మీ డేటా కాపీని థర్డ్-పార్టీతో షేర్ చేయండి

ముఖ్య గమనిక: Googleలో భాగం కాని కంపెనీలు లేదా డెవలపర్‌లను థర్డ్-పార్టీ సర్వీస్‌లు అంటారు. మీరు విశ్వసించే థర్డ్-పార్టీ సర్వీస్‌లకు మాత్రమే మీ డేటా కాపీని తరలించండి. ప్రమాదాల గురించి తెలుసుకోండి.

మీ డేటా కాపీని తరలించడానికి మీ సామర్థ్యాన్ని విస్తరించడానికి, ఆ సర్వీస్‌తో ఉపయోగం కోసం మీ Google డేటాలో కొంత కాపీని తరలించడానికి థర్డ్-పార్టీ సర్వీస్‌ను అనుమతించే ఆప్షన్‌ను Google మీకు అందిస్తుంది. ఈ ఆప్షన్ సపోర్ట్ ఉన్న దేశాలు, ఇంకా ప్రాంతాలలో యూజర్‌లకు అందుబాటులో ఉంటుంది, అలాగే Google Takeoutతో యూజర్‌లు అందరు ఇప్పటికే ఏమి చేయగలరో దానికి జోడిస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులో లేని యూజర్‌ల విషయంలో, మీరు మీ స్వంత వినియోగం కోసం మీ Google ఖాతాలోని కంటెంట్ కాపీని క్రియేట్ చేయడానికి లేదా మాన్యువల్‌గా థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించడానికి Google Takeoutను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

అందుబాటులో ఉన్నప్పుడు, మీ డేటాను తరలించే ప్రాసెస్ ఎల్లప్పుడూ థర్డ్-పార్టీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రారంభమవుతుంది. Google వెలుపలి సర్వీస్‌లు ఈ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచడానికి మా టూల్స్‌ను ఉపయోగించగలిగినప్పటికీ, దీన్ని సెటప్ చేసుకొనే విషయంలో వారి ఎంపికను, అలాగే బాధ్యతను వారే వహించాల్సి ఉంటుంది.

చిట్కా: మీ ఖాతా మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థ ద్వారా మేనేజ్ చేయబడుతుంటే, మీ అడ్మినిస్ట్రేటర్ ఈ ఆప్షన్‌ను ఆన్ చేస్తే మినహా మీరు మీ Google డేటా కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించలేరు. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చా లేదా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ముఖ్య గమనికలు:

  • మీరు మీ డేటా కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించాలనుకుంటున్నారో లేదో ఎంచుకోవచ్చు.
    • మీరు మీ డేటా కాపీని తరలించాలని నిర్ణయించుకుంటే, ఏ డేటాను కాపీ చేయాలో మీరు ఎంచుకోవచ్చు.
  • ఇది మీ డేటా కాపీని తరలించడానికి ఒకసారి మాత్రమే జరిగే రిక్వెస్ట్.
  • మీరు కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించిన తర్వాత, మీ Google ఖాతా నుండి మీ డేటా తొలగించబడదు.
  • థర్డ్-పార్టీ సర్వీస్‌ మీ డేటా కాపీని అందుకున్న తర్వాత, ఆ కాపీని మేనేజ్ చేయడం, అలాగే సంరక్షించడం అనేది వారి బాధ్యత.

మీరు మీ డేటా కాపీని తరలించడానికి ముందు

Googleలో, మేము మీ డేటాను సంరక్షించి, మీ కంట్రోల్‌లో ఉంచడానికి తీవ్రంగా కృషి చేస్తాము. మీరు మీ డేటా కాపీని తరలించాలని నిర్ణయించుకునే ముందు, బదిలీ చేయడానికి సంబంధించిన ప్రాసెస్‌ను అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం.

మీరు థర్డ్-పార్టీ సర్వీస్‌ను విశ్వసిస్తున్నారని నిర్ధారించుకోండి

ముఖ్య గమనిక: Google మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ, ఏ ప్రయోజనం కోసం విక్రయించదు. మీరు అనుమతి ఇస్తే మినహా, మేము మీ డేటాను తరలించము.

థర్డ్-పార్టీ సర్వీస్ మీ డేటా కాపీని అందుకున్న తర్వాత, ఆ కాపీ ఎలా మేనేజ్ చేయబడుతుంది, ఎలా సంరక్షించబడుతుంది అనే దానికి వారు బాధ్యత వహిస్తారు, Google కాదు.

మీరు షేర్ చేసే డేటాలో వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారం ఉండవచ్చు, కాబట్టి దాన్ని మీరు కూడా జాగ్రత్తగా రివ్యూ చేయాల్సి ఉంటుంది. మీ డేటా సురక్షితంగా ఉంటుందని మీరు విశ్వసిస్తే, మీరు దాన్ని షేర్ చేయడానికి సౌకర్యంగా ఉన్నట్లయితే మాత్రమే దాని కాపీని తరలించండి.

మీరు థర్డ్-పార్టీ సర్వీస్‌కు చెందిన గోప్యతా పాలసీని, అలాగే సెక్యూరిటీ బహిర్గతాలను చదవాలని కూడా మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది మీ డేటాను వారు ఎలా ఉపయోగిస్తున్నారు, అలాగే వారు దాన్ని సురక్షితంగా, ఇంకా ప్రైవేట్‌గా ఎలా ఉంచుతారో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. దీనిలో వారు మీ గోప్యమైన, అలాగే ప్రైవేట్ సమాచారాన్ని చదవగలరా, ఎడిట్ చేయగలరా, తొలగించగలరా, కాపీని తరలించగలరా లేదా విక్రయించగలరా అనేది ఉంటుంది.

నియంత్రణ మీ చేతుల్లో ఉంటుంది

ముఖ్య గమనిక: మీ ఖాతా భద్రతకు సంబంధించిన నిర్దిష్ట డేటా, అలాగే సమాచారం, పాస్‌వర్డ్‌లు వంటివి కాపీ చేయడానికి, థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించడానికి అందుబాటులో ఉండవు.

మీరు మీ Google ఖాతా నుండి డేటా కాపీని Google వెలుపలి సర్వీస్‌కు తరలించాలనుకుంటున్నారా లేదా అనేది మీరు నిర్ణయించుకుంటారు. ఏ డేటా కాపీ చేయాలనేది కూడా మీరే నిర్ణయించుకుంటారు.

ఉదాహరణకు, మీరు మీ YouTube డేటా కాపీని తరలించాలని నిర్ణయించుకుంటే, మీరు మీ ప్రైవేట్ వీడియోలను కాపీ చేయకూడదని ఎంచుకోవచ్చు. మీ డేటా కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించడానికి ప్రతి రిక్వెస్ట్ మీరు కాపీ చేయడానికి లేదా కాపీ చేయకూడదని ఎంచుకోగల డేటాకు సంబంధించి ఆప్షన్‌లను చూపుతుంది.

చిట్కా: Google మీ డేటా కాపీని క్రియేట్ చేయడం పూర్తి చేయడానికి ముందు మీరు ఈ రిక్వెస్ట్‌ను రద్దు చేయవచ్చు. థర్డ్-పార్టీ సర్వీస్‌కు మీరు అందించిన యాక్సెస్‌ను తీసివేయడానికి, మీ Google ఖాతాను సందర్శించండి.

ఇది మీ డేటా కాపీని తరలించడానికి ఒకసారి మాత్రమే జరిగే రిక్వెస్ట్.

ఈ ప్రాసెస్ మీ Google ఖాతాను థర్డ్-పార్టీ సర్వీస్‌తో సింక్ చేయదు. ఈ ప్రాసెస్ మీ డేటాకు సంబంధించి ఒక్క సారి మాత్రమే కాపీని క్రియేట్ చేస్తుంది, అది థర్డ్-పార్టీ సర్వీస్ ద్వారా తరలించబడుతుంది.

మీరు జరిగిన అదనపు మార్పులను క్యాప్చర్ చేయడానికి మీ డేటా కాపీని మరొకసారి అదే సర్వీస్‌కు తరలించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా మళ్లీ ప్రాసెస్‌ను కొనసాగించాలి. మీ డేటాకు చెందిన ఎన్ని కాపీలు అయినా రూపొందించవచ్చు, కానీ మీ డేటాను రక్షించడంలో సహాయపడటానికి, మీరు ప్రతిసారీ కాపీని ప్రామాణీకరించాలి.

మీ ఖాతా తొలగించబడదు

ఈ ప్రాసెస్‌లో భాగంగా, Google మీరు ఉపయోగించే Google సర్వీస్‌ల నుండి మీ డేటా ఏదీ తొలగించదు. Google మీ డేటాను థర్డ్-పార్టీ సర్వీస్ ద్వారా తరలించబడిన సమయంలో ఉన్నట్లుగా అదే కాపీను రూపొందిస్తుంది. మీ Google ఖాతాలోని సమాచారాన్ని కనుగొనడం, కంట్రోల్ చేయడం, అలాగే తొలగించడం ఎలాగో తెలుసుకోండి.

చిట్కాలు:

  • డేటాను తరలించడం అనేది థర్డ్-పార్టీ సర్వీస్ మీ డేటా ఎగుమతిని ఎప్పుడు ప్రారంభిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది, కానీ వారు దాన్ని తరలించడానికి మీ అనుమతిని అడిగినప్పుడు కాదు.
  • ఈ రెండు చర్యల మధ్య జరిగే మీ డేటాకు మార్పులు, చేర్పులు కాపీలో కనిపిస్తాయి.
  • ఎగుమతి ప్రారంభించిన తర్వాత జరిగే మార్పులు, చేర్పులు దీనిలో చేర్చబడకపోవచ్చు.

మీరు మీ Google ఖాతా నుండి డేటా కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌కు తరలించాలని ఎంచుకున్నట్లయితే, Google మీరు ఎంచుకున్న డేటాకు సంబంధించిన ఒక కాపీని రూపొందిస్తుంది. మీ డేటాను తరలించడానికి థర్డ్-పార్టీ సర్వీస్ బాధ్యత వహిస్తుంది.

ముఖ్య గమనిక: Googleకు చెందని కంపెనీలు లేదా డెవలపర్‌లను థర్డ్-పార్టీ సర్వీస్‌లు అంటారు. మీరు విశ్వసించే థర్డ్-పార్టీ సర్వీస్‌లకు మాత్రమే మీ డేటా కాపీని తరలించండి. ప్రమాదాల గురించి తెలుసుకోండి.

మీ డేటాకు సంబంధించిన కాపీని తరలించండి

థర్డ్-పార్టీ సర్వీస్ మీ డేటాలో కొంత భాగానికి సంబంధించి యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి, ఈ ప్రాసెస్ ఎల్లప్పుడూ వారి యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఆప్షన్ ఎలా లేదా ఎక్కడ కనిపించాలి అనేది Google కంట్రోల్ చేయదు.

మీరు మీ డేటాలో కొంత కాపీని తరలించాలని నిర్ణయించుకున్నట్లయితే:

  • మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
  • మీ డేటాకు సంబంధించిన కాపీని తరలించాలా వద్దా, అలాగే థర్డ్-పార్టీ యాక్సెస్ చేయగల డేటా గురించి సూచనలను జాగ్రత్తగా చదివి నిర్ణయం తీసుకోండి.
  • మీ డేటా కాపీ థర్డ్-పార్టీ సర్వీస్ ద్వారా తరలించడానికి అందుబాటులో ఉంటుంది.
  • డేటా తరలించబడిన తర్వాత, మీ డేటా కాపీని సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంచడానికి థర్డ్-పార్టీ సర్వీస్ బాధ్యత వహిస్తుంది.

చిట్కా: ఎంత డేటా కాపీ చేయబడింది, థర్డ్-పార్టీ సర్వీస్ కాపీని ఎప్పుడు తరలిస్తుంది అనే దానిపై ఆధారపడి, ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి గంటలు లేదా రోజులు పట్టవచ్చు.

ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి

ఈ ఆర్టికల్‌లో వివరించని సమస్యలను మీరు ఎదుర్కొన్నట్లయితే, మీరు మాకు ఫీడ్‌బ్యాక్‌ను పంపవచ్చు.

సాధారణ ప్రశ్నలు

ఈ ఫీచర్ ఎక్కడ అందుబాటులో ఉంటుంది?
ముఖ్య గమనిక: మీరు నివసించే ప్రదేశంలో మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేకపోతే, అలాగే థర్డ్-పార్టీ సర్వీస్ దీనికి సపోర్ట్ చేస్తున్నట్లయితే, మీరు Google Takeoutను ఉపయోగించి మీ డేటాకు సంబంధించిన బ్యాకప్‌ను క్రియేట్ చేయవచ్చు. మీరు ఆ బ్యాకప్‌ను థర్డ్-పార్టీ సర్వీస్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.
మీ Google డేటా కాపీని Google వెలుపలి సర్వీస్‌కు తరలించే సామర్థ్యం కింది దేశాలలోను, అలాగే ప్రాంతాలలోను అందుబాటులో ఉంటుంది:
  • ఆస్ట్రియా
  • బెల్జియం
  • బల్గేరియా
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • ఎస్టోనియా
  • ఫిన్‌లాండ్
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • గ్రీస్
  • హంగేరి
  • ఐర్లాండ్
  • ఇటలీ
  • లాట్వియా
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మాల్టా
  • నెదర్లాండ్స్
  • పోలాండ్
  • పోర్చుగల్
  • రోమానియా
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • యునైటెడ్ కింగ్‌డమ్

మీ ఖాతా ఏ దేశంతో అనుబంధించబడింది అనేది Google ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకోండి.

పైన లిస్ట్ చేయబడిన దేశాలలోని యూజర్‌లు అందరు ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చా?

లేదు, మీ Google ఖాతా ఆధారంగా ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. మీ ఖాతా కింద పేర్కొన్న విధంగా ఉన్నట్లయితే మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించలేకపోవచ్చు:

నా డేటాను కాపీ చేసే ప్రాసెస్‌లో ఎర్రర్ లేదా సమస్య ఉన్నట్లయితే ఏమి చేయాలి?

ఈ కింది కారణాల వల్ల Google మీ డేటాకు సంబంధించిన కాపీని రూపొందించలేకపోవచ్చు:

  • డేటా కనబడకపోవడం. మీరు కాపీ చేయాలనుకుంటున్న డేటా రకం అదేనని నిర్ధారించుకోవడానికి తిరిగి మళ్లీ చెక్ చేయండి.
  • మునుపటి రిక్వెస్ట్ ఇంకా ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మీరు కొత్త రిక్వెస్ట్‌ను చేశారు. ఈ సందర్భంలో, ఈ రెండు రిక్వెస్ట్‌లలో ఒకటి విఫలం కావచ్చు. మీరు కొత్త రిక్వెస్ట్ చేసే ముందు, ఏవైనా పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లు పూర్తయ్యే వరకు వేచి ఉండండి.
  • మీ డేటాను కాపీ చేసే ప్రాసెస్‌లో ఎర్రర్ ఏర్పడటం. అలా జరిగినట్లయితే, ప్రాసెస్‌ను తిరిగి ప్రారంభం నుండి ట్రై చేయండి.

కాపీ చేసిన తర్వాత ఏవైనా సమస్యలు ఏర్పడినట్లయితే, నేరుగా థర్డ్-పార్టీ సర్వీస్‌ను సంప్రదించండి.

నేను ఏ Google ప్రోడక్ట్‌లను కాపీ చేసి, థర్డ్-పార్టీకి డేటాను తరలించగలను?

ముఖ్య గమనిక: Googleకు చెందని కంపెనీలు లేదా డెవలపర్‌లను థర్డ్-పార్టీ సర్వీస్‌లు అంటారు. మీరు విశ్వసించే థర్డ్-పార్టీ సర్వీస్‌లకు మాత్రమే మీ డేటా కాపీని తరలించండి. ప్రమాదాల గురించి తెలుసుకోండి.

మీరు ఈ Google ప్రోడక్ట్‌ల నుండి మీ డేటాలో కొంత కాపీని థర్డ్-పార్టీ సర్వీస్‌లకు తరలించవచ్చు:

  • Chrome బ్రౌజర్
  • Google Maps
  • Play Store
  • Google Search
  • Google Shopping
  • YouTube
నా డేటాకు చెందిన కాపీని నేను అనుకోకుండా తరలించినట్లయితే ఏమి జరుగుతుంది? దాన్ని నేను తొలగించవచ్చా?
థర్డ్-పార్టీ సర్వీస్ మీ డేటాను ఎలా ఉపయోగిస్తుందో, ఎలా స్టోర్ చేస్తుందో, అలాగే మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేయవచ్చో మీరు ఎల్లప్పుడూ అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. మీరు మీ డేటా కాపీని తరలించిన తర్వాత, మీరు డేటాను తొలగించగలరో లేదో చెక్ చేయడానికి మీరు థర్డ్-పార్టీ సర్వీస్‌ను సంప్రదించాలి.
నేను ఏ డేటాకు సంబంధించిన కాపీని తరలించాను అనేది ఎలా చెక్ చేయగలను?
మరింత సమాచారం కోసం, థర్డ్-పార్టీ సర్వీస్‌ను సంప్రదించండి.
థర్డ్-పార్టీ సర్వీస్‌ను నా డేటాను దుర్వినియోగం చేస్తే ఏమి చేయాలి?
ఉనికిలో ఉన్న ఏవైనా ఇతర నివారణోపాయాలతో పాటు, మీ డేటాను దుర్వినియోగం చేస్తుందని, స్పామ్‌ను క్రియేట్ చేస్తుందని, మీలా నటించి, హానికరమైన మార్గాల్లో మీ డేటాను ఉపయోగిస్తుందని మీరు విశ్వసిస్తే, మీరు Googleకు థర్డ్-పార్టీ సర్వీస్ గురించి కూడా రిపోర్ట్ చేయవచ్చు. థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌పై రిపోర్ట్ చేయండి.

డెవలపర్‌ల కోసం

మా డెవలపర్ గైడ్‌ను, అదనపు సూచనలను, రిసోర్స్‌లను, ఇంకా పాలసీలను చూడటానికి, మా  Data Portability API డాక్యుమెంట్‌ను చూడండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17507412941251373009
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false