మీ Google ఖాతా యాక్సెస్‌ను థర్డ్-పార్టీ యాప్‌లతో షేర్ చేయండి

నిర్దిష్ట ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి, మీరు థర్డ్-పార్టీ యాప్‌లు అలాగే సర్వీస్‌లకు మీ Google ఖాతాకు సంబంధించిన కొంత యాక్సెస్‌ను ఇవ్వవచ్చు. ఉదాహరణకు, ఫిల్టర్‌లను వర్తింపజేయడానికి ఫోటో ఎడిటర్ యాప్ మీ Google Photosకు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

థర్డ్-పార్టీ యాప్‌లు అలాగే సర్వీస్‌లు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేసే అవకాశం గల కొన్ని Google ప్రోడక్ట్‌లు:

  • Gmail
  • Drive
  • Calendar
  • Photos
  • Contacts

ముఖ్య గమనిక: Googleకు చెందని కంపెనీలు లేదా డెవలపర్‌లను థర్డ్-పార్టీ యాప్‌లు అంటారు. మీరు థర్డ్-పార్టీ యాప్‌ను విశ్వసిస్తేనే, మీ Google ఖాతాకు యాక్సెస్‌ను ఇవ్వండి.

థర్డ్-పార్టీ యాప్‌నకు మీ Google ఖాతా యాక్సెస్‌ను ఇవ్వండి

మీ Google ఖాతా డేటాకు కొంత యాక్సెస్‌ను షేర్ చేయడానికి, ఈ సూచనలను ఫాలో అవ్వండి:

  1. థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ మీ Google ఖాతాకు యాక్సెస్‌ను షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రాంప్ట్ చేసినప్పుడు, అది ఏ సమాచారాన్ని అలాగే అనుమతులను అడుగుతుందో తెలుసుకోవడానికి ఆ రిక్వెస్ట్‌ను జాగ్రత్తగా రివ్యూ చేయండి.
  2. మీరు యాక్సెస్‌ను షేర్ చేయాలని నిర్ణయించుకుంటే, మీరు తప్పనిసరిగా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.
  3. మీ Google ఖాతా డేటాకు కొంత యాక్సెస్‌ను కలిగి ఉండేందుకు థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను ప్రామాణీకరించండి.

మీ Google ఖాతాకు సంబంధించి థర్డ్-పార్టీ యాప్‌లు విభిన్న రకాల యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు. అవి వీటికి యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు:

  • మీ బేసిక్ ప్రొఫైల్‌ను పొందవచ్చు: మీ బేసిక్ ప్రొఫైల్ సమాచారంలో పేరు, ఈమెయిల్ అడ్రస్, అలాగే ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌లో కొత్త ఖాతాను క్రియేట్ చేయడానికి, థర్డ్-పార్టీ యాప్ ఈ సమాచారాన్ని రిక్వెస్ట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఉన్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌లో మీరు Googleతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు మీ బేసిక్ ప్రొఫైల్‌కు యాక్సెస్‌ను ప్రామాణీకరిస్తారు. Googleతో సైన్ ఇన్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
  • మీ Google ఖాతా నుండి డేటాను చూడవచ్చు అలాగే కాపీ చేయవచ్చు: మీ కాంటాక్ట్‌లు, ఫోటోలు, YouTube ప్లేలిస్ట్‌లు, ఇంకా మరిన్నింటి వంటి డేటాను కనుగొనడానికి అలాగే కాపీ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లు అనుమతి కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.
    • మీరు మీ Google ఖాతాకు థర్డ్-పార్టీ యాప్ యాక్సెస్‌ను ఉపసంహరిస్తే, వారు ఇకపై మీ డేటాను యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే వారి వద్ద ఉన్న డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయాల్సి రావచ్చు.
  • మీ Google ఖాతాలోని డేటాను మేనేజ్ చేయవచ్చు: మీ Google ఖాతాలోని డేటాను ఎడిట్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి, లేదా తొలగించడానికి థర్డ్-పార్టీ యాప్‌లు లేదా సర్వీస్‌లు అనుమతిని రిక్వెస్ట్ చేయవచ్చు.
    • ఉదాహరణకు:
      • ఏదైనా ఫిల్మ్ ఎడిటర్ యాప్ మీ వీడియోను ఎడిట్ చేసి, దాన్ని మీ YouTube ఛానెల్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.
      • ఏదైనా ఈవెంట్ ప్లానర్ యాప్ మీ Google Calendarలో ఈవెంట్‌లను క్రియేట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.

థర్డ్-పార్టీ యాప్ గురించి రిపోర్ట్ చేయండి

మీ Google ఖాతాకు యాక్సెస్ గురించి సాధారణ ప్రశ్నలు

నా Google ఖాతా డేటాకు ఏ థర్డ్-పార్టీ యాప్‌లు యాక్సెస్‌ను కలిగి ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది?
మీరు మీ Google ఖాతాకు ఏ యాప్‌లు అలాగే సర్వీస్‌లకు యాక్సెస్‌ను ప్రామాణీకరించారనేది మీ కనెక్షన్‌ల మేనేజ్‌మెంట్ పేజీలో చెక్ చేయవచ్చు.

చిట్కా: థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు సంబంధించిన యాక్సెస్‌ను రివ్యూ చేయడానికి లేదా మార్చడానికి, లిస్ట్ నుండి దాని పేరును ఎంచుకోండి.

మీ యాప్‌లను అలాగే సర్వీస్‌లను చూడండి

నేను నా Google ఖాతాకు థర్డ్-పార్టీ యాక్సెస్‌ను ఎలా తీసివేయాలి?

మీరు ఇకపై మీ Google ఖాతాకు థర్డ్-పార్టీ యాప్ యాక్సెస్ చేయకూడదనుకుంటే, మీరు వాటిని థర్డ్-పార్టీ కనెక్షన్‌ల నుండి తీసివేయవచ్చు.

  1. మీ Google ఖాతాకు మీరు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  2. థర్డ్-పార్టీ యాక్సెస్ ఉన్న యాప్‌లు అలాగే సర్వీస్‌లను చూడండి.
  3. మీరు కనెక్షన్‌ను తీసివేయాలనుకుంటున్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను లిస్ట్ నుండి ఎంచుకోండి.
  4. వివరాలను చూడండి ఆ తర్వాత యాక్సెస్‌ను తీసివేయండి ఆ తర్వాత నిర్ధారించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్ రకాలు ఉంటే, మీ థర్డ్-పార్టీ యాక్సెస్ కనెక్షన్ అనేది “మీ Google ఖాతాకు {App name} కొంత యాక్సెస్‌ను కలిగి ఉంది” అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది.

యాక్సెస్‌ను రివ్యూ చేయండి

నా Google డేటాలో థర్డ్-పార్టీ ఎంత మేరకు యాక్సెస్ చేయగలదు?

థర్డ్-పార్టీ యాప్‌లు మీరు వాటిని ప్రామాణీకరించిన డేటా అలాగే సర్వీస్‌లను మాత్రమే యాక్సెస్ చేయగలవు. Google మీ డేటాలో దేనినైనా థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో షేర్ చేసే ముందు, థర్డ్-పార్టీ యాక్సెస్ చేయాలనుకుంటున్న డేటా అలాగే సర్వీస్‌ల లిస్ట్‌ను మీరు కనుగొంటారు.

ఉదాహరణకు, మీరు మీ Google Calendar డేటాను మాత్రమే యాక్సెస్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌ను ప్రామాణీకరిస్తే, వారు ఆ డేటాను మాత్రమే యాక్సెస్ చేయగలరు, మీ Google Photos లేదా Contacts వంటి ఏదైనా మీ ఇతర Google డేటాను యాక్సెస్ చేయలేరు.

మీరు ఎప్పుడైనా మీ Google ఖాతాకు యాక్సెస్‌ను తీసివేయవచ్చు.

థర్డ్-పార్టీ నా Google ఖాతా డేటాను ఎడిట్ చేయగలదా?

మీరు ప్రాథమిక ఖాతా సమాచారం అలాగే మీ ఖాతా డేటాను చూడటం లేదా ఎడిట్ చేయడం వంటి మీ Google ఖాతాకు సంబంధించిన వివిధ స్థాయిల యాక్సెస్‌ను థర్డ్-పార్టీ యాప్‌లకు అందించవచ్చు. మీ Google ఖాతా డేటాను మేనేజ్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్ యాక్సెస్‌ను మీరు ప్రామాణీకరిస్తే, వారు మీ Google ఖాతాలోని డేటాను ఎడిట్ చేయగలరు, క్రియేట్ చేయగలరు, అలాగే తొలగించగలరు. మీరు మీ ఖాతాకు యాక్సెస్‌ను ప్రామాణీకరించినప్పుడు, థర్డ్-పార్టీ యాప్ రిక్వెస్ట్ చేసే యాక్సెస్ రకాన్ని, థర్డ్-పార్టీలు కలిగి ఉండే యాక్సెస్లో మీరు కనుగొనవచ్చు.

నేను నా Google పాస్‌వర్డ్‌ను యాక్సెస్ కోసం థర్డ్-పార్టీతో షేర్ చేయాలా?

మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌లో షేర్ చేయవద్దు. మీరు మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో షేర్ చేస్తే, వారు మీ ఖాతాకు పూర్తి యాక్సెస్‌ను కలిగి ఉంటారు అలాగే ఇది మీ ఖాతా సెక్యూరిటీకి హాని కలిగించవచ్చు.

బదులుగా, మీరు విశ్వసనీయ థర్డ్-పార్టీ యాప్‌లు అలాగే సర్వీస్‌లతో మీ Google ఖాతాకు సంబంధించిన కొంత యాక్సెస్‌ను షేర్ చేయవచ్చు, ఇది మరింత సురక్షితమైనది.

నేను నా Google ఖాతా నుండి లాగ్ అవుట్ చేయబడితే ఏమి చేయాలి?

థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు యాక్సెస్‌ను ప్రామాణీకరించడానికి, మీరు తప్పనిసరిగా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.

నాకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే ఏమి చేయాలి?

మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే, మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోమని లేదా కొనసాగించడానికి మరొక Google ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సిందిగా మీరు ప్రాంప్ట్ చేయబడతారు.

నేను నా Google ఖాతాను తొలగిస్తే ఏమి జరుగుతుంది?

మీరు మీ Google ఖాతాను తొలగిస్తే, అనుంబంధించబడిన అన్ని థర్డ్-పార్టీ కనెక్షన్‌లను కూడా మీరు తొలగిస్తారు. థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్, మీరు గతంలో వాటితో షేర్ చేసిన సమాచారాన్ని ఉంచుకోవచ్చు. థర్డ్-పార్టీ యాప్ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను తొలగించమని మీరు వారిని అడగవలసి రావచ్చు.

నేను నా థర్డ్-పార్టీ ఖాతాను తొలగిస్తే ఏమి జరుగుతుంది?

మీరు మీ థర్డ్-పార్టీ ఖాతాను తొలగిస్తే, అది మీ Google ఖాతాను ప్రభావితం చేయదు.

  • మీ డేటాను థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో షేర్ చేయడాన్ని ఆపివేయడానికి, వాటిని మీ కనెక్షన్‌ల మేనేజ్‌మెంట్ పేజీ నుండి తీసివేయండి. ఇది మీరు వాటికి గతంలో మంజూరు చేసిన ఏదైనా యాక్సెస్‌ను ఉపసంహరిస్తుంది.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
116050076201530816
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false