కాష్‌ను & కుక్కీలను క్లియర్ చేయండి

Chrome లాంటి బ్రౌజర్‌ను మీరు ఉపయోగించినప్పుడు, అది దాని కాష్‌లోను, కుక్కీలలోను వెబ్‌సైట్‌ల నుండి కొంత సమాచారాన్ని సేవ్ చేస్తుంది. వాటిని క్లియర్ చేయడం వల్ల, సైట్‌లలో ఎదురయ్యే నిర్దిష్ట సమస్యలు పరిష్కరించబడతాయి, అంటే లోడ్ చేయడం లేదా ఫార్మాట్ చేయడం వంటి వాటిలో ఎదురయ్యేవి.

Chromeలో

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న, మరిన్ని, మరిన్ని ఆ తర్వాత బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. చివరి గంట లేదా మొత్తం సమయం వంటి సమయ పరిధిని ఎంచుకోండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న సమాచారం రకాలను ఎంచుకోండి.
  5. డేటాను క్లియర్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Chromeలో మరిన్ని కుక్కీ సెట్టింగ్‌లను ఎలా మార్చాలో తెలుసుకోండి. ఉదాహరణకు, మీరు నిర్దిష్ట సైట్ కోసం కుక్కీలను తొలగించవచ్చు.

ఇతర బ్రౌజర్‌లలో

ఒకవేళ మీరు Safari, Firefox, లేదా మరొక బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, సూచనల కోసం దాని సపోర్ట్ సైట్‌ను చెక్ చేయండి.

మీరు ఈ సమాచారాన్ని క్లియర్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది

మీరు కాష్‌ను, కుక్కీలను క్లియర్ చేసిన తర్వాత:

  • సైట్‌లలోని కొన్ని సెట్టింగ్‌లు తొలగించబడతాయి. ఉదాహరణకు, మీరు సైన్ ఇన్ చేసి ఉన్నట్లయితే, మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
  • ఒకవేళ మీరు Chromeలో సింక్‌ను ఆన్ చేసినట్లయితే, మీ పరికరాలన్నిటిలో మీ డేటాను తొలగించడం కోసం మీరు సింక్ చేస్తున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయబడే ఉంటారు.
  • కొన్ని సైట్‌లు మరింత నెమ్మదిగా ఉన్నట్లు అనిపించవచ్చు, ఎందుకంటే ఇమేజ్‌ల లాంటి కంటెంట్ మళ్లీ లోడ్ కావలసి ఉంటుంది.

కాష్ & కుక్కీలు ఎలా పని చేస్తాయి

  • మీరు సందర్శించే సైట్‌ల ద్వారా రూపొందించబడిన ఫైల్‌లను కుక్కీలు అంటారు. అవి బ్రౌజింగ్ డేటాను సేవ్ చేయడం ద్వారా మీ ఆన్‌లైన్ అనుభవాన్ని మరింత సులభం చేస్తాయి.
  • మీ తర్వాతి సందర్శన సమయంలో పేజీలను వేగంగా తెరవడంలో సహాయపడటానికి, ఇమేజ్‌ల లాంటి పేజీలలోని భాగాలను కాష్ గుర్తుంచుకుంటుంది.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7370384945614650233
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false