సెక్యూరిటీ నోటిఫికేషన్‌లను రివ్యూ చేయండి

మీ ఖాతాలో మార్పులు, అలాగే అనుమానాస్పద యాక్టివిటీ గురించి మీకు తెలియజేయడానికి Google మీ రికవరీ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

సైన్ ఇన్ చేసే ప్రయత్నంలో ఏదైనా తేడా ఉంటే, మీ సైన్ ఇన్ చేసిన ఫోన్‌లో నోటిఫికేషన్‌ని ట్యాప్ చేయడం లేదా వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయడం వంటి వాటి ద్వారా ఇది మీరేనని నిర్ధారించడంలో సహాయపడమని Google మిమ్మల్ని అడగవచ్చు.

కొత్త సైన్-ఇన్‌ల కోసం అలర్ట్‌లు

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు, మీ ఖాతాకు ఏదైనా కొత్త పరికరం సైన్ ఇన్ చేసినప్పుడు మీకు తెలియజేయడానికి ఏ సమయంలోనైనా Google మీ రికవరీ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. అలర్ట్ అనేది సైన్-ఇన్ చేసిన సమయం, ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. 

మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, ఉదాహరణకు సైన్ ఇన్ చేసినది మీరు కాకపోతే, మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మీ పరికరాలకు వెళ్లండి. అక్కడ, మీ ఖాతాకు ఏ పరికరాలకు యాక్సెస్ ఉందో మీరు మేనేజ్ చేయవచ్చు, అలాగే అవి చివరిగా ఎప్పుడు ఉపయోగించబడ్డాయో చూడవచ్చు.

అలర్ట్‌లతో ఎదురయ్యే సాధారణ సమస్యలు

నా లొకేషన్ తప్పు

కొన్నిసార్లు మీరు రిపోర్ట్ చేసిన లొకేషన్ తప్పు కావచ్చు. మీ IP అడ్రస్ ఆధారంగా మీరు ఉన్న జనరల్ ఏరియాను మేము నిర్ణయిస్తాము, కాబట్టి మీరు యాక్టివ్‌గా ఉన్న లొకేషన్, వాస్తవ లొకేషన్ మధ్య కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

నేను నా పరికరాన్ని ఇంతకు ముందు ఉపయోగించాను

మీరు మొదటి నుండి ఏ పరికరానికి సైన్ ఇన్ చేశారో, దానికి మేము మీకు అలర్ట్‌ను పంపవచ్చు. మీరు ఇటీవల కుక్కీలను తొలగించినా, మీ బ్రౌజర్ లేదా యాప్‌ను అప్‌డేట్ చేసినా లేదా అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించినా ఇలా జరగవచ్చు.  మీరు ఇటీవల మీ ఖాతాకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను మార్చి ఉంటే, మీరు కొత్త సైన్-ఇన్ అలర్ట్‌ను కూడా అందుకోవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6091739381858062250
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false