మీ Google ఖాతాకు సంబంధించి, వ్యక్తిగత సమాచారాన్ని మార్చండి

మీ Google ఖాతాను వ్యక్తిగతీకరించడానికి, మీరు మీ సమాచారాన్ని జోడించవచ్చు, మేనేజ్ చేయవచ్చు. మీరు ఈ సమాచారం ప్రైవేట్‌గా ఉండేలా సెట్ చేసుకోవచ్చు, లేదా అది అందరికీ కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు.  

ముఖ్య గమనిక:  మీరు Google సర్వీస్‌ల అంతటా ఇతరులకు మీ గురించి ఏ సమాచారం కనిపించాలో కంట్రోల్ చేయవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని మార్చండి

మీరు మీ పుట్టినరోజు, లింగం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు. మీరు మీ ఖాతాకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్‌లను, ఫోన్ నంబర్‌లను కూడా మార్చవచ్చు.

  1. ఏదైనా బ్రౌజర్‌లో, myaccount.google.com లింక్‌కు వెళ్లండి. మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.

  2. ఎగువ ఎడమ వైపున, "వ్యక్తిగత సమాచారం" అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత, మీరు మార్చాలనుకుంటున్న సమాచారాన్ని ఎంచుకోండి.

  3. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

మరిన్ని వివరాలు

పుట్టినరోజు

మీరు మీ ఖాతాకు మీ పుట్టినరోజును జోడించిన తర్వాత, ఇక దాన్ని తొలగించలేరు. అయితే, మీరు దాన్ని ఎడిట్ చేయవచ్చు, అలాగే అది ఎవరికి కనిపించాలో ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: ఖాతా సెక్యూరిటీ, ఇంకా వ్యక్తిగతీకరణ కోసం Google సర్వీస్‌ల అంతటా Google మీ పుట్టినరోజును ఉపయోగించవచ్చు.

మీ పుట్టినరోజును ఎవరు చూడగలరు

మేము మీ పుట్టినరోజును Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులతో ఆటోమేటిక్‌గా షేర్ చేయము. మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో కంట్రోల్ చేయడానికి:

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “ప్రాథమిక సమాచారం” కింద, పుట్టినరోజు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. అక్కడ మీ పుట్టినరోజు సమాచారం లేకపోతే, దాన్ని పూరించండి.
  5. "మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి" కింద, మీరు మాత్రమే అనే ఆప్షన్‌ను లేదా ఎవరైనా అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ పుట్టినరోజును హైలైట్ చేయండి

మీరు “మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి”ని ఎవరైనా అనే ఆప్షన్‌కు, లేదా వర్తిస్తే మీ సంస్థ అనే ఆప్షన్‌కు సెట్ చేసినప్పుడు, దాన్ని హైలైట్ చేసే వీలును మీరు Googleకు కల్పించవచ్చు. ఉదాహరణకు, మీ పుట్టినరోజు సమీపిస్తున్నప్పుడు, Google మీ ప్రొఫైల్ ఫోటో ఎక్కడ కనిపించినా దాన్ని అలంకరించవచ్చు. ఇతరులు మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు, లేదా కొన్ని Google సర్వీస్‌లలో మీరు క్రియేట్ చేసిన కంటెంట్‌ను చూసినప్పుడు, మీ పుట్టినరోజును, పుట్టినరోజు హైలైట్‌లను వారు చూడగలరు.

మీ పుట్టినరోజు ఎవరికీ కనిపించకుండా ఉండాలంటే, “మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి”ని మీరు మాత్రమే అనే ఆప్షన్‌కు సెట్ చేయండి, అప్పుడు Google దాన్ని హైలైట్ చేయదు. Google ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో మీ ప్రొఫైల్ ఫోటోను అలంకరించడం వంటి పనులను చేస్తుంది, కానీ అవి మీకు మాత్రమే కనిపిస్తాయి.

చిట్కా: మీ పుట్టినరోజు సరైన తేదీలో హైలైట్ చేయబడకపోతే, మీ ప్రొఫైల్‌లో మీ పుట్టినరోజు సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. ఇది ఇతరులకు వేరే తేదీలో హైలైట్ చేయబడినట్లు కనిపిస్తే, వారు తమ Google Contactsలో దాన్ని తప్పుగా ఎంటర్ చేసి ఉండవచ్చు.

Google మీ పుట్టినరోజును ఉపయోగించే కొన్ని మార్గాలు

Google మీ పుట్టినరోజును దీనికోసం ఉపయోగించవచ్చు:

లింగం

మీ Google ఖాతాకు సంబంధించిన లింగం విభాగంలో మీకు కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. మీరు వీటిని చేయవచ్చు:

  • మీ లింగాన్ని పేర్కొనడం.
  • మీ లింగాన్ని పేర్కొనకుండా ఉండటం.
  • అనుకూల లింగాన్ని జోడించి, Google మిమ్మల్ని ఎలా సంబోధించాలో ఎంచుకోవడం.

మీ లింగాన్ని ఎవరు చూడగలరు

ఆటోమేటిక్‌గా, Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులతో మీ లింగం షేర్ చేయబడదు. మీ లింగం ఎవరికి కనిపించాలి అనేది కంట్రోల్ చేయడానికి, మీ Google ఖాతాలోని 'నా గురించి పరిచయం' విభాగానికి వెళ్లండి.

Google మీ లింగాన్ని ఎలా ఉపయోగిస్తుంది

Google సర్వీస్‌లను మరింత వ్యక్తిగతంగా చేయడానికి మేము మీ లింగాన్ని ఉపయోగిస్తాము. మీరు మీ లింగాన్ని పేర్కొన్నప్పుడు, మీరు మాకు ఈ విధంగా సహాయపడతారు:

  • మిమ్మల్ని రెఫర్ చేసే మెసేజ్‌లను, ఇతర టెక్స్ట్‌ను వ్యక్తిగతీకరించడంలో. ఉదాహరణకు, మీ లింగాన్ని చూడగలిగే వ్యక్తులకు "అతనికి మెసేజ్ పంపండి" లేదా "ఆమె సర్కిల్స్‌లో" వంటి టెక్స్ట్ కనిపిస్తుంది.
  • యాడ్‌ల వంటి, మీకు ఆసక్తి ఉండే అవకాశం గల మరింత సందర్భోచితమైన, ప్రత్యేకంగా మీ కోసమే రూపొందించబడే కంటెంట్‌ను అందించడంలో.

మీరు మీ లింగాన్ని పేర్కొనకపోతే, "వారికి మెసేజ్‌ను పంపండి" వంటి లింగ-తటస్థ పరంగా ఉండే పదాలతో మిమ్మల్ని మేము సూచిస్తాము.

ఇతర సమాచారాన్ని మార్చండి

మీ పాస్‌వర్డ్‌ను మార్చండి
  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. "సెక్యూరిటీ" విభాగంలో, మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. పాస్‌వర్డ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • ప్రాంప్ట్ వచ్చినప్పుడు, మళ్లీ సైన్ ఇన్ చేయండి.
  4. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఆన్‌లైన్ సెక్యూరిటీ, అలాగే భద్రత గురించి మరింత సమాచారాన్ని పొందండి.

మీ గురించి ఇతరులకు కనిపించే అంశాలను కంట్రోల్ చేయండి

Google సర్వీస్‌లలో మీ గురించి ఇతరులకు ఏ సమాచారం కనిపించాలో ఎంచుకోవడానికి, మీ Google ఖాతాలోని 'నా గురించి పరిచయం' విభాగానికి వెళ్లండి.

మీరు ఏ సమాచారాన్ని మార్చవచ్చో, దాన్ని ఎలా మార్చాలో తెలుసుకోండి.

మీ టైమ్ జోన్‌ను మార్చండి

మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీ ప్రస్తుత లొకేషన్‌కు చెందిన టైమ్ జోన్‌లో మీరు ఈవెంట్‌లను చూడవచ్చు.

Google Calendarలో మీ టైమ్ జోన్‌ను మార్చడం ఎలాగో తెలుసుకోండి.

  సంబంధిత రిసోర్స్‌లు

 

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13098663735812396835
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false