సాధారణ సమస్యలు

కోడ్‌తో టెక్స్ట్ మెసేజ్ అందుకోలేకపోవడం

మీరు రికవరీ కోడ్‌ను రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎర్రర్ మెసేజ్ వస్తున్నట్లయితే, దయచేసి మీరు ఒక రోజులో సమర్పించగల రికవరీ కోడ్ రిక్వెస్ట్‌ల సంఖ్యకు పరిమితి ఉందని గమనించండి. మీరు ఈ పరిమితిని మించిపోయారని మీరు అనుకుంటే, 24 గంటలు వేచి ఉండి, మళ్లీ ట్రై చేయండి.

మీకు రికవరీ కోడ్ అందకపోతే, ఈ సమస్యకు కారణాలు, కొన్ని సూచనల లిస్ట్‌ను చెక్ చేయండి:

  • మా సర్వీస్‌ తాత్కాలికంగా అందుబాటులో లేకపోవడం.. మీరు రికవరీ కోడ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇది జరిగి ఉండవచ్చు.
  • మీ మొబైల్ ఫోన్ నంబర్‌ను మీరు పోర్ట్ చేశారు. అదే ఫోన్ నంబర్‌ను ఉంచేటప్పుడు మీరు మొబైల్ ప్రొవైడర్‌లను స్విచ్ చేసినట్లయితే, టెక్స్ట్ మెసేజింగ్ వెంటనే పని చేయకపోవచ్చు. మళ్లీ ట్రై చేసే ముందు దయచేసి వేచి ఉండండి.
  • మీ ప్రొవైడర్ షార్ట్‌కోడ్‌లను బ్లాక్ చేశారు. షార్ట్‌కోడ్‌లను ఉపయోగించే సర్వీస్‌ల నుండి టెక్స్ట్ మెసేజ్‌లను అందుకోకుండా మీ మొబైల్ ప్రొవైడర్ అనుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండవచ్చు. దయచేసి Google నుండి మెసేజ్‌లను అన్‌బ్లాక్ చేయమని మీ క్యారియర్‌ను అడగండి.

రిపీట్ అయ్యే టెక్స్ట్ మెసేజ్‌లను అందుకోవడం

అప్పుడప్పుడు, మీ మొబైల్ ఫోన్, మీ మొబైల్ ప్రొవైడర్ మధ్య కమ్యూనికేషన్ సజావుగా సాగకపోతే, మీరు డూప్లికేట్ మెసేజ్ నోటిఫికేషన్‌లను అందుకోవచ్చు. మీరు పలు రికవరీ కోడ్‌లను రిక్వెస్ట్ చేస్తే, చివరిగా డెలివరీ అయిన కోడ్ మాత్రమే చెల్లుతుంది. మీ ఫోన్‌ను పలుమార్లు ఆఫ్, ఆన్ చేయడం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడవచ్చు.

అయినా సమస్య పరిష్కారం కాకపోతే, మీ టెక్స్ట్ మెసేజింగ్ సెట్టింగ్‌లను రీసెట్ చేయమని మీ మొబైల్ ప్రొవైడర్‌ను అడగండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3020838517099808580
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false