మీరు మీ Google ఖాతాలో సేవ్ చేసిన YouTube Music ప్లేలిస్ట్‌ల కాపీని ఇతర మ్యూజిక్ సర్వీసులతో షేర్ చేయవచ్చు. మీ ప్లేలిస్ట్‌లు నేరుగా థర్డ్-పార్టీ సర్వీసుకు బదిలీ చేయబడతాయి.
ముఖ్య గమనిక: మీరు YouTube ప్లేలిస్ట్‌లను షేర్ చేసిన తర్వాత అవి మీ Google ఖాతా నుండి తొలగించబడవు. ప్లేలిస్ట్‌ను ఎడిట్ చేయడం లేదా తొలగించడం ఎలాగో తెలుసుకోండి.
సపోర్ట్ చేయబడిన మ్యూజిక్ సర్వీసులు
Google Takeout, మీ ప్లేలిస్ట్‌లను నేరుగా సపోర్ట్ ఉన్న మ్యూజిక్ సర్వీసులకు బదిలీ చేయగలదు. అందులో ప్రస్తుతం కింద పేర్కొన్న అంశాలు ఉంటాయి:
- Apple మ్యూజిక్ (సబ్‌స్క్రిప్షన్ అవసరం)
దశ 1: YouTube Music ప్లేలిస్ట్‌లను ఎంచుకోండి
Google Takeout తాలూకు YouTube Music ప్లేలిస్ట్‌ల వీక్షణను బదిలీ చేయండికి వెళ్లండి లేదా ఈ దశలను ఫాలో చేయండి:
- https://myaccount.google.com/dashboardకు వెళ్లండి.
- “ఇటీవల ఉపయోగించిన Google సర్వీస్‌లు”, లేదా “ఇతర Google సర్వీస్‌లు” కింద, YouTubeకు స్క్రోల్ చేసి, డేటాను బదిలీ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీరు కాపీ చేయాలనుకుంటున్న డేటాను ఎంచుకోండి.
- కొనసాగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేసి, Takeoutను ప్రామాణీకరించాలి.
చిట్కా: మీరు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌లను బదిలీ చేయవచ్చు. కానీ మీరు మీ లైబ్రరీకి సేవ్ చేసిన ఇతర యూజర్‌ల నుండి ప్లేలిస్ట్‌లు బదిలీ చేయబడవు.
2వ దశ: మీ ప్లేలిస్ట్‌లను కాపీ చేయండి
- డ్రాప్‌డౌన్ నుండి మీరు మీ YouTube మ్యూజిక్ ప్లేలిస్ట్‌లను షేర్ చేయాలనుకుంటున్న సపోర్ట్ ఉన్న థర్డ్-పార్టీ సర్వీసును ఎంచుకుని, కొనసాగించండి ఎంచుకోండి.
- మీ ఖాతాను లింక్ చేసుకోవడానికి, మీ ప్లేలిస్ట్‌లను బదిలీ చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి. మీరు గమ్యస్థాన సర్వీస్‌తో కూడిన మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి, Google Takeoutను ప్రామాణీకరించాలి.
- బదిలీని ప్రారంభించడానికి, అంగీకరించి, కొనసాగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ ప్లేలిస్ట్‌లు కాపీ అయిన తర్వాత:
- కొత్త సర్వీస్‌లో ప్లేలిస్ట్‌లను లొకేట్ చేయడానికి మీకు లింక్‌తో కూడిన ఈమెయిల్ వస్తుంది. కొన్ని సర్వీస్‌లు, విభిన్న లొకేషన్‌లలో ప్లేలిస్ట్‌లను స్టోర్ చేయవచ్చు.
- మీరు మీ ప్లేలిస్ట్‌లను బదిలీ చేసిన సర్వీసుకు ఇకపై మీ Google ఖాతా యాక్సెస్ కలిగి ఉండదు, కానీ అది సర్వీస్ సెట్టింగ్‌లలో ఇంకా కనిపిస్తుండవచ్చు.
- మీ Apple ఖాతాలో కనిపించే మీ Google ఖాతాను మీరు తీసివేయవచ్చు.
ముఖ్య గమనిక: ఇది మీ ప్లేలిస్ట్‌లలో ఒకసారి మాత్రమే జరిగే షేర్. మీరు వాటిని YouTube Musicలో గానీ లేదా మీరు ఏ థర్డ్-పార్టీ సర్వీసుకు షేర్ చేశారో దానిలో గానీ ఏవైనా మార్పులు చేస్తే, ఆ మార్పులు ఇతర సర్వీసులో కనిపించవు.
మీ ప్లేలిస్ట్‌లను ఇతర మ్యూజిక్ సర్వీసులకు ఎగుమతి చేయండి
నేరుగా ప్లేలిస్ట్‌ల బదిలీకి సపోర్ట్ చేయని ఇతర మ్యూజిక్ సర్వీసుల కోసం, మీరు మీ YouTube ప్లేలిస్ట్‌లను, ఆల్బమ్‌లను, ఆర్టిస్ట్‌లను, ట్రాక్‌లను ఎగుమతి చేయడానికి థర్డ్-పార్టీ సర్వీసును ఉపయోగించవచ్చు. కొన్ని థర్డ్-పార్టీ సర్వీస్‌లలో ఇవి ఉంటాయి:
థర్డ్-పార్టీ సర్వీసుతో మీ ప్లేలిస్ట్‌లను బదిలీ చేయడానికి:
- YouTube Musicకు సైన్ ఇన్ చేయడానికి ఎగువ లింక్‌లను ఉపయోగించి సపోర్ట్ ఉన్న సర్వీసుల్లో ఒకదాన్ని తెరిచి, స్క్రీన్‌పై ఉన్న సూచనలను ఫాలో చేయండి.
- మీరు మీ మ్యూజిక్‌ను ఎగుమతి చేయాలనుకుంటున్న సర్వీసును ఎంచుకోండి.
- మీ YouTube Music ఖాతాతో అనుబంధించబడిన Google ఖాతాను యాక్సెస్ చేయడానికి మ్యూజిక్ సర్వీసుకు అనుమతిని అందించడానికి నిర్ధారించండి మీద క్లిక్ చేయండి.
- మీ ఎగుమతిని పూర్తి చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
థర్డ్-పార్టీ, వారి సర్వీసుకు దిగుమతి పూర్తయిన తర్వాత లేదా బదిలీ సమయంలో ఎర్రర్‌లు ఏర్పడినట్లయితే మీకు తెలియజేస్తుంది.
ప్లేలిస్ట్‌ల కాపీని షేర్ చేయడాన్ని సపోర్ట్ చేయని ఖాతా రకాలు
మీ Google ఖాతా ఇలాటింది అయితే మీరు ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు:
- ఆఫీస్, పాఠశాల, లేదా ఇతర సంస్థలకు చెందినది.
- అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ ఆన్‌లో ఉన్నప్పుడు.
చిట్కా: వారి దేశంలోని వయోపరిమితి కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారి, వారి తల్లిదండ్రుల నుండి ఆమోదం పొందినట్లయితే ప్లేలిస్ట్‌ల కాపీని షేర్ చేయవచ్చు.
ప్లేలిస్ట్‌ల షేర్ చేయబడిన కాపీల గురించి సాధారణ ప్రశ్నలు
నా ప్లేలిస్ట్‌ల నుండి అన్ని పాటలు కాపీ చేయబడతాయా?
ఏ రకమైన ప్లేలిస్ట్‌లను కాపీ చేయవచ్చు?
మీరు క్రియేట్ చేసిన ఏవైనా ప్లేలిస్ట్‌లు కాపీ చేయబడతాయి. కింది రకాల ప్లేలిస్ట్‌లు కాపీ చేయబడవు:
- YouTube Music వ్యక్తిగతీకరించిన ప్లేలిస్ట్‌లు.
- YouTube Musicలో లైక్ చేసిన మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు.
- మీరు ఓనర్ కాకపోతే సహకార ప్లేలిస్ట్‌లు.
అలాగే, కేటలాగ్ మ్యూజిక్ ట్రాక్‌లు మాత్రమే బదిలీ చేయబడతాయి. కింది రకాల కంటెంట్‌కు సపోర్ట్ లేదు:
- యూజర్ అప్‌లోడ్ చేసిన లేదా ప్రైవేట్ కంటెంట్.
- పాడ్‌కాస్ట్‌లు.
ప్రాసెస్ ఎంత సమయం పడుతుంది?
నేను ఈ ప్రాసెస్‌ను రివర్స్ చేయవచ్చా?
బదిలీ పూర్తి కాకముందే నేను దాన్ని రద్దు చేస్తే?
ప్రాసెస్‌ను పూర్తిగా రద్దు చేయడానికి, Apple గోప్యతా పోర్టల్‌కు వెళ్లి, రిక్వెస్ట్ అక్కడ కూడా రద్దు చేయబడిందని నిర్ధారించుకోండి. లేకపోతే మీరు కొత్త బదిలీని ప్రారంభించడానికి ట్రై చేస్తే, మీకు ఎర్రర్ రావచ్చు.