విశ్వసనీయ కంప్యూటర్‌లను జోడించండి లేదా తీసివేయండి

మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసే ప్రతిసారీ, 2-దశల వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాలని గానీ లేదా మీ సెక్యూరిటీ కీని ఉపయోగించాలని గానీ మీకు లేకపోతే, మీ కంప్యూటర్‌ను లేదా మొబైల్ పరికరాన్ని మీరు విశ్వసనీయమైనదిగా మార్క్ చేయవచ్చు. విశ్వసనీయమైన కంప్యూటర్‌లు, పరికరాల విషయంలో, మీరు సైన్ ఇన్ చేసే ప్రతిసారీ వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.

విశ్వసనీయ కంప్యూటర్‌లను, పరికరాలను జోడించండి

  1. మీరు విశ్వసించే కంప్యూటర్ లేదా పరికరంలోకి సైన్ ఇన్ చేయండి.
  2. మీరు వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేస్తున్నప్పుడు, ఈ కంప్యూటర్‌లో మళ్లీ అడగవద్దును ఎంచుకోండి.

ఒక విశ్వసనీయ పరికరంలో, 2-దశల వెరిఫికేషన్ ద్వారా సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని అడగడం జరిగింది

మీరు "ఈ కంప్యూటర్‌లో మళ్లీ అడగవద్దు" పక్కనున్న బాక్స్‌ను ఎంచుకున్నప్పటికీ, 2-దశల వెరిఫికేషన్ ద్వారా సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. సాధారణంగా దీనికి, మీరు ఉపయోగించే Chrome లేదా Firefox వంటి బ్రౌజర్‌లో, కుక్కీలు ఎనేబుల్ చేసి ఉండకపోవడం గానీ లేదా నిర్ణీత సమయ వ్యవధి తర్వాత, కుక్కీలు తొలగింపబడేలా సెట్ చేసి ఉండటం గానీ కారణం అయ్యుండవచ్చు.

సైన్ ఇన్ చేసే ప్రతిసారీ, 2-దశల వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాలని గానీ లేదా మీ సెక్యూరిటీ కీని ఉపయోగించాలని గానీ మీకు లేకపోతే, ఈ దశలను ట్రై చేయండి:

  1. మీ బ్రౌజర్ కుక్కీ సెట్టింగ్‌లను ఎడిట్ చేయండి. మీరు మీ బ్రౌజర్‌ను కుక్కీలను సేవ్ చేసేలా సెట్ చేయవచ్చు లేదా [*.]google.comను జోడించడం ద్వారా Google ఖాతా కుక్కీలకు ఒక మినహాయింపును జోడించవచ్చు. మీ సెట్టింగ్‌లను ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి మరింత సమాచారం కోసం, మీరు ఉపయోగించే బ్రౌజర్‌ను ఎంచుకోండి:
  2. మీరు ఉపయోగించే ప్రతి విభిన్నమైన బ్రౌజర్ లేదా కంప్యూటర్ కోసం, "ఈ కంప్యూటర్‌లో మళ్లీ అడగవద్దు"ను ఎంచుకోండి. మీరు సైన్ ఇన్ చేయడానికి వేర్వేరు బ్రౌజర్‌లను లేదా కంప్యూటర్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, ప్రతి కంప్యూటర్‌లో ఈ బాక్స్‌ను ఎంచుకొనేలా చూసుకోండి, అలాగే ప్రతి బ్రౌజర్‌లో మీ కుక్కీ సెట్టింగ్‌లను సర్దుబాటు చేసుకోండి.

మీ విశ్వసనీయ లిస్ట్ నుండి కంప్యూటర్‌లను, పరికరాలను తీసివేయండి

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. సెక్యూరిటీని క్లిక్ చేయండి.
  3. "మీ పరికరాలు" విభాగంలో, అన్ని పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు సైన్ అవుట్ చేయాలనుకుంటున్న పరికరం నుండి ఆ తర్వాత సైన్ అవుట్ చేయండిని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5103017047876677706
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false