మీ చట్టపరమైన పేరు, అలాగే మీ Google ఖాతా గురించి పరిచయం

మీ చట్టపరమైన పేరు అనేది, మీరు Googleలో మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు లేదా మీ గుర్తింపును వెరిఫై చేసినప్పుడు మీరు ఉపయోగించిన పేరు. మీరు నిర్దిష్ట బిజినెస్ ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌ల కోసం సైన్ అప్ చేయడానికి ఉపయోగించిన పేరు కూడా కావచ్చు.

Googleకు చట్టపరమైన పేరు ఎందుకు అవసరం

నియంత్రణ చట్టాలకు అనుగుణంగా, మా పారదర్శకత పాలసీలను అమలు చేయడానికి, అలాగే మోసాన్ని నిరోధించడానికి Google మీ చట్టపరమైన పేరును ఉపయోగిస్తుంది.

చట్టపరమైన పేరు & డిస్‌ప్లే పేరు

మీ చట్టపరమైన పేరు తప్పనిసరిగా మీ డిస్‌ప్లే పేరు మాదిరిగా ఉండాల్సిన అవసరం లేదు. మీ డిస్‌ప్లే పేరు అనేది, మీరు మీ Google ఖాతాను క్రియేట్ చేసినప్పుడు ఉపయోగించడానికి ఎంచుకున్న పేరు.

మీ డిస్‌ప్లే పేరు, అలాగే ప్రొఫైల్ ఫోటో చాలా Google సర్వీస్‌లలో కనిపిస్తాయి. ఎవరైనా మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు లేదా మీరు Google సర్వీస్‌లలో క్రియేట్ చేసే కంటెంట్‌ను చూసినప్పుడు, వారికి మీ డిస్‌ప్లే పేరు కనిపిస్తుంది.

చిట్కా: మీరు Google ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను ఉపయోగించడానికి మునుపు మీ గుర్తింపును వెరిఫై చేయాల్సి ఉంటే, మీ చట్టపరమైన పేరు వెరిఫై చేయబడిందిగా కనిపించవచ్చు.

Google సర్వీస్‌లు అన్నిటిలో మీ గురించి ఇతరులు చూసే వాటిని కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ చట్టపరమైన పేరును ఎవరు చూడవచ్చు

మీ చట్టపరమైన పేరు ఈ ప్రదేశాలలో ఇతరులకు మాత్రమే కనిపిస్తుంది:

  • మీరు Google Adsను కొనుగోలు చేసి ఉంటే, Ads Transparency Centerలో కనిపిస్తుంది
  • మీరు పబ్లిష్ చేసిన యాప్ డెవలపర్ అయితే Play Storeలో కనిపిస్తుంది

మీ చట్టపరమైన పేరును ఎడిట్ చేయండి

ముఖ్య గమనిక: మీ చట్టపరమైన పేరు మీ ప్రభుత్వం జారీ చేసిన IDలోని పేరు వంటి మీ గుర్తింపును ప్రతిబింబించాలి.

  1. myaccount.google.com లింక్‌కు వెళ్లండి.
    • మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉన్నట్లయితే, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  2. పైన ఎడమ వైపున, వ్యక్తిగత సమాచారం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. "ప్రాథమిక సమాచారం" కింద, పేరును ఎంచుకోండి.
  4. కింద, చట్టపరమైన పేరు ఆ తర్వాత చట్టపరమైన పేరును మార్చండి అనే ఆప్షన్‌లను ఎంచుకోండి.
  5. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
15280975648120665150
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false
false
false