ఒకవేళ మీకు చెందని కంప్యూటర్, ఫోన్ లేదా టాబ్లెట్‌లో మీరు తాత్కాలికంగా సైన్ ఇన్ చేస్తే, ప్రైవేట్ బ్రౌజింగ్ విండోను ఉపయోగించండి.
ఉదాహరణకు:
- చాలా మంది వ్యక్తుల కోసం అందుబాటులో ఉండే లైబ్రరీ లేదా ఇంటర్నెట్ కేఫ్ వంటి పబ్లిక్ కంప్యూటర్
- ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ నుండి అరువుగా తీసుకునే పరికరం
మీరు విశ్వసించే వ్యక్తులతో పరికరం లేదా బ్రౌజర్‌ను షేర్ చేస్తే, మీరు దీన్ని పలు వ్యక్తుల కోసం సెటప్ చేయవచ్చు. Chromeను ఇతరులతో ఎలా షేర్ చేయాలో తెలుసుకోండి.
ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయండి
మీరు ఇతర వ్యక్తులు ఉపయోగించే పరికరంలో సైన్ ఇన్ చేసినట్లయితే, కింద ఉన్న దశలను ఫాలో అవ్వడం ద్వారా ఇతరులు ఈ పనులు చేయకుండా మీరు నివారించగలరు:
- మీ Google ఖాతాను ఉపయోగించడం
- మీరు చేసిన సెర్చ్‌లను లేదా మీరు చూసిన సైట్లను కనుగొనడం
- మీ ఖాతా సైన్ ఇన్ అయి ఉందో లేదా చెక్ చేయటం
Chromeలో
- కంప్యూటర్లో, Chromeను తెరవండి.
- పైన కుడి వైపున, ప్రొఫైల్ ను క్లిక్ చేయండి.
- గెస్ట్‌ను క్లిక్ చేయండి.
- www.google.com వంటి Google సర్వీస్‌కు వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- మీరు వెబ్‌ను ఉపయోగించడం పూర్తయిన తర్వాత, "గెస్ట్ మోడ్" బ్రౌజింగ్ విండోను మూసివేయండి. మీ బ్రౌజింగ్ హిస్టరీ, కుక్కీలు, సైట్ డేటా తొలగించబడతాయి.
మీరు Chromeలో గెస్ట్ మోడ్‌ను ఉపయోగించినప్పుడు, అలాగే సైన్ ఇన్ చేసినప్పుడు:
- మీరు చేసే సెర్చ్‌లు, మీరు సందర్శించే సైట్లు, అలాగే ఇతర యాక్టివిటీ బ్రౌజర్ హిస్టరీలో సేవ్ చేయబడవు.
- మీ యాక్టీవిటీ కంట్రోల్స్ వర్తిస్తాయి, కాబట్టి యథావిధిగా అదే యాక్టివిటీ మీ Google ఖాతాకు సేవ్ చేయబడుతుంది.
- మీరు గెస్ట్ మోడ్ నుండి నిష్క్రమించిన తర్వాత కుక్కీలు తొలగించబడతాయి.
Chromeలో గెస్ట్ మోడ్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.
Chromebook లో: Chromebookను గెస్ట్‌గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
ఇతర బ్రౌజర్లలో
గమనిక: ప్రైవేట్‌గా బ్రౌజింగ్ చేయడం అనేది వివిధ బ్రౌజర్లలో విభిన్నంగా పని చేయవచ్చు. మీరు ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి సూచనలను ఫాలో అయినప్పుడు, వివరాలను చదవండి.
- కంప్యూటర్లో, Safari వంటి బ్రౌజర్‌ను తెరవండి.
- ప్రైవేట్ విండోను తెరవండి. ఎలా చేయాలో తెలుసుకోవడానికి, మీ బ్రౌజర్‌ను ఎంచుకోండి:
- www.google.com వంటి Google సర్వీస్‌కు వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- మీరు వెబ్‌ను ఉపయోగించడం పూర్తయిన తర్వాత, అన్ని ప్రైవేట్ విండోలను మూసివేయండి లేదా సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేయడానికి ఇలా చేయండి:
- www.google.com వంటి Google సర్వీస్‌కు వెళ్లండి.
- పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్, పేరులోని మొదటి అక్షరం లేదా ఇమెయిల్ అడ్రస్‌ను క్లిక్ చేయండి.
- సైన్ అవుట్‌ను క్లిక్ చేయండి.
మీరు ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయలేకపోతే
- Chrome వంటి ఒక బ్రౌజర్‌ను తెరవండి.
- మీరు సైన్ ఇన్ చేయడానికి ముందు, అలాగే సైన్ అవుట్ చేసిన తర్వాత ఈ దశలను ఫాలో అవ్వండి:
- బ్రౌజర్ కాష్ను, కుక్కీలను క్లియర్ చేయండి: కాష్ను, కుక్కీలను క్లియర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
- బ్రౌజింగ్ హిస్టరీని తొలగించండి: Chromeలో బ్రౌజింగ్ హిస్టరీని తొలగించడం ఎలాగో తెలుసుకోండి.