వెబ్‌లో మీ భాషను మార్చండి

Google సర్వీస్‌లు అన్ని Google భాషలలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా డిస్‌ప్లే భాషను మీ ప్రాధాన్య భాషకు మార్చవచ్చు.
ఈ సూచనలు కేవలం వెబ్‌లో మాత్రమే మీరు ఉపయోగించే Google సర్వీస్‌లలో మీ ప్రాధాన్య భాషను మార్చడానికి ఉద్దేశించినవి. మీ మొబైల్ యాప్‌ల కోసం ప్రాధాన్య భాషను మార్చడానికి, మీ పరికరంలోని భాషా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.

మీ వెబ్ భాషా సెట్టింగ్‌లను మార్చండి

  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్‌ను తెరవండి.
  2. కుడి ఎగువ భాగంలో, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. ఎగువున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని ట్యాప్ చేయండి.
  4. "వెబ్ కోసం సాధారణ ప్రాధాన్యతల"కు స్క్రోల్ చేయండి.
  5. భాష ఆ తర్వాతఎడిట్ చేయండి Editను ట్యాప్ చేయండి.
  6. మీ ప్రాధాన్య భాష కోసం సెర్చ్ చేయండి, ఎంచుకోండి.
  7. దిగువున ఉన్న, ఎంచుకోండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  8. మీరు పలు భాషలను అర్థం చేసుకునేట్లయితే, + మరొక భాషను జోడించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు Gmailను ఉపయోగించకపోతే, మీరు మీ భాషా ప్రాధాన్యతలను మార్చిన తర్వాత, మీ బ్రౌజర్‌ను మూసివేసి, తిరిగి తెరవండి.

మీ iPhone లేదా iPadలోని భాషను మార్చండి

మీ iPhone లేదా iPad భాషను మార్చడానికి, సూచనల కోసం Apple సపోర్ట్ సైట్‌ను చెక్ చేయండి.

Google ఆటోమేటిక్‌గా యాడ్ చేసిన భాషలను ఎలా ఉపయోగించాలి

మీరు Google సర్వీస్‌లలో తరచుగా ఉపయోగించే భాషలను Google ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తుంది. Google ఒక భాషను యాడ్ చేసినప్పుడు, ఇది మీ కోసం యాడ్ చేసినది Added for youగా లేబుల్ చేయబడుతుంది.
  1. మీ iPhone లేదా iPadలో, Gmail యాప్‌ను తెరవండి.
  2. కుడి ఎగువ భాగంలో, మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. ఎగువున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని ట్యాప్ చేయండి.
  4. "వెబ్ కోసం సాధారణ ప్రాధాన్యతల"కు స్క్రోల్ చేయండి.
  5. భాషపై ట్యాప్ చేయండి.
    • మీ కోసం జోడించిన భాషను నిర్ధారించడానికి: సేవ్ చేయండిఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • Google ద్వారా జోడించబడిన భాషను తీసివేయడానికి: తొలగించండిDeleteని ట్యాప్ చేయండి.
    • భాషలను ఆటోమేటిక్‌గా జోడించకుండా Googleను ఆపడానికి: భాషలను ఆటోమేటిక్‌గా జోడించండి ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

మీ భాషా సెట్టింగ్‌లను Google ఎలా ఉపయోగిస్తుంది

Google సర్వీస్‌లను మరింత ఉపయోగకరంగా చేయడానికి Google మీ భాషా సెట్టింగ్‌లను ఉపయోగిస్తుంది. మీ భాషను మీరు పేర్కొన్నప్పుడు, మీరు ప్రాధాన్యతనిచ్చే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో మీ కంటెంట్, ఫలితాలను చూపించడంలో, అలాగే యాడ్‌ల వంటి, మరింత సందర్భోచితమైన, మీకు బాగా ఆసక్తి ఉన్న అనుకూలమైన కంటెంట్‌ను అందించడానికి మాకు సహాయపడతారు.

భాషను మార్చడంలో సమస్యలను పరిష్కరించండి

మీ Google ఖాతా భాషను చెక్ చేయడానికి Google ఖాతాను తెరవండి. మీరు ఎంచుకున్న భాష మీకు కనిపిస్తుంది.

  • భాష మార్పు పని చేయలేదు: మీ Google ఖాతా మీరు ఎంచుకున్న భాషతో సరిపోలకపోతే, మీ బ్రౌజర్ కాష్, కుకీలను క్లియర్ చేసి భాషను మళ్లీ సెట్ చేయండి.
    చిట్కా: కుక్కీలను తొలగించడం వలన మీరు సందర్శించిన ఇతర సైట్‌ల కోసం మీ సేవ్ చేసిన సెట్టింగ్‌లను కూడా తీసివేస్తుంది.
  • మీ భాషను లిస్ట్ చేయలేదు: మా ప్రోడక్ట్‌ల కోసం మరిన్ని భాషలకు సపోర్ట్ చేయడానికి మేము పని చేస్తాము. మీరు అందుబాటులో లేని ఒక ప్రాథమిక భాషను ఎంచుకుంటే, ప్రత్యామ్నాయ భాషను ఎంచుకోమని మేము మిమ్మల్ని అడగవచ్చు. ప్రత్యామ్నాయ భాష అవసరమైతే, మీ Google ఖాతా భాషా విభాగంలో, మీ ప్రాథమిక భాష కింద లిస్ట్ చేసిన మీ ప్రత్యామ్నాయ భాషను మీరు కనుగొనవచ్చు. దానిని మార్చడానికి మీరు భాషను ఎంచుకోవచ్చు.
  • నేను మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తాను: మీ ప్రాధాన్య భాషకు చేసిన మార్పులు వెబ్‌లో ప్రతిబింబిస్తాయి. మొబైల్ యాప్‌ల కోసం ప్రాధాన్య భాషను మార్చడానికి, మీ పరికరంలోని భాషా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12096990415782764478
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false