మీ అవతార్‌ను క్రియేట్ చేయండి, ఉపయోగించండి, మేనేజ్ చేయండి

అవతార్ అనేది మీకు చెందిన ప్రత్యేక డిజిటల్ వెర్షన్. మీరు అందించే సెల్ఫీ, వాయిస్ రికార్డింగ్‌ల ఆధారంగా దీనిని క్రియేట్ చేయడం జరుగుతుంది. మీలాగా కనిపించే, మీ వాయిస్‌ను పోలి ఉండే AI కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది.

మీ అవతార్‌ను క్రియేట్ చేయండి, ఉపయోగించండి

Google Flowలో, Gemini యాప్స్‌లో, లేదా YouTubeలో మీ అవతార్‌ను క్రియేట్ చేయడానికి మీ సెల్ఫీని, వాయిస్‌ను రికార్డ్ చేయవచ్చు. మీ అవతార్‌ను క్రియేట్ చేసిన తర్వాత, మీరు దాన్ని AI వీడియోలను క్రియేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీ అవతార్‌ను ఎక్కడ క్రియేట్ చేయాలి, దాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనే అంశాలపై పూర్తి కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది.

వీటిలో మీ అవతార్‌ను క్రియేట్ చేయడం, ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి:

చిట్కా: Geminiలో, Google Flowలో మీ అవతార్‌ను క్రియేట్ చేసిన తర్వాత, ఆ రెండు యాప్‌లలో AI వీడియోల కోసం అదే అవతార్‌ను ఉపయోగించవచ్చు. అయితే మీ YouTube అవతార్‌ను YouTubeలోనే విడిగా క్రియేట్ చేసి, మేనేజ్ చేసుకోవాలి.

మీ ముఖాన్ని, వాయిస్‌ను రికార్డ్ చేయడానికి చిట్కాలు

మీ రికార్డింగ్ ఎలాంటి సమస్యలు లేకుండా ఆమోదం పొందాలంటే, ఈ చిట్కాలను ఫాలో అవ్వండి:

  • ఫోన్ పొజిషన్: మీ ఫోన్‌ను కంటి స్థాయికి సమాంతరంగా పట్టుకోండి.
  • లైటింగ్: రికార్డ్ చేస్తున్నప్పుడు లైటింగ్ మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి.
  • విజిబిలిటీ: మీ కళ్లు, ముక్కు, నోరు స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. సాధారణ కళ్లద్దాలు ధరించవచ్చు, కానీ సన్ గ్లాస్‌లు, మాస్క్‌లు లేదా టోపీలు ఉండకూడదు.
  • ఆడియో ఎన్విరాన్‌మెంట్: మీ వాయిస్‌ను రికార్డ్ చేయడానికి నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర వాయిస్‌లు ఉండకూడదు.
  • బ్యాక్‌గ్రౌండ్: మీ బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే వ్యక్తులు గానీ లేదా ముఖాల ఇమేజ్‌లు గానీ లేకుండా చూసుకోండి.
  • ఖాతా ఓనర్: ఈ ప్రాసెస్‌ను తప్పనిసరిగా ఖాతా ఓనరే పూర్తి చేయాలి. మైనర్‌లు తమను తాము రికార్డ్ చేసుకోవడానికి అనుమతించవద్దు.
  • సెల్ఫీ సూచనలు: ఏదైనా చర్యను పూర్తి చేయడానికి, స్క్రీన్‌పై కనిపించే ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి. మీ తలను ఒక దిశలో తిప్పిన తర్వాత, దానిని మళ్లీ మధ్యకు తిప్పండి.

మీ రికార్డింగ్‌ను మేనేజ్ చేయండి

మీ అవతార్‌ను రూపొందించడానికి మీ రికార్డింగ్‌నే ఉపయోగిస్తాము. మీరు రికార్డింగ్‌ను క్రియేట్ చేసి ఉంటే, రికార్డింగ్‌ను తొలగించవచ్చు, మీ Google ఖాతాలో అవతార్ ప్రివ్యూను చూడవచ్చు. మీరు ఈ కింది వివరాలను యాక్సెస్ చేయవచ్చు:

  • క్రియేషన్ వివరాలు: మీ అవతార్‌ను ఎప్పుడు, ఎక్కడ క్రియేట్ చేశారో తెలిపే వివరాలు
  • ఉపయోగం: మీరు మీ అవతార్‌ను ఉపయోగించిన సర్వీస్‌లు
  • అవతార్ ప్రివ్యూ: మీ అవతార్‌కు సంబంధించిన శాంపిల్ ఇమేజ్

మీ రికార్డింగ్‌ను తొలగించండి లేదా దాని ప్రివ్యూను చూడండి

మీ రికార్డింగ్‌లపై పూర్తి అధికారం మీదే. మీరు వాటిని మీ Google ఖాతా సెట్టింగ్‌లలో ఏ సమయంలోనైనా తొలగించవచ్చు.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎగువున లేదా ఎడమ వైపున, డేటా & గోప్యత ఆ తర్వాత ఇతర సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. కిందికి స్క్రోల్ చేసి, మీ అవతార్ కోసం రికార్డింగ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న సెల్ఫీ, వాయిస్ రికార్డింగ్ కింద ఉన్న తొలగించండిని ఎంచుకోండి.
    1. ఇమేజ్ ప్రివ్యూను చూడండిని ఎంచుకోవడం ద్వారా మీ అవతార్ ప్రివ్యూను కూడా చూడవచ్చు.
  5. స్క్రీన్‌పై కనబడే ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.

మీ రికార్డింగ్‌లను మేనేజ్ చేయండి

చిట్కా: మీరు 3 సంవత్సరాల పాటు మీ రికార్డింగ్‌లను ఉపయోగించకపోయినా లేదా యాక్సెస్ చేయకపోయినా, వాటిని ఆటోమేటిక్‌గా తొలగిస్తాము.

మీ రికార్డింగ్‌లను మీరు తొలగించినప్పుడు:

  • ఇకపై ఆ అవతార్‌ను ఉపయోగించి AI జెనరేట్ చేసిన కంటెంట్‌ను క్రియేట్ చేయలేరు. కొత్త కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి, మీరు ఉపయోగించాలనుకుంటున్న యాప్‌నకు లేదా సర్వీస్‌కు తిరిగి వెళ్లి, మీ సెల్ఫీని, వాయిస్‌ను మళ్లీ రికార్డ్ చేయడం ద్వారా కొత్త అవతార్‌ను క్రియేట్ చేయాలి.
  • ఆ అవతార్ కోసం మీరు రికార్డ్ చేసిన సెల్ఫీ, వాయిస్ డేటాను Google సిస్టమ్‌ల నుండి తీసివేస్తాము.
  • ఆ అవతార్‌తో మీరు ఇప్పటికే క్రియేట్ చేసి, పబ్లిష్ చేసిన వీడియోలు లేదా కంటెంట్ మాత్రం అలాగే ఉంటాయి, వాటిని తొలగించము. మీ అవతార్‌తో క్రియేట్ చేసిన కంటెంట్‌ను తొలగించడానికి, Google Flow, Gemini లేదా YouTube వంటి సర్వీస్‌కు లేదా యాప్‌నకు వెళ్లండి.

చిట్కా: మీరు YouTubeలో అవతార్‌ను క్రియేట్ చేస్తే, మీ Google ఖాతా సెట్టింగ్‌లలో కాకుండా మీ YouTube సెట్టింగ్‌లలో మీ YouTube అవతార్‌ను, రికార్డింగ్‌లను మేనేజ్ చేయగలరు. ఇక్కడ మీ రికార్డింగ్‌లను తొలగించడం వల్ల మీ YouTube ఛానెల్‌లో స్టోర్ అయి ఉన్న మీ రికార్డింగ్‌లు తొలగిపోవు. అదే విధంగా, మీ YouTube రికార్డింగ్‌లను తొలగించడం వల్ల మీ Google ఖాతాలోని రికార్డింగ్‌లు తొలగిపోవు. మీ YouTube రికార్డింగ్‌ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

గోప్యత, మీ అవతార్ గురించి అర్థం చేసుకోండి

మీ గోప్యతను కాపాడటానికి, మీ రికార్డింగ్‌లపై మీకు పూర్తి కంట్రోల్‌ను అందించడానికి Google, అవతార్ ఫీచర్‌ను రూపొందించింది.

మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా ఉపయోగిస్తారు

మీరు Google Flowలో, Geminiలో అవతార్‌ను క్రియేట్ చేసినప్పుడు, మీ ముఖం, వాయిస్ డేటా రికార్డ్ అయ్యి, మీ Google ఖాతాలో సురక్షితంగా స్టోర్ అవుతుంది.

మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు, మీ ముఖం, వాయిస్ రికార్డింగ్‌లను (“మీ రికార్డింగ్‌లు”), అలాగే మీ రికార్డింగ్‌ల నుండి సేక‌రించిన‌, జెనరేట్ చేసిన డేటాను మేము కింది ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాము:

  • కంటెంట్ జెనరేషన్: Google Flow, Gemini వంటి నిర్దిష్ట Google సర్వీస్‌లలో మీ అవతార్‌ను ఉపయోగించి కొత్త కంటెంట్‌ను జెనరేట్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది.
  • భద్రత & సెక్యూరిటీ: Googleను, మా యూజర్‌లను, అలాగే పబ్లిక్‌ను సంరక్షించడానికి ఉపయోగిస్తాము, ఇందులో భాగంగా రివ్యూవర్‌ల సహాయం కూడా తీసుకుంటాము. ఉదాహరణకు, మీ అవతార్‌ను క్రియేట్ చేయడానికి Googleకు అనుమతినిస్తున్నది మీరేనని, మీరు ఒక నిజమైన వ్యక్తి అని నిర్ధారించుకోవడానికి మేము ఈ డేటాను ఉపయోగించవచ్చు. AI భద్రతతో పాటు, మా సర్వీస్‌లన్నింటిలో భద్రతను, సెక్యూరిటీని మెరుగుపరచడానికి కూడా మేము ఈ డేటాను ఉపయోగించవచ్చు.

మిమ్మల్ని లేదా ఎవరినైనా గుర్తించడానికి మీ రికార్డింగ్‌లను ఉపయోగించడం జరగదు. Google మీ రికార్డింగ్‌లను ఏ థర్డ్-పార్టీకీ విక్రయించదు. Google గోప్యతా పాలసీలో అనుమతించిన సందర్భాల్లో తప్ప, Google మీ డేటాను థర్డ్-పార్టీలకు షేర్ చేయదు. క్లౌడ్ కస్టమర్‌ల విషయంలో, క్లౌడ్ డేటా ప్రాసెసింగ్ అనుబంధ డాక్యుమెంట్‌లో పేర్కొన్న నియమాలు వర్తిస్తాయి. కొన్ని ప్రాంతాలలో, మీ ముఖం, వాయిస్ డేటా, అలాగే వాటి నుండి సేకరించిన లేదా రూపొందించిన డేటాను బయోమెట్రిక్ డేటాగా పరిగణించవచ్చని దయచేసి గమనించండి.

దుర్వినియోగాన్ని లేదా హానిని అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు తప్ప, మా సర్వీస్‌లకు శక్తినిచ్చే జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడానికి మీ రికార్డింగ్‌లను ఉపయోగించము.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
5149950897445963512
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
70975
false
false
false
false
false