శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను, మరింత సురక్షితమైన ఖాతాను క్రియేట్ చేయండి

సురక్షితమైన పాస్‌వర్డ్, అప్‌డేట్ చేయబడిన రికవరీ సమాచారం అనేవి మీ Google ఖాతాను రక్షించడంలో సహాయపడతాయి. మీ పాస్‌వర్డ్ ఊహించడానికి కష్టంగా ఉండాలి, మీ పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉండకూడదు.

1వ దశ: శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి

శక్తివంతమైన పాస్‌వర్డ్ మీకు ఈ కింది వాటికి సహాయపడుతుంది:

  • మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి
  • మీ ఇమెయిల్‌లను, ఫైల్‌లను, ఇతర కంటెంట్‌ను రక్షించండి
  • మీ ఖాతాలోకి రాకుండా వేరొకరిని నిరోధించండి

పాస్‌వర్డ్ అవసరాలను పూర్తి చేయండి

మీ పాస్‌వర్డ్ అనేది అక్షరాలు, నంబర్‌లు, లేదా చిహ్నాల కలయిక ఏదైనా అవ్వొచ్చు (ASCII-స్టాండర్డ్ అక్షరాలు మాత్రమే). ఉచ్చారణలకు, ఉచ్చారణ అక్షరాలకు సపోర్ట్ ఉండదు.

పాస్‌వర్డ్ ఇలా ఉన్నప్పుడు మీరు దానిని ఉపయోగించలేరు:

  • ప్రత్యేకించి బలహీనంగా ఉంది. ఉదాహరణ: "password123"
  • మీ ఖాతాలో ఇంతకు ముందు మీరు దానిని ఉపయోగించారు
  • అది ఖాళీ స్పేస్‌తో ప్రారంభమవుతుంది లేదా ముగుస్తుంది

మంచి పాస్‌వర్డ్ కోసం చిట్కాలను ఫాలో అవ్వండి

శక్తివంతమైన పాస్‌వర్డ్ మీకు మాత్రమే గుర్తుంటుంది, వేరొకరికి దానిని ఊహించడం దాదాపు అసాధ్యం. మంచి పాస్‌వర్డ్ అంటే ఏమిటో తెలుసుకోండి, ఆపై స్వంతంగా మీరు దానిని క్రియేట్ చేసుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

మీ పాస్‌వర్డ్‌ను ఒక ప్రత్యేకమైన దానిగా చేయండి

మీ ఇమెయిల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి మీ ప్రతి ముఖ్య ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.

ముఖ్య ఖాతాల కోసం పాస్‌వర్డ్‌లను తిరిగి ఉపయోగించడం ప్రమాదకరం. మీ ఖాతాకు వేరొకరు పాస్‌వర్డ్‌ను పొందినట్లయితే, వారు మీ ఇమెయిల్, అడ్రస్‌లనే కాక, మీ డబ్బును కూడా యాక్సెస్ చేయగలరు.

చిట్కా: మీకు బహుళ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో సమస్య ఉంటే, మీరు సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయడానికి టూల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

మీ పాస్‌వర్డ్‌ను మరింత పొడవైనదిగా, మరింత గుర్తుండిపోయేలా ఉంచండి

పొడవైన పాస్‌వర్డ్‌లు శక్తివంతంగా ఉంటాయి, కాబట్టి మీ పాస్‌వర్డ్‌ను కనీసం 12 అక్షరాల పొడవుగా చేయండి. గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండే పొడవైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడతాయి. వీటిని ఉపయోగించి చూడండి:

  • పాట లేదా పద్యం యొక్క సాహిత్యం
  • సినిమా లేదా ప్రసంగం నుండి అర్థవంతమైన ఒక కోట్
  • పుస్తకం నుండి ఒక భాగము
  • మీకు అర్ధవంతంగా అనిపించే పదాల శ్రేణి
  • సంక్షిప్తీకరణ: వాక్యంలోని ప్రతి పదంలో ఉండే మొదటి అక్షరంతో పాస్‌వర్డ్‌ను రూపొందించండి

వీరి ద్వారా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లను ఎంచుకోవడాన్ని నివారించండి:

  • మీకు తెలిసిన వ్యక్తులు
  • సులభంగా యాక్సెస్ చేయగల (మీ సోషల్ మీడియా ప్రొఫైల్ వంటి) సమాచారాన్ని చూస్తున్న వ్యక్తులు

వ్యక్తిగత సమాచారం, అలాగే సాధారణ పదాలను నివారించండి

వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవద్దు

ఇతరులకు తెలిసేది లేదా వారు సులభంగా తెలుసుకోగలిగే సమాచారం నుండి పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేయడాన్ని నివారించండి. ఉదాహరణలు:

  • మీ మారుపేరు లేదా మొదటి అక్షరాలు
  • మీ చిన్నారి లేదా పెంపుడు జంతువు పేరు
  • ముఖ్యమైన పుట్టినరోజులు లేదా సంవత్సరాలు
  • మీ వీధి పేరు
  • మీ అడ్రస్ నుండి నంబర్‌లు
  • మీ ఫోన్ నంబర్

సాధారణ పదాలు, ఆకృతులను ఉపయోగించవద్దు

ఊహించడం సులభం అయిన సాధారణ పదాలు, పదబంధాలు, ఆకృతులను నివారించండి. ఉదాహరణలు:

  • "పాస్‌వర్డ్" లేదా "letmein" వంటి సులభమైన పదాలు, పదబంధాలు
  • "abcd" లేదా "1234" వంటి క్రమాలు
  • కీబోర్డ్ నమూనాలు "qwerty" లేదా "qazwsx"

పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచండి

మీరు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసిన తర్వాత, దాన్ని సురక్షితంగా ఉంచడానికి దశలను పాటించండి.

రాయబడిన పాస్‌వర్డ్‌లను దాచండి

మీ పాస్‌వర్డ్‌ను ఒకవేళ మీరు రాయవలసి వస్తే, దాన్ని మీ కంప్యూటర్‌లో లేదా డెస్క్‌పై ఉంచవద్దు. రాయబడిన పాస్‌వర్డ్ ఏదైనా రహస్యంగా లేదా లాక్ చేయబడిన చోట స్టోర్ చేశారని నిర్ధారించుకోండి.

మీ పాస్‌వర్డ్‌లను ఒక టూల్‌తో మేనేజ్ చేయండి

మీకు అనేక పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో సమస్య ఉంటే, విశ్వసనీయ పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించి చూడండి. ఈ సర్వీస్‌లకు సంబంధించిన రివ్యూలు, వాటి ప్రసిద్ధి గురించి పరిశోధన చేయడానికి కొంత సమయం కేటాయించండి.

మీ కోసం పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి మీ Google ఖాతాను కూడా మీరు ఉపయోగించవచ్చు.

దశ 2: ఎవరికైనా మీ పాస్‌వర్డ్ అందినట్లయితే దానికి సిద్ధంగా ఉండండి

మీ ఖాతాలో అసాధారణ యాక్టివిటీని మేము గుర్తించినట్లయితే మీకు సహాయం చేయడానికి మీ రికవరీ సమాచారం ఉపయోగించబడుతుంది.

రికవరీ ఈమెయిల్ అడ్రస్‌ను జోడించండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. కాంటాక్ట్ సమాచారం ప్యానెల్‌లో, ఇమెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. రికవరీ ఇమెయిల్‌ను జోడించును క్లిక్ చేయండి.

రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. కాంటాక్ట్ సమాచారం ప్యానెల్‌లో, ఫోన్‌ను క్లిక్ చేయండి.
  4. రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండిని క్లిక్ చేయండి.

మీకు ఇలా సహాయపడటానికి రికవరీ సమాచారం ఉపయోగపడవచ్చు:

  • మీ ఖాతాను వేరొకరు ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవడం
  • మీ పాస్‌వర్డ్‌ను వేరెవరైనా ఒకవేళ తెలుసుకుంటే మీ ఖాతాను తిరిగి పొందడం
  • మీ పాస్‌వర్డ్‌ను మీరు మరచిపోయినట్లయితే లేదా వేరే ఏదైనా కారణం వల్ల మీరు సైన్ ఇన్ చేయలేకపోతే మీ ఖాతాలోకి ప్రవేశించడం

మీ ఖాతాను మరింత సురక్షితంగా చేయండి

మీ ఖాతా భద్రతను మెరుగుపరచడానికి వ్యక్తిగతీకరించిన సలహాలను పొందండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2245620318222383707
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false