమ్ పేజీని సెట్ చేయండి" కింద, కింది వైపు బాణం గుర్తు Down arrow ఆ తర్వాత ఒక నిర్దిష్ట పేజీ లేదా పేజీలను క్లిక్ చేయండి.
    1. మీరు ప్రస్తుత హోమ్ పేజీని కలిగి ఉంటే: URL పక్కన, Xను క్లిక్ చేయండి.
  3. *URLను ఎంటర్ చేయి*ని క్లిక్ చేయండి. ఆపై, దీన్ని టైప్ చేయండి: www.google.com.

     

Google నా హోమ్ పేజీగా ఆగిపోయింది

మీ అనుమతి లేకుండా Google మీ హోమ్ పేజీ సెట్టింగ్‌లను మార్చదు.

  1. మీ హోమ్ పేజీని రీసెట్ చేయండి. ఎగువన బ్రౌజర్‌ను ఎంచుకుని, ఆపై సూచనలను ఫాలో అవడం ద్వారా మీ హోమ్ పేజీగా సెట్ చేయాలనుకునే సైట్‌తో Googleను రీప్లేస్ చేయండి. 
  2. అనవసరమైన ప్రోగ్రామ్‌లు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయండి. మీ హోమ్ పేజీని రీసెట్ చేయడం వలన సమస్య పరిష్కారం కాలేదంటే, మీరు Google సైట్‌ను అనుకరిస్తున్న మాల్‌వేర్ అనబడే అనవసరమైన ప్రోగ్రామ్‌లను కలిగి ఉండవచ్చు. మాల్‌వేర్ గురించి, అలాగే దాన్ని ఎలా తీసివేయాలి అనే దాని గురించి తెలుసుకోండి. 
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4922029885463815136
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false