DMA & మీ లింక్ చేసిన సర్వీస్‌ల గురించి

డిజిటల్ మార్కెట్స్ చట్టం (DMA) అనేది EU చట్టం, ఇది మార్చి 6, 2024 నుండి అమల్లోకి వస్తుంది. DMA ఫలితంగా, EUలో, కొన్ని Google సర్వీస్‌లను లింక్ చేసే ఎంపికను Google మీకు అందిస్తుంది. ఆ Google సర్వీస్‌లలో ఇవి ఉంటాయి:

  • Search
  • YouTube
  • Ad సర్వీస్‌లు
  • Google Play
  • Chrome
  • Google Shopping
  • Google Maps

మీరు ఈ సర్వీస్‌లన్నింటినీ లింక్ చేయడాన్ని ఎంచుకోవచ్చు, ఈ సర్వీస్‌లన్నింటిలో దేన్నీ లింక్ చేయకూడదని ఎంచుకోవచ్చు, లేదా మీరు ఈ సర్వీస్‌లలో ఏయే సర్వీస్‌లను లింక్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.

లింక్ చేసినప్పుడు, ఈ సర్వీస్‌లు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మీ డేటాను ఒక దానితో ఒకటి, అలాగే అన్ని ఇతర Google సర్వీస్‌లతో షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీ సెట్టింగ్‌ల ఆధారంగా మీ కంటెంట్, అలాగే యాడ్‌లను వ్యక్తిగతీకరించడంలో సహాయపడటానికి లింక్ అయిన Google సర్వీస్‌లు కలిసి పని చేయవచ్చు.

లింక్ చేయడం సాధ్యపడని Google సర్వీస్‌లు

EUలోని చాలా మంది యూజర్‌లకు లింక్ చేయలేని సర్వీస్‌లు ఏవీ ఉండవు. జర్మనీలోని యూజర్‌లకు కొన్ని సర్వీస్‌లను లింక్ చేయడం సాధ్యపడదు.

చిట్కా: ఒక దానితో ఒకటి డేటాను షేర్ చేసుకునే, పైన పేర్కొనబడని ఇతర Google సర్వీస్‌లన్నీ ఎల్లప్పుడూ లింక్ చేయబడి ఉంటాయి.

లింక్ చేసిన సర్వీస్‌ల గురించి

సర్వీస్‌లు లింక్ చేసి ఉండకపోతే, Google సర్వీస్‌ల అంతటా డేటాను షేర్ చేయడానికి సంబంధించిన కొన్ని ఫీచర్‌లు పరిమితం చేయబడతాయి లేదా అందుబాటులో ఉండవు. ఉదాహరణకు:

  • Search, YouTube, Chrome అనేవి లింక్ చేసిన సర్వీస్‌లు కానప్పుడు, “మీ ప్రధాన ఫీడ్”, అలాగే మీ డిస్కవర్ ఫీడ్ వంటి Searchలోని మీ సిఫార్సులు తక్కువగా వ్యక్తిగతీకరించబడతాయి.
  • Search, Maps అనేవి లింక్ చేసిన సర్వీస్‌లు కానప్పుడు, Searchలో చేసిన రిజర్వేషన్‌లు Google Mapsలో కనిపించవు.

డేటాను షేర్ చేయని సర్వీస్‌కు సంబంధించిన అంశాలు ప్రభావితం కావు.

ఒకవేళ మీరు సర్వీస్‌లను లింక్ చేయకూడదని ఎంచుకుంటే, మీరు Google సర్వీస్‌లలో దేని నుండీ సైన్ అవుట్ చేయబడరు. అలాగే, Google సర్వీస్‌లను లింక్ చేయడం అంటే, మీ డేటాను థర్డ్-పార్టీ సర్వీస్‌లతో షేర్ చేయడం కాదు.

మీ లింక్ చేసిన సర్వీస్‌లను మేనేజ్ చేయండి

కంట్రోల్ మీ చేతుల్లో ఉంది. పైన లిస్ట్ చేసిన Google సర్వీస్‌లలో దేన్ని లింక్ చేయాలో మీరు ఎంచుకోవచ్చు. మీ Google ఖాతాలో మీ ఎంపికలను మీరు ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు లేదా మార్చవచ్చు. మీ లింక్ చేసిన సర్వీస్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీ డేటా గురించి

లింక్ చేసిన Google సర్వీస్‌ల అంతటా మీ డేటా ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఏమి డేటా ఉపయోగించబడుతుంది
లింక్ అయిన Google సర్వీస్‌లతో మీ ఇంటరాక్షన్‌ల గురించి సేకరించిన వ్యక్తిగత డేటా, ఏవైనా లింక్ చేసిన సర్వీస్‌లలో షేర్ చేయబడుతుంది. దీనిలో సెర్చ్‌లు, మీరు YouTubeలో చూసే వీడియోలు, Google Play నుండి మీరు ఇన్‌స్టాల్ చేసే యాప్‌ల సమాచారం, మీ పరికర సమాచారం వంటి అనుబంధిత సమాచారం, అలాగే మా గోప్యతా పాలసీలో వివరించిన అన్ని ఇతర రకాల సమాచారం ఉంటుంది
Google ఈ డేటాను ఎలా ఉపయోగిస్తుంది

మా గోప్యతా పాలసీలో పేర్కొన్న ప్రయోజనాల కోసం లింక్ చేసిన సర్వీస్‌ల అంతటా షేర్ చేయబడిన ఈ డేటాను Google కింద పేర్కొన్న విధంగా ఉపయోగిస్తుంది:

  • మీ సెట్టింగ్‌ల ఆధారంగా కంటెంట్, యాడ్‌లతో సహా వ్యక్తిగతీకరించబడిన సర్వీస్‌లను అందించడం
  • మా సర్వీస్‌లను నిర్వహించడం, అలాగే మెరుగుపరచడం
  • కొత్త సర్వీస్‌లను డెవలప్ చేయడం
  • మా సర్వీస్‌ల పనితీరును నిర్ధారించడం, మెరుగుపరచడం కోసం మా సర్వీస్‌లను వ్యక్తులు ఎలా ఉపయోగిస్తారనేది అర్థం చేసుకోవడం

లింక్ చేసిన సర్వీస్‌లకు సంబంధించి మీరు Google సర్వీస్‌లను వ్యక్తిగతీకరించడానికి మీరు చేసిన ఎంపికల వంటి మీరు చేసే ఎంపికలు మీ ఇతర సెట్టింగ్‌లను మార్చవు. మీ డేటా ఎలా షేర్ చేయబడుతుందో కంట్రోల్ చేయడానికి మీకు ఉన్న ఆప్షన్‌లను అవి కేవలం విస్తరింపజేస్తాయి.

Google కొన్ని సందర్భాల్లో డేటాను షేర్ చేయడం కొనసాగిస్తుంది

అన్ని Google సర్వీస్‌ల నుండి మీ డేటా, అవి లింక్ చేయబడి ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా, మోసాన్ని నివారించడం, స్పామ్, దుర్వినియోగం నుండి రక్షించడం, అలాగే చట్టానికి అనుగుణంగా ఉండటం వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం, ఇప్పటికీ అన్ని సర్వీస్‌లలో షేర్ చేయబడవచ్చు.

రెండు సర్వీస్‌లను కలిపి అందించబడినప్పుడు, టాస్క్‌లను పూర్తి చేయడంలో మీకు సహాయం చేయడానికి, మీ డేటా, Google సర్వీస్‌లలో కూడా షేర్ చేయబడవచ్చు. 

Related resources 

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8845370875418781568
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false