మీ లొకేషన్ హిస్టరీ‌ని మేనేజ్ చేయండి

రాబోయే నెలల్లో, లొకేషన్ హిస్టరీ సెట్టింగ్ పేరు టైమ్‌లైన్‌కు మారుతుంది. మీ ఖాతా కోసం లొకేషన్ హిస్టరీ ఆన్ చేయబడితే, మీరు మీ యాప్, ఖాతా సెట్టింగ్‌లలో టైమ్‌లైన్‌ను కనుగొనవచ్చు.

లొకేషన్ హిస్టరీ అనేది Google ఖాతా సెట్టింగ్, ఇది ఈ కింది వాటిని గుర్తుంచుకోవడానికి సహాయపడే టైమ్‌లైన్‌ను, వ్యక్తిగత మ్యాప్‌ను క్రియేట్ చేస్తుంది: 

  • మీరు వెళ్లే స్థలాలు
  • గమ్యస్థానాలకు మార్గాలు
  • మీరు చేసే ట్రిప్‌లు

ఇది మీరు వెళ్లే చోటు ఆధారంగా Google అంతటా వ్యక్తిగతీకరించబడిన అనుభవాలను కూడా అందిస్తుంది.

లొకేషన్ హిస్టరీ ఆన్ చేసి ఉన్నప్పుడు, Google యాప్‌లు ఉపయోగించనప్పటికీ, మీ ఖచ్చితమైన పరికర లొకేషన్ క్రమం తప్పకుండా ఇక్కడ పేర్కొన్న వాటికి సేవ్ చేయబడుతుంది:

  • మీ పరికరాలు 
  • Google సర్వర్‌లు

Google అనుభవాలను అందరికీ ఉపయోగపడేలా చేయడానికి, మేము మీ డేటాను ఇక్కడ పేర్కొన్న వాటి కోసం ఉపయోగించవచ్చు:

  • అజ్ఞాతీకరించిన లొకేషన్ డేటా ఆధారంగా కింది అంశాల సమాచారాన్ని చూపించడానికి:
    • రద్దీగా ఉండే సమయాలు
    • పర్యావరణ గణాంకాలు
  • మోసం, దుర్వినియోగాన్ని గుర్తించి, నివారించడంలో సహాయపడటానికి.
  • యాడ్స్ ప్రోడక్ట్‌లతో సహా Google సర్వీస్‌లను మెరుగుపరచడం, అలాగే డెవలప్ చేయడానికి.
  • మీకు వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ చేసి ఉంటే, ఏదైనా యాడ్ కారణంగా వ్యక్తులు తమ స్టోర్‌లను సందర్శిస్తున్నారా అనేది తెలుసుకోవడంలో బిజినెస్‌లకు సహాయపడటానికి.
    • మేము బిజినెస్‌లతో అజ్ఞాత అంచనాలను మాత్రమే షేర్ చేస్తాము, వ్యక్తిగత డేటాను కాదు.
    • ఈ యాక్టివిటీ మీ పరికరం తాలూకు జనరల్ ఏరియా, IP అడ్రస్‌కు సంబంధించిన మీ లొకేషన్ గురించిన సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.

Google లొకేషన్ డేటాను ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

లొకేషన్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:

  • లొకేషన్ హిస్టరీ ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయబడి ఉంటుంది. మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేస్తే మాత్రమే మేము దానిని ఉపయోగించగలము.
  • మీరు Google ఖాతా యాక్టీవిటీ కంట్రోల్స్‌లో ఎప్పుడైనా లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేయవచ్చు.
  • మీరు లొకేషన్ హిస్టరీని రివ్యూ చేసి, మేనేజ్ చేయవచ్చు. మీరు వీటిని చేయవచ్చు:
    • Google Maps టైమ్‌లైన్‌లో మీరు వెళ్లిన స్థలాలను రివ్యూ చేయవచ్చు.
    • ఎప్పుడైనా మీ లొకేషన్ హిస్టరీని ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని Android 8.0, ఆపైన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

లొకేషన్ హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీ ఖాతాకు లొకేషన్ హిస్టరీని మీరు ఎప్పుడైనా ఆఫ్ చేయవచ్చు. మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తుంటే, మీ అడ్మినిస్ట్రేటర్ ఈ సెట్టింగ్‌ను మీకు అందుబాటులో ఉంచాలి. వారు అలా ఉంచినట్లయితే, ఇతర యూజర్‌ల లాగానే మీరు లొకేషన్ హిస్టరీని ఉపయోగించగలరు.

  1. మీ Google ఖాతాలో "లొకేషన్ హిస్టరీ" విభాగానికి వెళ్లండి.
  2. మీ ఖాతా లేదా మీ పరికరాలు Googleకు లొకేషన్ హిస్టరీని రిపోర్ట్ చేయవచ్చా, లేదా అనేదాన్ని ఎంచుకోండి.
    • మీ ఖాతా, అలాగే అన్ని పరికరాలు: పైన ఉన్న, లొకేషన్ హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
    • ఒక నిర్దిష్ట పరికరం మాత్రమే: "ఈ పరికరం" లేదా "ఈ ఖాతాను ఉపయోగిస్తున్న పరికరాల" కింద, పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

లొకేషన్ హిస్టరీ ఆన్‌లో ఉన్నప్పుడు

Google మీ లొకేషన్‌ను దీనితో అంచనా వేయగలదు:

  • Wi-Fi, మొబైల్ నెట్‌వర్క్‌ల వంటి సిగ్నల్స్
  • GPS
  • సెన్సార్ సమాచారం

బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మీ పరికర లొకేషన్ కాలానుగుణంగా ఉపయోగించబడవచ్చు. లొకేషన్ హిస్టరీ ఆన్ చేసి ఉన్నప్పుడు, Google యాప్‌లు ఉపయోగించనప్పటికీ, మీ పరికరపు ఖచ్చితమైన లొకేషన్ క్రమం తప్పకుండా ఇక్కడ పేర్కొన్న వాటికి సేవ్ చేయబడుతుంది:

  • మీ పరికరాలు
  • Google సర్వర్‌లు

మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, “ఈ ఖాతాలోని పరికరాలు” సెట్టింగ్ ఆన్ చేసి ఉంటే, ఇది ప్రతి పరికర లొకేషన్ హిస్టరీను సేవ్ చేస్తుంది మీరు ఈ సెట్టింగ్‌ను మీ Google ఖాతాలోని లొకేషన్ హిస్టరీ సెట్టింగ్‌లలో కనుగొనవచ్చు.

లొకేషన్ హిస్టరీకి ఏ పరికరాలు వాటి లొకేషన్ డేటాను అందించాలో మీరు ఎంచుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన లాంటి మీ పరికరంలోని ఇతర లొకేషన్ సర్వీస్‌ల కోసం మీ సెట్టింగ్‌లు మారవు:

లొకేషన్ హిస్టరీ ఆఫ్‌లో ఉన్నప్పుడు

మీ పరికరం దాని లొకేషన్‌ను మీ లొకేషన్ హిస్టరీలో సేవ్ చేయదు.

  • మీ ఖాతాలో మునుపటి లొకేషన్ హిస్టరీ డేటా ఉండవచ్చు. మీరు దాన్ని మాన్యువల్‌గా ఎప్పుడైనా తొలగించవచ్చు.
  • ఈ కింద ఇచ్చిన లాంటి మీ పరికరంలోని ఇతర లొకేషన్ సర్వీస్‌ల కోసం మీ సెట్టింగ్‌లు మారవు:
  • వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి సెట్టింగ్‌లు ఆన్‌లో ఉండి, ఒకవేళ మీరు లొకేషన్ హిస్టరీను ఆఫ్ చేసినా లేదా లొకేషన్ హిస్టరీ నుండి లొకేషన్ డేటాను తొలగించినా, మీ ఇతర Google సైట్‌లు, యాప్‌లు, సర్వీస్‌ల వినియోగంలో భాగంగా ఇప్పటికీ మీ Google ఖాతాలో లొకేషన్ డేటా సేవ్ చేయబడి ఉండవచ్చు. ఈ యాక్టివిటీ మీ పరికరం తాలూకు జనరల్ ఏరియా, IP అడ్రస్‌కు సంబంధించిన మీ లొకేషన్ గురించిన సమాచారాన్ని కలిగి ఉండవచ్చు.

లొకేషన్ హిస్టరీని తొలగించండి

మీరు Google Maps టైమ్‌లైన్‌తో మీ లొకేషన్ హిస్టరీ సమాచారాన్ని మేనేజ్ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు. మీరు మీ లొకేషన్ హిస్టరీ మొత్తాన్ని, లేదా దానిలోని కొంత భాగాన్ని మాత్రమే తొలగించడానికి ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: మీరు టైమ్‌లైన్ నుండి లొకేషన్ హిస్టరీ సమాచారాన్ని తొలగించినప్పుడు, అది మీకు మళ్లీ కనిపించదు.

Google Maps యాప్‌ను ఉపయోగించండి

లొకేషన్ హిస్టరీ మొత్తాన్ని తొలగించండి

  1. మీ Android పరికరంలో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ Account Circle ఆ తర్వాత మీ టైమ్‌లైన్ Timelineను ట్యాప్ చేయండి.
  3. పైన కుడి వైపున, 'మరిన్ని  ఆ తర్వాత సెట్టింగ్‌లు, గోప్యత'ను ట్యాప్ చేయండి.
  4. "లొకేషన్ సెట్టింగ్‌ల" కింద, 'లొకేషన్ హిస్టరీ మొత్తాన్ని తొలగించండి' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

లొకేషన్ హిస్టరీ పరిధిని తొలగించండి

  1. మీ Android పరికరంలో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ Account Circle ఆ తర్వాత మీ టైమ్‌లైన్ Timelineను ట్యాప్ చేయండి.
  3. 'మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు, గోప్యతను' ట్యాప్ చేయండి.
  4. "లొకేషన్ సెట్టింగ్‌ల" కింద, 'లొకేషన్ హిస్టరీ పరిధిని తొలగించండి' అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

లొకేషన్ హిస్టరీ నుండి ఒక రోజును తొలగించండి

  1. మీ Android పరికరంలో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ Account Circle ఆ తర్వాత మీ టైమ్‌లైన్ Timelineను ట్యాప్ చేయండి.
  3. క్యాలెండర్‌ను చూపించు Show calendarను ట్యాప్ చేయండి.
  4. మీరు ఏ రోజును తొలగించాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోండి.
  5. 'మరిన్ని ఆ తర్వాత రోజును తొలగించండి' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

లొకేషన్ హిస్టరీ నుండి ఒక స్టాప్‌ను తొలగించండి

  1. మీ Android పరికరంలో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ Account Circle ఆ తర్వాత మీ టైమ్‌లైన్ Timelineను ట్యాప్ చేయండి.
  3. క్యాలెండర్‌ను చూపించు Show calendarను ట్యాప్ చేయండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న స్టాప్‌తో ఉన్న రోజును ఎంచుకోండి.
  5. మీరు తొలగించాలనుకుంటున్న స్టాప్‌ను ట్యాప్ చేసి, ఆ తర్వాత తొలగించండి తొలగించు ను ట్యాప్ చేయండి.
  6. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించండి

లొకేషన్ హిస్టరీ మొత్తాన్ని తొలగించండి

  1. మీ వెబ్ బ్రౌజర్‌లో, మీ Google Maps టైమ్‌లైన్‌ను తెరవండి.
  2. తొలగించండి తొలగించు ని ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

లొకేషన్ హిస్టరీ నుండి ఒక రోజును తొలగించండి

  1. మీ వెబ్ బ్రౌజర్‌లో, మీ Google Maps టైమ్‌లైన్‌ను తెరవండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న సంవత్సరం, నెల, అలాగే రోజును ఎంచుకోండి.
  3. తొలగించండి తొలగించు ని ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

లొకేషన్ హిస్టరీ నుండి ఒక స్టాప్‌ను తొలగించండి

  1. మీ వెబ్ బ్రౌజర్‌లో, మీ Google Maps టైమ్‌లైన్‌ను తెరవండి.
  2. మీరు తొలగించాలనుకుంటున్న సంవత్సరం, నెల, అలాగే రోజును ఎంచుకోండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న స్టాప్ పక్కన, 'మరిన్ని మరిన్నిఆ తర్వాత రోజు నుండి స్టాప్‌ను తీసివేయండి' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

మీ లొకేషన్ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి

3 నెలలు, 18 నెలలు, లేదా 36 నెలల కంటే పాతదైన లొకేషన్ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించడానికి మీరు ఎంచుకోవచ్చు.

Google Maps యాప్‌ను ఉపయోగించండి

  1. మీ Android పరికరంలో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ Account Circle ఆ తర్వాత మీ టైమ్‌లైన్ Timelineను ట్యాప్ చేయండి.
  3. పైన కుడి వైపున, 'మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు, గోప్యతను' ట్యాప్ చేయండి.
  4. "లొకేషన్ సెట్టింగ్‌ల"కు స్క్రోల్ చేయండి.
  5. 'లొకేషన్ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి' అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించండి

  1. మీ వెబ్ బ్రౌజర్‌లో, మీ Google Maps టైమ్‌లైన్‌ను తెరవండి. 
  2. కింద కుడి వైపున, 'సెట్టింగ్‌లు Settings icon ఆ తర్వాత లొకేషన్ హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. 
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. 

మీరు లొకేషన్ హిస్టరీలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని తొలగించిన తర్వాత ఏమి జరుగుతుంది

మీరు మీ లొకేషన్ హిస్టరీలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని తొలగించినట్లయితే, Google అంతటా ఉన్న వ్యక్తిగతీకరించబడిన అనుభవాలు తగ్గవచ్చు లేదా వాటిని కోల్పోవచ్చు. ఉదాహరణకు, మీరు వీటిని కోల్పోవచ్చు:

  • మీరు సందర్శించిన స్థలాల ఆధారంగా సిఫార్సులు
  • ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఇంటికి లేదా ఆఫీస్‌కు వెళ్లడానికి ఎప్పుడు బయలుదేరితే మంచిదో అనే దాని గురించిన రియల్-టైమ్ సమాచారం

ముఖ్యమైనది: మీరు వెబ్ & యాప్ యాక్టివిటీ వంటి ఇతర సెట్టింగ్‌లను ఆన్ చేసి, లొకేషన్ హిస్టరీని పాజ్ చేసినా లేదా లొకేషన్ హిస్టరీ నుండి లొకేషన్ డేటాను తొలగించినా, మీ ఇతర Google సైట్‌లు, యాప్‌లు, సర్వీస్‌లను ఉపయోగించడంలో భాగంగా మీరు ఇప్పటికీ మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన లొకేషన్ డేటాను కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు Search, Mapsలలోని యాక్టివిటీలో భాగంగా లొకేషన్ డేటా సేవ్ చేయబడవచ్చు, అలాగే మీ కెమెరా యాప్ సెట్టింగ్‌లను బట్టి మీ Photosలో చేర్చబడవచ్చు. వెబ్ & యాప్ యాక్టివిటీలో మీ పరికరం జనరల్ ఏరియా, IP అడ్రస్‌ల నుండి మీ లొకేషన్ ను గురించిన సమాచారం కూడా ఉండవచ్చు.

లొకేషన్ హిస్టరీ వినియోగం & విశ్లేషణల గురించి తెలుసుకోండి

మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేసిన తర్వాత, లొకేషన్ హిస్టరీ కోసం ఏవేవి పని చేస్తున్నాయి, ఏవేవి పని చేయట్లేదు అనే దాని గురించిన సమస్య విశ్లేషణ సమాచారాన్ని మీ పరికరం Googleకు పంపవచ్చు. Google గోప్యతా పాలసీ కింద అది సేకరించే ఏదైనా సమాచారాన్ని Google ప్రాసెస్ చేస్తుంది.

 

మీ పరికరం ఎటువంటి సమాచారాన్ని షేర్ చేయవచ్చు

Google యాప్‌లు, ప్రోడక్ట్‌లు, Android పరికరాలను మెరుగుపరచడంలో సహాయపడేందుకు మీ పరికరం Googleకు సమాచారాన్ని పంపవచ్చు. ఉదాహరణకు, Google, సమాచారాన్ని వీటిని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు:

  • బ్యాటరీ లైఫ్: సాధారణంగా ఉపయోగించే ఫీచర్‌ల కోసం బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడానికి మీ పరికరంలో ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తాయో మేము అంచనా వేస్తాము.
  • లొకేషన్ ఖచ్చితత్వం: యాప్‌లు, సర్వీసుల కోసం లొకేషన్ అంచనాలను మెరుగుపరచడానికి మేము లొకేషన్ సెన్సార్‌లను, సెట్టింగ్‌లను ఉపయోగిస్తాము.

మీ ఫోన్ Googleకు పంపగల సమాచారంలో ఇవి ఉండవచ్చు:

  • ఈ కింది వాటితో మీ కనెక్షన్‌ల క్వాలిటీ, నిడివి:
    • మొబైల్ నెట్‌వర్క్‌లు
    • GPS
    • Wi‑Fi నెట్‌వర్క్‌లు
    • బ్లూటూత్
  • మీ లొకేషన్ సెట్టింగ్‌ల స్థితి
  • రీస్టార్ట్‌లు, క్రాష్ రిపోర్ట్‌లు
  • లొకేషన్ హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మీరు ఉపయోగించే Google యాప్‌లు
షేర్ చేసిన సమాచారం Googleను మెరుగుపరచడంలో ఏ విధంగా సహాయపడుతుంది

వినియోగం & విశ్లేషణల సమాచారం Google యాప్‌లు, ప్రోడక్ట్‌లు, అలాగే Android పరికరాలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. ఉదాహరణకు, Google ఆ సమాచారాన్ని వీటిని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు:

  • బ్యాటరీ జీవితకాలం: సాధారణంగా ఉపయోగించే ఫీచర్‌ల కోసం బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడేందుకు Google మీ పరికరంలో ఎక్కువ బ్యాటరీని ఏవేవి వినియోగిస్తున్నాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • లొకేషన్ ఖచ్చితత్వం: యాప్‌లు, అలాగే సర్వీస్‌ల కోసం లొకేషన్ అంచనాలను మెరుగుపరచడంలో సహాయపడేందుకు, లొకేషన్ సెన్సార్‌లు, సెట్టింగ్‌ల నుండి సమాచారాన్ని Google ఉపయోగించవచ్చు.

 

 

ఇతర లొకేషన్ సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1652158790617464106
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false