మీ ఖాతా నిలిపివేయబడింది

మీరు ఈ పేజీకి దారి మళ్లించబడితే, మీ Google ఖాతా మొత్తం డిజేబుల్ చేయబడింది.

కారణం ఏంటో తెలుసుకోండి

  1. Chrome వంటి బ్రౌజర్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ ఖాతా డిజేబుల్ చేయబడితే, మీరు వివరణను అందుకుంటారు.

మీ ఖాతా డిజేబుల్ చేయబడినప్పుడు ఏం జరుగుతుంది

  • మీరు Google సర్వీస్‌లకు సైన్ ఇన్ చేయలేరు లేదా Googleతో సైన్ ఇన్‌ను ఉపయోగించలేరు. మీరు సైన్ ఇన్ చేయడానికి ట్రై చేసినప్పుడు, మీరు ఎర్రర్ మెసేజ్‌ను పొందుతారు లేదా ఈ పేజీకి పంపబడతారు.
  • కొన్ని సందర్భాలలో, మీరు Google నుండి మీ ఖాతా డిజేబుల్ అయినట్లుగా తెలియజేసే ఇమెయిల్ లేదా టెక్ట్స్ మెసేజ్‌ను పొందుతారు.

మీ ఖాతాను రీస్టోర్ చేయమని మమ్మల్ని అడగండి

ఖాతా మీకు చెందినది అయితే, మీరు మళ్లీ యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.

  1. Chrome వంటి బ్రౌజర్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. అప్పీల్ చేయడం ప్రారంభించండిని ఎంచుకోండి.
  3. సూచనలను ఫాలో అవ్వండి.

మీ అప్పీల్ ఆమోదించబడకపోతే, మీ మొత్తం Google ఖాతా అందుబాటులో ఉండదు. తదుపరి చర్య తీసుకోకపోతే, మీ ఖాతా శాశ్వతంగా నిలిపివేయబడుతుంది, అలాగే తొలగింపు కోసం పరిగణించబడుతుంది.

మీరు యూరోపియన్ యూనియన్ (EU)లో నివసిస్తుంటే లేదా EU పౌరులు అయితే, మీకు అదనపు రిజల్యూషన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉండవచ్చు. మరింత తెలుసుకోండి.

కొన్ని పాలసీ ఉల్లంఘనలకు సంబంధించి రివ్యూ చేయబడిన అప్పీళ్ల గరిష్ఠ సంఖ్య

కొన్ని పాలసీ ఉల్లంఘనలకు సంబంధించి, Google గరిష్టంగా 2 అప్పీళ్లను రివ్యూ చేస్తుంది. మొదటి అప్పీల్ ఆమోదించబడకపోతే, మీరు మరింత సమాచారంతో రెండవ అప్పీల్‌ను సమర్పించవచ్చు, అది Google రివ్యూవర్ ద్వారా తిరిగి విశ్లేషణ చేయబడుతుంది. దాని తర్వాత ఏవైనా అప్పీళ్లు మూసివేయబడతాయి.

ఇది మీ అప్పీల్‌కు వర్తించినట్లయితే, మీరు దీన్ని సమర్పించే ముందు, ఈ రకమైన పాలసీ ఉల్లంఘనలకు Google రివ్యూ చేసే అప్పీళ్ల గరిష్ఠ సంఖ్య గురించి మీకు మెసేజ్ కనిపిస్తుంది.

డిజేబుల్ చేయబడిన ఖాతా నుండి డేటాను డౌన్‌లోడ్ చేయండి

మీరు మీ ఖాతాలోకి ప్రవేశించలేకపోతే, కొన్ని Google సర్వీస్‌ల నుండి ఖాతా డేటాను డౌన్‌లోడ్ చేసుకుని, సేవ్ చేయవచ్చు.

మీ డేటాను డౌన్‌లోడ్ చేయడాన్ని ట్రై చేయడానికి, సాధారణంగా మీరు చేసే విధంగానే మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి. ఆపై, మీ డేటాను డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

వీటితో సహా, కానీ వీటికే పరిమితం కాని, కొన్ని నిర్దిష్ట ఉల్లంఘనల కోసం డేటాను డౌన్‌లోడ్ చేసే సామర్థ్యం లేకుండా ఖాతాలను డిజేబుల్ చేయవచ్చు:

  • చెల్లుబాటు అయ్యే చట్టపరమైన రిక్వెస్ట్‌లు
  • ఖాతా హైజాకింగ్
  • పిల్లలపై లైంగిక చర్యలు, పిల్లలపై దాడి, ఉగ్రవాద కంటెంట్‌తో సహా ప్రత్యేకమైన అసాధారణ కంటెంట్ ఉల్లంఘనలు

ఖాతాలు ఎందుకు డిజేబుల్ చేయబడతాయి

సాధారణంగా ఖాతా ఓనర్ మా పాలసీలను ఫాలో అవ్వకపోతే Google ఖాతాలు డిజేబుల్ చేయబడతాయి. Google పాలసీలలో ఇవి ఉంటాయి:

ఖాతాలు ఎందుకు డిజేబుల్ చేయబడతాయో తెలిపే కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ అందించాము. అయితే ఈ కారణాలతో అన్ని Google సర్వీస్‌లు ఖాతాను డిజేబుల్ చేయవు.

ఖాతాను హ్యాక్ చేయడం లేదా హైజాక్ చేయడం

మరొక వ్యక్తి ఖాతాలోకి వారి నుండి స్పష్టమైన అనుమతి లేకుండా సైన్ ఇన్ చేయకండి లేదా ఉపయోగించకండి.

ఆటోమేటిక్ కాల్‌లు లేదా మెసేజ్‌లు

ఆటోమేటిక్‌గా కాల్‌లు చేయడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి (రోబోడయలింగ్) Google సర్వీస్‌లను ఉపయోగించకండి.

మెషిన్ కాల్‌లు అనేవి, ముందే రికార్డ్ చేసిన మెసేజ్‌లను పంపడానికి కంప్యూటర్ సంబంధమైన ఆటోడయలర్‌ను ఉపయోగించి చేసే ఫోన్ కాల్‌లు.

ప్రోడక్ట్ పాలసీలను ఉల్లంఘించడం

కొన్ని Google సర్వీస్‌లకు ఈ కింది వాటితో సహా వాటి స్వంత ప్రవర్తన నియమావళి లేదా సర్వీస్ నియమాలు ఉంటాయి:

ఎవరైనా ఈ పాలసీలను ఫాలో అవ్వకపోతే, వీటిని చేయకుండా మేము ఆ వ్యక్తిని ఆపివేయవచ్చు:

  • కేవలం ఆ సర్వీస్‌ను ఉపయోగించడం
  • ఏవైనా Google సర్వీస్‌లలో సైన్ ఇన్ చేయడం
పిల్లలపై లైంగిక చర్యలు & పిల్లలపై దాడి

Google సర్వీస్‌లను, చిన్నారులను పీడించడానికి లేదా దుర్వినియోగ పరచడానికి ఉపయోగించకండి.

మేము కింది రకాల కంటెంట్‌పై చర్యలు తీసుకుంటాము:

  • పిల్లలను లైంగికంగా వేధించే కంటెంట్, కార్టూన్‌లతో సహా.
  • చిన్నారులను అనైతిక శృంగారానికి లోబరచుకోవడం ఉదాహరణకు, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, లైంగిక సంపర్కం కోసం మరియు/లేదా వారికి లైంగిక ఇమేజ్‌లను ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఆన్‌లైన్‌లో చిన్నారితో స్నేహం చేయడం.
  • లైంగిక బెదిరింపు - ఉదాహరణకు, చిన్నారులను బెదిరించడం లేదా బ్లాక్‌మెయిల్ చేయడం కోసం వారు అంతరంగికంగా ఉన్న ఇమేజ్‌లను అక్రమంగా లేదా రహస్యంగా ఉపయోగించడం.
  • మైనర్‌ల లైంగికీకరణ ఉదాహరణకు, పిల్లల లైంగిక వేధింపులను లేదా పిల్లలను లైంగిక దుర్వినియోగానికి దారితీసే రీతిలో చిత్రీకరించడం, ప్రోత్సహించే ఇమేజ్‌లు.
  • చిన్నారుల అక్రమ రవాణా ఉదాహరణకు, వాణిజ్యపరమైన లైంగికంగా పిల్లలపై దాడి చేసే నిమిత్తం చిన్నారి కోసం అడ్వర్టయిజింగ్ లేదా విన్నపాలు.

Google సర్వీస్‌లలో క్రియేట్ చేసిన, షేర్ చేసిన, పంపిన లేదా అప్‌లోడ్ చేసిన అంశాలు ఏవైనా ఈ కంటెంట్ పరిధిలోకి వస్తాయి.

చిన్నారులకు కీడు తలపెట్టిన సందర్భాలు మాకు ఎదురైనప్పుడు, మేము తగిన చర్యలు తీసుకుంటాము. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ & ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ లేదా చట్ట పరిరక్షణ వ్యవస్థకు చిన్నారుల వేధింపు గురించి రిపోర్ట్ చేసి, ఖాతాలను డిజేబుల్ చేయడం వంటి చర్యలను మేము తీసుకోవచ్చు.

మాకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట కమ్యూనికేషన్ సర్వీస్‌ల గురించి గమనించండి:

కేవలం యూరోపియన్ యూనియన్‌లో, (EU) 2021/1232 చట్టం ప్రకారం మాకు సంబంధించిన నిర్దిష్ట కమ్యూనికేషన్ సర్వీస్‌లు ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక చర్యలను గుర్తిస్తాయి, ఇవి 2002/58/EC డైరెక్టివ్ ప్రకారం ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక చర్యలను ఎదుర్కొనే ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్‌లకు సంబంధించిన గోప్యత నుండి మినహాయింపును అందిస్తాయి. 2021/1232 నియంత్రణ చట్టం ప్రకారం, మీ ఖాతా పొరపాటున డిజేబుల్ చేయబడిందని మీరు భావిస్తే, రివ్యూను రిక్వెస్ట్ చేయడంతో పాటు అదనంగా మీరు మీ దేశ సందర్భోచిత డేటా ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. మీకు అధికార పరిధి గల న్యాయస్థానం ముందు న్యాయపరమైన పరిష్కారాన్ని పొందే హక్కు కూడా ఉంది.

వ్యక్తులను మోసగించడానికి తప్పుడు గుర్తింపును క్రియేట్ చేయడం

ఏదైనా చర్య తీసుకునే విధంగా వ్యక్తులను మాయ చేయడం కోసం తప్పుడు గుర్తింపును క్రియేట్ చేయడానికి (సోషల్ ఇంజనీరింగ్) Google సర్వీస్‌లను ఉపయోగించకండి. ఎవరైనా వ్యక్తి సంబంధం లేని కంపెనీ లేదా ప్రభుత్వ సంస్థ తరఫున పని చేస్తున్నట్లుగా సూచిస్తూ Gmail ఖాతాను క్రియేట్ చేయడం ఉల్లంఘన పరిధిలోకి వస్తుంది.

అయితే, సెలెబ్రిటీ పేరు మీద అభిమానిగా ఇమెయిల్ ఖాతాను క్రియేట్ చేయడం లాంటి వినియోగాలు ఫర్వాలేదు.

ఎగుమతి లేదా ఆంక్షల చట్ట ఉల్లంఘనలు

వర్తించే ఎగుమతి లేదా ఆంక్షల చట్టాల ఉల్లంఘనకు కారణమయ్యే విధంగా Google సర్వీస్‌లను గానీ లేదా మీ ఖాతాను గానీ ఉపయోగించవద్దు.

మీరు లేదా మీ సంస్థ అనుమతి పొందిన పార్టీ లేదా అనుమతి పొందిన వ్యక్తి లేదా సంస్థ తరపున పనిచేస్తే, మీ ఖాతా ఏదైనా అనుబంధ ఖాతాలు డిజేబుల్ చేయబడవచ్చు.

పీడించడం, జులుం చలాయించడం, & బెదిరింపులు
ఇతరులను పీడించకండి, జులుం చలాయించకండి, లేదా బెదిరించకండి. ఈ యాక్టివిటీలలో ఇతరులను ఎంగేజ్ చేయడానికి లేదా ప్రేరేపించడానికి Google సర్వీస్‌లను ఉపయోగించడానికి మేము అనుమతించము.
ఆన్‌లైన్ వేధింపులు చాలా ప్రదేశాలలో చట్టవిరుద్ధం, అలాగే వాటికి తీవ్రమైన ఆఫ్‌లైన్ పర్యవసానాలు ఉంటాయని గుర్తుంచుకోండి.
హాని కలిగించే బెదిరింపులు లేదా ఇతర ప్రమాదకరమైన పరిస్థితుల గురించి మాకు సమాచారం అందినట్లయితే, మేము తగిన చర్య తీసుకోవడంతో పాటూ మీ గురించి సంబంధిత అధికార యంత్రాంగానికి రిపోర్ట్ చేసే అవకాశం ఉంది.
అధిక కాల్ వాల్యూమ్‌లు

ఆర్థిక లాభం కోసం అధిక సంఖ్యలో కాల్‌లను టెలిఫోన్ ఎక్స్‌ఛేంజ్‌కు పంపడానికి (ట్రాఫిక్ పంపింగ్) Google సర్వీస్‌లను ఉపయోగించకండి.

మరొక వ్యక్తిలా నటించడం & గుర్తింపును తప్పుదోవ పట్టించడం
మరొక వ్యక్తి లేదా సంస్థలాగా నటించకండి లేదా తప్పుదోవ పట్టించకండి.

మీ స్వంత దేశాన్ని తప్పుగా సూచించవద్దు లేదా దాచిపెట్టవద్దు, రాజకీయాలకు చెందిన కంటెంట్‌ను, సామాజిక సమస్యలను లేదా ప్రజలకు సంబంధించిన విషయాలను తప్పుదారి పట్టించేలా ఇతర దేశంలోని యూజర్‌లకు క్రియేట్ చేయడం లేదా పంపిణీ చేయడం వంటివి చేయవద్దు.

పేరడీలు, వ్యంగ్య రచనలు, మారు పేర్లు లేదా కలం పేర్లను మేము అనుమతిస్తాము. మీ నిజమైన గుర్తింపు విషయంలో ప్రేక్షకులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నివారించండి.
మాల్‌వేర్, ఫిషింగ్ & ఇతర హానికరమైన యాక్టివిటీలు

వీటి కోసం Google సర్వీస్‌లను ఉపయోగించకండి:

  • మాల్‌వేర్: వైరస్‌లు వంటి, హానికరమైన లేదా అవాంఛితమైన కోడ్ లేదా సాఫ్ట్‌వేర్‌ను పంపడం.
  • ఫిషింగ్:దొంగిలించడం ద్వారా, లేదా వారే షేర్ చేసేలా వ్యక్తులను మోసం చేయడం ద్వారా, ప్రైవేట్ సమాచారాన్ని పొందడం.
  • Google నెట్‌వర్క్‌లు, సర్వర్‌లు, లేదా ఇతర సిస్టమ్‌లకు హాని కలిగించడం లేదా వాటిలో జోక్యం చేసుకోవడం (ఉదా. సైబర్ దాడులు).
సమ్మతి లేకుండా రూపొందిన అభ్యంతరకర ఇమేజ్‌లు, లైంగిక బెదిరింపు

సమ్మతి లేకుండా మరొక వ్యక్తికి చెందిన లైంగిక స్వభావం యొక్క అందరికీ తగని, అంతరంగిక లేదా ఇబ్బందికరమైన కంటెంట్‌ను బహిర్గతం చేస్తామని లేదా ప్రచారం చేస్తామని బెదిరించవద్దు.

లైంగిక స్వభావం గల వారి అందరికీ తగని, అంతరంగిక లేదా ఇబ్బందికరమైన కంటెంట్‌ను ప్రచారం చేసే బెదిరింపు ద్వారా ఒక వ్యక్తి నుండి ఆర్థిక లాభం లేదా ఇతర లైంగిక కంటెంట్‌ను పొందటం కోసం బలవంతం చేయవద్దు (అధికారం, ప్రభావం లేదా ఒత్తిడిని ఉపయోగించి), ప్రోత్సహించవద్దు, లేదా అభ్యర్థించవద్దు.

ఆన్‌లైన్ వేధింపులు చాలా ప్రదేశాలలో చట్టవిరుద్ధం, అలాగే వాటికి తీవ్రమైన ఆఫ్‌లైన్ పర్యవసానాలు ఉంటాయి.

లైంగికంగా అందరికీ తగని కంటెంట్
ఈ కింది వాటితో సహా లైంగికంగా అందరికీ తగని కంటెంట్‌ను పంపిణీ చేయకండి:
  • నగ్నత్వం
  • గ్రాఫిక్ లైంగిక చర్యలు
  • అశ్లీల కంటెంట్
  • వాణిజ్యపరమైన అశ్లీల సైట్‌లకు ట్రాఫిక్‌ను మళ్లించడం
విద్యాపరమైన, డాక్యుమెంటరీ, శాస్త్రీయ లేదా కళాత్మక ప్రయోజనాలకు కంటెంట్‌ను మేము అనుమతిస్తాము.
స్పామ్ చేయడం

ఎవరికైనా స్పామ్ అని పిలవబడే అవాంఛిత కంటెంట్‌ను పంపడానికి Google సర్వీస్‌లను ఉపయోగించకండి.

ఇమెయిల్‌లు, కామెంట్‌లు, ఫోటోలు, రివ్యూలు, లేదా Google సర్వీస్‌లలో క్రియేట్ చేసిన లేదా షేర్ చేసిన కంటెంట్ ఏదైనా స్పామ్ కావచ్చు.

ఇక్కడ కొన్ని సాధారణ నియమాలను అందిస్తున్నాము:

  • అవాంఛిత ప్రమోషనల్ లేదా వాణిజ్య సంబంధిత కంటెంట్‌ను పంపడాన్ని నివారించండి.
  • మీకు తెలియని వ్యక్తులకు లేదా ఒకే సమయంలో అనేక మంది వ్యక్తులకు కంటెంట్‌ను పంపకండి.
ఉగ్రవాద సంబంధిత కంటెంట్

ఈ కింది వాటిని ఉద్దేశించే కంటెంట్‌ను షేర్ చేయడానికి Google సర్వీస్‌లను ఉపయోగించకండి:

  • ఉగ్రవాద సంస్థలలో చేర్చడానికి
  • హింసను ప్రేరేపించడానికి
  • ఉగ్రవాద దాడులను వీరోచితంగా చూపడానికి
  • ఉగ్రవాద చర్యలను ప్రమోట్ చేయడానికి
అర్హత లేని విద్యా సంస్థ
  • Google Workspace for Education ఖాతాను క్రియేట్ చేస్తున్నప్పుడు విద్యా సంస్థ లాగ నటించవద్దు.
  • Google Workspace for Education ఖాతా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీ అర్హతలను తప్పుగా సూచించవద్దు. అర్హతల గురించి మరింత తెలుసుకోండి.
దుర్వినియోగం చేయడం కోసం అనేక ఖాతాలను ఉపయోగించడం
  • Google పాలసీలను ఉల్లంఘించడానికి అనేక ఖాతాలను క్రియేట్ చేయకండి లేదా ఉపయోగించకండి.
  • నకిలీ ఖాతాలను క్రియేట్ చేయడానికి ప్రోగ్రామ్‌లను (వీటిని బాట్‌లు అని పిలుస్తారు) ఉపయోగించకండి.

దుర్వినియోగం కోసం రూపొందించిన ఖాతాలను Google ఆటోమేటిక్‌గా గుర్తించి, డిజేబుల్ చేస్తుంది.

చాలా మంది వ్యక్తులు వ్యక్తిగత ఖాతా, అలాగే వర్క్ ఖాతా వంటి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటారు. అలా ఉపయోగించడంలో తప్పులేదు.

చెల్లుబాటు అయ్యే చట్టపరమైన రిక్వెస్ట్‌లు
రిక్వెస్ట్ వచ్చిన తర్వాత, కొన్ని సార్లు సంబంధిత చట్టాల ప్రకారం లేదా న్యాయస్థాన ఆదేశం మేరకు మేము చర్యను తీసుకుంటాము. చట్టపరమైన రిక్వెస్ట్‌‌లను ఇక్కడ సమర్పించండి.

డిజేబుల్ చేయబడిన ఖాతాల పాలసీలో మార్పులను కనుగొనండి

మా 'డిజేబుల్ చేయబడిన ఖాతాల పాలసీ'లో మార్పుల గురించి తెలుసుకోండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4450961228611053105
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false