Inactive Account Manager గురించి

Inactive Account Manager యూజర్‌లకు వారి ఖాతా డేటా భాగాలను షేర్ చేయడానికి లేదా వారు కొంత సమయం వరకు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే వారికి తెలియజేయడానికి మార్గం. దీన్ని సెటప్ చేయడానికి, మీ Inactive Account Manager పేజీకి వెళ్లి ప్రారంభించును క్లిక్ చేయండి.

మేము యాక్టివిటీని ఎలా గుర్తిస్తాం?

మీరు ఇప్పటికీ మీ Google ఖాతాను ఉపయోగిస్తున్నారో లేదో అర్థం చేసుకోవడానికి మేము అనేక సంకేతాలను పరిశీలిస్తాము. వీటిలో మీ చివరి సైన్ ఇన్‌లు, నా యాక్టివిటీలో మీ ఇటీవలి యాక్టివిటీ, Gmail వాడకం (ఉదా., మీ ఫోన్‌లోని Gmail యాప్), ఇంకా Android చెక్ ఇన్‌లు ఉన్నాయి.

మీ ఖాతా తొలగించబడినప్పుడు ఏమి జరుగుతుంది?

మీ Google ఖాతాను తొలగించడం ఆ ఖాతాతో అనుబంధించబడిన అన్ని ప్రోడక్ట్‌లను ప్రభావితం చేస్తుంది (ఉదా., Blogger, AdSense, Gmail), అలాగే ప్రతి ప్రోడక్ట్‌ను భిన్నంగా ప్రభావితం చేస్తుంది. మీరు Google Dashboardలో మీ ఖాతాతో అనుబంధించబడిన డేటాను రివ్యూ చేయవచ్చు. మీ ఖాతాతో మీరు Gmail ఉపయోగిస్తే, మీరు ఇకపై ఆ ఇమెయిల్‌ను యాక్సెస్ చేయలేరు. మీ Gmail యూజర్‌నేమ్‌ను కూడా మీరు తిరిగి ఉపయోగించలేరు.

విశ్వసనీయ కాంటాక్ట్ కోసం నేను ఫోన్ నంబర్‌ను ఎందుకు అందించాలి?

విశ్వసనీయ కాంటాక్ట్ మాత్రమే మీ డేటాను డౌన్‌లోడ్ చేయగలిగేలా చేసే ముఖ్య ఉద్దేశంతో మేము ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తాము. మొబైల్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి గుర్తింపును వెరిఫై చేయడం వలన, మీ విశ్వసనీయ కాంటాక్ట్‌కు మేము పంపే ఇమెయిల్ అనధికార వ్యక్తుల చేతిలో పడి, వారు డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది.

విశ్వసనీయ కాంటాక్ట్‌లు ఏమి అందుకుంటాయి?

నిర్దిష్ట సమయం పాటు మీ ఖాతా ఇన్‌యాక్టివ్ అయిన తర్వాత మాత్రమే కాంటాక్ట్‌లకు నోటిఫికేషన్ అందుతుంది -- సెటప్ చేసేటప్పుడు కాంటాక్ట్‌లకు ఎటువంటి నోటిఫికేషన్ అందదు. మీ ఇన్‌యాక్టివ్ ఖాతా యొక్క మీ కాంటాక్ట్‌లకు మాత్రమే తెలియజేయాలని ఎంచుకుంటే, సెటప్ సమయంలో మీరు రాసిన సబ్జెక్ట్ లైన్, కంటెంట్‌తో వారు ఇమెయిల్‌ను అందుకుంటారు. మీ ఖాతా ఉపయోగించడం మానేసిన తర్వాత మీ తరపున ఇమెయిల్ పంపమని మీరు Googleకు సూచించారని వివరిస్తూ మేము ఆ ఇమెయిల్‌కు ఫుటర్‌ను జోడిస్తాము. ఈ ఫుటర్ ఈ విధంగా ఉండవచ్చు:

జాన్ డో (john.doe@gmail.com) Googleకు, జాన్ తమ ఖాతాను ఉపయోగించడం ఆపివేసిన తర్వాత ఈ మెయిల్‌ను ఆటోమేటిక్‌గా మీకు పంపమని సూచించారు.

భవదీయులు,
Google ఖాతాల బృందం

మీరు విశ్వసించే కాంటాక్ట్‌తో డేటాను షేర్ చేయడాన్ని మీరు ఎంచుకుంటే, ఇమెయిల్ అదనంగా మీరు వారితో షేర్ చేయడానికి ఎంచుకున్న డేటా లిస్ట్‌ను, డేటాను డౌన్‌లోడ్ చేయడానికి వారు ఫాలో అవ్వగల లింక్‌ను కలిగి ఉంటుంది. అటువంటి మెసేజ్‌కు ఉదాహరణ:

జాన్ డో (john.doe@gmail.com) Googleకు, జాన్ తమ ఖాతాను ఉపయోగించడం ఆపివేసిన తర్వాత ఈ మెయిల్‌ను ఆటోమేటిక్‌గా మీకు పంపమని సూచించారు.

జాన్ డో ఈ కింది ఖాతా డేటాకు మీకు యాక్సెస్‌ను ఇచ్చారు:

  • Blogger
  • Drive
  • మెయిల్
  • YouTube

జాన్ డేటాను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి.

భవదీయులు,
Google ఖాతాల బృందం

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2923661913996063007
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false