ఒక ఖాతాను క్రియేట్ చేయడానికి, Google ఎందుకు కొంత సమాచారాన్ని అడుగుతుంది

మీరు Google ఖాతాను క్రియేట్ చేసేటప్పుడు, మేము కొంత వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతాము. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో, అలాగే మా సర్వీస్‌లను మరింత ఉపయోగకరంగా చేయడంలో ఈ సమాచారం సహాయపడుతుంది.

ఈ సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, Google గోప్యతా పాలసీని చదవండి.

మేము ఏ సమాచారాన్ని అడుగుతాము, ఎందుకు అడుగుతాము

పేరు

మీరు Google సర్వీస్‌లలో ఉపయోగించాలనుకుంటున్న పేరును ఎంటర్ చేయండి. మీరు డాక్యుమెంట్ లేదా ఫోటో వంటి కంటెంట్‌ను ఇతరులతో షేర్ చేసినప్పుడు, దానితో పాటు మీ పేరు కనిపిస్తుంది.

యూజర్‌నేమ్

మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి మీరు ఉపయోగించాలనుకునే యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి, ఉదాహరణకు, myname@gmail.com.

  • మీరు Gmail అడ్రస్‌ను క్రియేట్ చేస్తారు లేదా మీకు ఇప్పటికే ఉన్న, Gmail కాని ఈమెయిల్ అడ్రస్‌ను ఉపయోగిస్తారు.
  • మీరు అక్షరాలు, నంబర్‌లు, ఇంకా ఫుల్‌స్టాప్‌లను ఉపయోగించవచ్చు.
  • మీ యూజర్‌నేమ్, కేస్ సెన్సిటివ్ కాదు. ఏవి క్యాపిటల్ అక్షరాలో, ఏవి లోయర్‌కేస్ అక్షరాలో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.

పాస్‌వర్డ్

మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, కనీసం 8 అక్షరాల పొడవు ఉండే శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.

  • పాస్‌వర్డ్‌లో అక్షరాలు, నంబర్‌లు, ఇంకా చిహ్నాలు అన్నీ ఉండేలా చూసుకోండి.
  • వ్యక్తిగత సమాచారాన్ని లేదా సులభంగా ఊహించగల సాధారణ పదాలను ఉపయోగించకండి, ఉదాహరణకు, మీ వీధి లేదా పెంపుడు జంతువు పేరు.
  • మీరు ఇతర ఖాతాలు లేదా వెబ్‌సైట్‌ల కోసం ఉపయోగించిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించకండి. అలాగే, ఈ పాస్‌వర్డ్‌ను కూడా మరెక్కడా ఉపయోగించకండి.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎలా క్రియేట్ చేయవచ్చు అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

పుట్టినరోజు

మీ పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. కొన్ని Google సర్వీస్‌లను ఉపయోగించాలంటే, నిర్దిష్ట వయో అర్హతలకు లోబడి ఉండాలి. వయో అర్హతల గురించి మరింత తెలుసుకోండి.

నిర్దిష్ట సర్వీస్‌లను, ఫీచర్‌లను ఉపయోగించడానికి మీకు తగిన వయస్సు ఉందని నిర్ధారించుకోవడంతో పాటు, వీటి కోసం Google మీ పుట్టిన రోజును కూడా ఉపయోగిస్తుంది:

  • వ్యక్తిగతీకరించిన సిఫార్సులు, యాడ్‌లతో సహా, మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని మీకు అందించడానికి మీ వయస్సు గ్రూప్‌ను నిర్ణయించడానికి. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేయవచ్చు.
  • Google Search పేజీలో పుట్టిన రోజు థీమ్‌ను ఎప్పుడు చూపాలో తెలుసుకోవడానికి.
  • Google సర్వీస్‌లలో ఖాతా సెక్యూరిటీ ఇంకా వ్యక్తిగతీకరణ కోసం.

Google మీ పుట్టిన రోజును ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీ పుట్టిన రోజును మీరు పబ్లిక్‌గా లేదా నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేస్తే తప్ప, మీ వయస్సు ఇతరులకు కనిపించదు.

లింగం

మీ లింగాన్ని ఎంచుకోండి లేదా మీరు చెప్పకూడదని నిర్ణయించుకుంటే, సంబంధిత ఆప్షన్‌ను ఎంచుకోండి. Google మీ లింగాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీ లింగాన్ని మీరు పబ్లిక్‌గా లేదా నిర్దిష్ట వ్యక్తులతో షేర్ చేస్తే తప్ప, అది ఇతరులకు కనిపించదు.

ఫోన్ నంబర్

మీకు మొబైల్ ఫోన్ ఉంటే, ఆ నంబర్‌ను అందించండి. ఈ సమాచారం కేవలం ఆప్షనల్ మాత్రమే, కానీ అందించాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. మీ ఖాతాకు మీరు ఫోన్ నంబర్‌ను ఎలా జోడిస్తారు అనే దాన్ని బట్టి, మీ నంబర్ వివిధ Google సర్వీస్‌లలో ఉపయోగించబడవచ్చు. ఉదాహరణకు, మీ పాస్‌వర్డ్‌ను మీరు మర్చిపోయినట్లయితే, తిరిగి మీ ఖాతాను యాక్సెస్ చేయడంలో మీ రికవరీ ఫోన్ నంబర్ మీకు సహాయపడుతుంది.

ఫోన్ నంబర్‌లు ఎలా ఉపయోగించబడతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ప్రస్తుత ఈమెయిల్ అడ్రస్

మీకు ఇప్పటికే ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటే, దాన్ని జోడించాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము. ఈ ఈమెయిల్ అడ్రస్‌ను ఈ కింద పేర్కొన్న వాటికి మీరు ఉపయోగించవచ్చు:

  • మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి.
  • మీరు సైన్ ఇన్ చేయలేకపోతే (ఉదాహరణకు, మీ పాస్‌వర్డ్‌ను మీరు మర్చిపోతే), తిరిగి మీ ఖాతాను యాక్సెస్ చేయడంలో మీకు సహాయపడటానికి.
  • Google సర్వీస్‌ల నుండి నోటిఫికేషన్‌లను పొందడానికి.

ఈ సమాచారాన్ని తర్వాత ఎప్పుడైనా మార్చండి

మీరు Google ఖాతాను క్రియేట్ చేశాక, ఈ సమాచారంలో కొంత భాగాన్ని మీరు మార్చవచ్చు, అలాగే అది ఎవరికి కనిపించాలి అనేది కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు. కింది వాటిని ఎలా చేయాలో తెలుసుకోండి:

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13945094029045525811
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false