ముఖ్య గమనిక: లింక్ అయిన మీ యాప్ ఖాతా నుండి మీ Google ఖాతాతో ఏ డేటా షేర్ అవుతుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.
Google ఖాతాను లింక్ చేయడం వల్ల, లింక్ చేసిన యాప్‌లోని నిర్దిష్ట ఫీచర్లను మీ తరఫున యాక్సెస్ చేయడానికి Googleకు అనుమతి లభిస్తుంది. లింక్ చేసిన యాప్‌లను Google కాకుండా ఇతర కంపెనీలు లేదా డెవలపర్‌లు రూపొందిస్తారు.
ఉదాహరణకు, మీరు ఇలా చేయవచ్చు:
- స్ట్రీమింగ్ మ్యూజిక్ సర్వీస్‌లోని మీ ఖాతాను మీ Google ఖాతాకు లింక్ చేయండి, ఆపై పాటను ప్లే చేయమని లేదా పాడ్‌కాస్ట్‌ను కొనసాగించమని Googleను అడగండి.
- లైట్‌లు, థర్మోస్టాట్ వంటి వాటిని కంట్రోల్ చేయడానికి కనెక్ట్ చేసిన డివైజ్‌లకు మీ Google Homeను లింక్ చేయండి.
- మీ షోలను, సినిమాలను ఒకే చోట చూడటం కొనసాగించడానికి, సిఫార్సులను పొందడానికి, మీ మీడియా సర్వీస్‌లను Google TVతో లింక్ చేయండి.
Google కాకుండా ఇతర డెవలపర్‌ల యాప్‌లలో పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడటానికి కూడా మీరు Google AIని అనుమతించవచ్చు. ఉదాహరణకు, ఏదైనా మ్యూజిక్ యాప్‌లోని ప్లేలిస్ట్‌కు ఒక పాటను జోడించమని మీరు Google AIని అడగవచ్చు.
Google AIలో యాప్‌లను కనెక్ట్ చేయడం, మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
విశ్వసనీయమైన యాప్‌ను యాక్సెస్ చేయడానికి Googleకు అనుమతిని ఇవ్వాలంటే, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి. మీకు తప్పనిసరిగా ఆ యాప్‌లో కూడా ఒక ఖాతా ఉండాలి. ఒకవేళ మీరు ఈ యాప్‌ను యాక్సెస్ చేయడానికి 'Googleతో సైన్ ఇన్' ఫీచర్‌ను ఉపయోగిస్తుంటే, మీకు ఇప్పటికే ఆ యాప్‌లో ఖాతా ఉందని అర్థం.
'Googleతో సైన్ ఇన్' అనేది మీ Google ఖాతాతో వివిధ యాప్‌లలోకి సులభంగా, సురక్షితంగా సైన్ ఇన్ చేయడానికి వీలు కల్పించే మరొక ప్రత్యేక ఫీచర్. Google ఖాతా లింకింగ్ అనేది ఒక అదనపు ఫీచర్. ఇది మీ Google ప్రోడక్ట్‌లలో ఏదైనా యాప్ ఫీచర్‌లను ఉపయోగించడానికి వీలుగా, ఆ యాప్ నుండి మీ డేటాను Googleతో షేర్ చేయడానికి అనుమతిస్తుంది.
మీకు ఇప్పటికే ఖాతా లేకపోతే, యాప్‌నకు లింక్ చేస్తున్నప్పుడు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయమని లేదా యాప్‌తో ఖాతాను క్రియేట్ చేయమనే ప్రాంప్ట్‌ను మీరు అందుకోవచ్చు. 'Googleతో సైన్ ఇన్' గురించి మరింత తెలుసుకోండి.
మీ Google ఖాతాను ఎక్కడ లింక్ చేశారో తెలుసుకోండి
ముఖ్య గమనిక: మీ ఖాతాకు, ఏదైనా యాప్‌నకు మధ్య ఉన్న లింక్‌ను మీరు తొలగిస్తే, మీ Google ఖాతా ద్వారా ఆ యాప్‌లోని కొన్ని ఫీచర్‌లను ఉపయోగించే అవకాశం మీరు కోల్పోవచ్చు.
మీరు లింక్ చేసిన ఈ యాప్‌లను ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు. మీ Google ఖాతాకు, ఇతర డెవలపర్‌ల యాప్‌లకు మధ్య ఉన్న లింక్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.
లింక్ చేసిన ఖాతాలను రివ్యూ చేయండి
లింక్ చేసిన ఖాతాలను ఎలా మేనేజ్ చేయాలో లేదా ఎలా తొలగించాలో తెలుసుకోండి.
మీ Google ఖాతాను లింక్ చేయండి
ముఖ్య గమనిక:
- మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే, మీరు యాప్‌నకు లింక్ చేయాలనుకుంటున్న Google ఖాతాను ఉపయోగించేటట్లు చూసుకోండి.
- కొన్ని సందర్భాల్లో, మీరు Google ఖాతా లింకింగ్‌ను ఉపయోగించినప్పుడు, మీ Google ఖాతాకు సంబంధించిన కొంత పరిమిత డేటా లింక్ చేసిన యాప్‌తో షేర్ కావచ్చు. మీ ఖాతాలను లింక్ చేసే సమయంలో, ఈ డేటా షేరింగ్‌కు మీ సమ్మతి కోరడం జరుగుతుంది. మీరు సమ్మతిని ఇస్తే తప్ప, ఈ డేటా షేరింగ్ జరగదు. లింక్ చేసిన యాప్ ఫీచర్‌ను ఉపయోగించడానికి అవసరమైన డేటాను మాత్రమే ఆ యాప్ Googleతో షేర్ చేస్తుంది. ఏ డేటా షేర్ అవుతుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీరు Google Home లేదా Google Shopping వంటి Google ప్రోడక్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, Google కాకుండా వేరే డెవలపర్‌కు చెందిన యాప్‌ను లింక్ చేయమని మీకు ఒక ప్రాంప్ట్ రావచ్చు.
ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి:
- Google కాకుండా వేరే డెవలపర్‌కు చెందిన యాప్‌ను తెరిచి, సైన్ ఇన్ పేజీకి నావిగేట్ చేయండి.
- 'Googleతో సైన్ ఇన్'ను ఎంచుకోండి.
- అంగీకరించి, లింక్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
చిట్కా: వివిధ యాప్‌లను బట్టి ఈ ప్రాసెస్ అనేది మారవచ్చు.
యాప్ దీన్ని అనుమతించినప్పుడు, మీరు ఈ ప్రాసెస్‌ను Google ప్రోడక్ట్‌లోనే పూర్తి చేయవచ్చు.
కొన్ని యాప్‌లు నేరుగా తమ యాప్‌లోనే Googleకు లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
కొన్ని యాప్‌లు మీ Google ఖాతాను నేరుగా వాటి యాప్ నుండి లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మీ ఖాతాను లింక్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు:
- యాప్‌లో, మీరు లింక్ చేయాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి.
- మీ స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
చిట్కా: వివిధ యాప్‌లను బట్టి ఈ ప్రాసెస్ మారవచ్చు.