రికవరీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్‌ను సెటప్ చేయండి

మీరు ఎప్పుడైనా సైన్ ఇన్ చేయలేకపోతే మీ Google ఖాతాలోకి తిరిగి రాగలరని నిర్ధారించుకోవడానికి, రికవరీ సమాచారాన్ని జోడించండి.

రికవరీ ఆప్షన్‌లను జోడించండి

ముఖ్య గమనిక: మీ ఆఫీస్, స్కూల్, లేదా ఇతర గ్రూప్ ద్వారా మీరు ఖాతాను ఉపయోగిస్తే, ఈ దశలు పని చేయకపోవచ్చు. సహాయం కోసం మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.

రికవరీ సమాచారం మీకు ఎలా సహాయపడుతుంది

రికవరీ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ మీ పాస్‌వర్డ్‌ను ఈ కింది సంధర్భాలలో రీసెట్ చేయడానికి సహాయపడతాయి:

  • మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినప్పుడు
  • వేరొకరు మీ ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు
  • మరొక కారణం చేత మీ ఖాతాకు మీరు ప్రవేశించలేకపోయినప్పుడు

చిట్కా: ఒకవేళ మీ రికవరీ ఫోన్ నంబర్‌ను లేదా రికవరీ ఈమెయిల్‌ను మీరు మార్చినట్లయితే, Google ఇప్పటికీ వెరిఫికేషన్ కోడ్‌లను 7 రోజుల పాటు మీ మునుపటి రికవరీ ఫోన్ నంబర్‌కు లేదా రికవరీ ఈమెయిల్ అడ్రస్‌కు పంపించే సదుపాయాన్ని మీకు అందించవచ్చు. ఎవరైనా మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఉపయోగించడం ప్రారంభిస్తే, ఈ ఆప్షన్ వలన మీ సెట్టింగ్‌లు చాలా త్వరగా సంరక్షించబడతాయి.

రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండి లేదా మార్చండి

రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్ సమాచారం" కింద ఫోన్ ఆ తర్వాత సెటప్‌ను క్లిక్ చేయండి.
  4. రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించడానికి, స్క్రీన్‌పై ఉన్న దశలను ఫాలో అవ్వండి.

 రికవరీ ఫోన్ నంబర్‌ను జోడించండి

రికవరీ ఫోన్ నంబర్‌ను మార్చండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్ సమాచారం"లో, ఫోన్ ఆ తర్వాతఫోన్ నంబర్‌ను క్లిక్ చేయండి.
    • మీ రికవరీ ఫోన్ నంబర్‌ను మార్చండి: మీ నంబర్ పక్కన, ఎడిట్ చేయండి ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
    • మీ రికవరీ ఫోన్ నంబర్‌ను తొలగించండి: మీ నంబర్ పక్కనున్న, 'తొలగించండి' తొలగించు ని ఎంచుకోండి.
  4. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీ రికవరీ ఫోన్ నంబర్‌ను మీరు తొలగించినా కూడా, అది ఇతర Google సర్వీస్‌ల కోసం ఉపయోగించబడవచ్చు. మీ ఫోన్ నంబర్‌లను మేనేజ్ చేయడానికి, మీ ఖాతాకు వెళ్లండి.

రికవరీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి

ఏ నంబర్‌ను ఉపయోగించాలి

ఈ కింది వాటికి అనుగుణంగా ఉండే మొబైల్ ఫోన్‌ను ఉపయోగించండి:

  • టెక్స్ట్ మెసేజ్‌లను అందుకోగలిగేది
  • మీకు మాత్రమే చెందినది
  • మీరు క్రమం తప్పకుండా ఉపయోగించేది, మీ చెంతనే ఉండేది

రికవరీ ఇమెయిల్ అడ్రస్‌ను జోడించండి లేదా మార్చండి

రికవరీ ఈమెయిల్ అడ్రస్‌ను జోడించండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్ సమాచారం" కింద, ఈమెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. "రికవరీ ఈమెయిల్" కింద, రికవరీ ఈమెయిల్‌ను జోడించండిని క్లిక్ చేయండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

రికవరీ ఈమెయిల్‌ను జోడించండి

రికవరీ ఈమెయిల్ అడ్రస్‌ను మార్చండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపు నావిగేషన్ ప్యానెల్‌లో, వ్యక్తిగత సమాచారంను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్ సమాచారం" కింద, ఈమెయిల్‌ను క్లిక్ చేయండి.
  4. "రికవరీ ఈమెయిల్" కింద, మీ ప్రస్తుత రికవరీ అడ్రస్‌పై క్లిక్ చేయండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. కొత్త రికవరీ ఈమెయిల్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.
  6. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

రికవరీ ఈమెయిల్‌ను మార్చండి

ఏ ఈమెయిల్‌ను ఉపయోగించాలి

ఈ కింది వాటికి అనుగుణంగా ఉండే ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించండి:

  • మీరు క్రమం తప్పకుండా ఉపయోగించేది
  • మీ Google ఖాతాలోకి సైన్ ఇన్ చేయడం కోసం మీరు ఉపయోగించేది కాకుండా వేరేది

రికవరీ సమాచారం ఎలా ఉపయోగించబడుతుంది

రికవరీ సమాచారం మీ ఖాతాలోకి తిరిగి ప్రవేశించడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రికవరీ ఫోన్ నంబర్

మీ రికవరీ ఫోన్ నంబర్ ఏయే చర్యల కోసం ఉపయోగించబడుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్కొనబడ్డాయి:

  • మీరు ఎప్పుడైనా మీ ఖాతాలోకి ప్రవేశించలేకపోతే, ప్రవేశించేందుకు మీకు కోడ్‌ను పంపడానికి
  • మీ అనుమతి లేకుండా మీ ఖాతాను ఉపయోగించకుండా ఎవరినైనా బ్లాక్ చేయడానికి
  • ఖాతా మీదేనని నిరూపించడం మీకు సులభతరం చేయడానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు మీకు తెలియజేయడానికి

మీ రికవరీ ఫోన్ నంబర్, మరొక ఫోన్ నంబర్‌గా మీరు మీ ఖాతాకు జోడించిన నంబర్ ఒకటే అయితే, అది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడవచ్చు. ఫోన్ నంబర్‌లు ఎలా ఉపయోగించబడతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

రికవరీ ఈమెయిల్ అడ్రస్

మీ రికవరీ ఈమెయిల్ అడ్రస్ ఏయే చర్యల కోసం ఉపయోగించబడుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ కొన్ని పేర్కొనబడ్డాయి:

  • మీరు ఈమెయిల్ అడ్రస్‌ను క్రియేట్ చేసిన తర్వాత మీ యూజర్‌నేమ్‌ను నిర్ధారించడానికి
  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయినా లేదా ఏ కారణం చేతనైనా మీరు సైన్ ఇన్ చేయలేకపోయినా, మీ ఖాతాలోకి ప్రవేశించడంలో మీకు సహాయపడటానికి
  • మీ స్టోరేజ్ స్పేస్ నిండిపోయే దశకు చేరుకున్నప్పుడు మీకు తెలియజేయడానికి
  • మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగినప్పుడు మీకు తెలియజేయడానికి

సమస్యలను పరిష్కరించండి

సైన్ ఇన్ చేయడం సాధ్యం కావడం లేదు

ఖాతా రికవరీ పేజీకి వెళ్లి, మీకు సాధ్యమైనంత వరకు ఉత్తమ సమాధానాలను ఇవ్వండి. ఈ చిట్కాలు సహాయపడగలవు.

ఈ కింద పేర్కొనబడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఖాతా రికవరీ పేజీని ఉపయోగించండి:

  • మీరు మీ పాస్‌వర్డ్‌ను మరచిపోయినప్పుడు.
  • మీ పాస్‌వర్డ్‌ను వేరెవరో మార్చినప్పుడు.
  • మీ ఖాతాను వేరెవరో తొలగించినప్పుడు.
  • మరొక కారణం చేత మీరు సైన్ ఇన్ చేయలేకపోయినప్పుడు.

చిట్కా: మీరు సరైన ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి, మీ యూజర్‌నేమ్‌ను రికవర్ చేయడానికి ట్రై చేయండి.

రికవరీ సమాచారాన్ని మార్చడం సాధ్యపడటం లేదు

మీరు సైన్ ఇన్ చేసే విధానంలో ఏదైనా తేడా ఉంటే, మీ రికవరీ సమాచారాన్ని మార్చే ఆప్షన్ మీకు ఉండకపోవచ్చు. మీరు ఈ కింద పేర్కొనబడిన విధంగా ట్రై చేయవచ్చు:

  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే పరికరం నుండి ట్రై చేయవచ్చు.
  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేసే లొకేషన్ నుండి ట్రై చేయవచ్చు.
  • మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరికరం నుండి తర్వాతి వారం ట్రై చేయవచ్చు.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
15359966602063081556
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false
false
false