మీది కాని పరికరంలో సైన్ ఇన్ చేయండి

ఒకవేళ మీకు చెందని కంప్యూటర్, ఫోన్ లేదా టాబ్లెట్‌లో మీరు తాత్కాలికంగా సైన్ ఇన్ చేస్తే, ప్రైవేట్ బ్రౌజింగ్ విండోను ఉపయోగించండి.

ఉదాహరణకు:

  • చాలా మంది వ్యక్తుల కోసం అందుబాటులో ఉండే లైబ్రరీ లేదా ఇంటర్నెట్ కేఫ్ వంటి పబ్లిక్ కంప్యూటర్
  • ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ నుండి అరువుగా తీసుకునే పరికరం

మీరు విశ్వసించే వ్యక్తులతో పరికరం లేదా బ్రౌజర్‌ను షేర్ చేస్తే, మీరు దీన్ని పలు వ్యక్తుల కోసం సెటప్ చేయవచ్చు. Chromeను ఇతరులతో ఎలా షేర్ చేయాలో తెలుసుకోండి.

ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయండి

మీరు ఇతర వ్యక్తులు ఉపయోగించే పరికరంలో సైన్ ఇన్ చేసినట్లయితే, కింద ఉన్న దశలను ఫాలో అవ్వడం ద్వారా ఇతరులు ఈ పనులు చేయకుండా మీరు నివారించగలరు:

  • మీ Google ఖాతాను ఉపయోగించడం
  • మీరు చేసిన సెర్చ్‌లను లేదా మీరు చూసిన సైట్‌లను కనుగొనడం
  • మీ ఖాతా సైన్ ఇన్ అయి ఉందో లేదా చెక్ చేయటం
  1. Android phone లేదా టాబ్లెట్‌లో, Chrome వంటి బ్రౌజర్ యాప్‌ను తెరవండి.
  2. ప్రైవేట్ విండోను తెరవండి. ఎలా చేయాలో తెలుసుకోవడానికి, యాప్‌ను తెరవండి:
  3. www.google.com వంటి Google సర్వీస్‌కు వెళ్లి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  4. మీరు వెబ్‌ను ఉపయోగించడం పూర్తయిన తర్వాత, అన్ని ప్రైవేట్ విండోలను మూసివేయండి లేదా సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేయడానికి ఇలా చేయండి:
    1. www.google.com వంటి Google సర్వీస్‌కు వెళ్లండి.
    2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఇమేజ్, పేరులోని మొదటి అక్షరం లేదా ఇమెయిల్ అడ్రస్‌ను ట్యాప్ చేయండి.
    3. సైన్ అవుట్‌ను ట్యాప్ చేయండి.

మీరు Chromeలోని ప్రైవేట్ విండోలో సైన్ ఇన్ చేసినప్పుడు:

  • మీరు చేసే సెర్చ్‌లు, మీరు సందర్శించే సైట్‌లు, అలాగే ఇతర యాక్టివిటీ బ్రౌజర్ హిస్టరీలో సేవ్ చేయబడవు.
  • మీ యాక్టీవిటీ కంట్రోల్స్ వర్తిస్తాయి, కాబట్టి యథావిధిగా అదే యాక్టివిటీ మీ Google ఖాతాకు సేవ్ చేయబడుతుంది.
  • మీరు అన్ని ప్రైవేట్ విండోలను మూసివేసిన తర్వాత కుక్కీలు తొలగించబడతాయి.

గమనిక: ప్రైవేట్‌గా బ్రౌజింగ్ చేయడం అనేది ఇతర బ్రౌజర్‌లలో విభిన్నంగా పని చేయవచ్చు. మీరు ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి సూచనలను ఫాలో అయినప్పుడు, వివరాలను చదవండి.

మీరు ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయలేకపోతే

  1. Chrome వంటి ఒక బ్రౌజర్‌ను తెరవండి.
  2. మీరు సైన్ ఇన్ చేయడానికి ముందు, అలాగే సైన్ అవుట్ చేసిన తర్వాత ఈ దశలను ఫాలో అవ్వండి:
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9403116339985293315
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false