పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్-కీతో సైన్ ఇన్ చేయండి

పాస్-కీలు పాస్‌వర్డ్‌లకు సులభమైన, అలాగే సురక్షితమైన ప్రత్యామ్నాయం. పాస్-కీతో, మీరు మీ వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా PIN వంటి పరికర స్క్రీన్ లాక్‌తో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు.

పాస్-కీలు ఫిషింగ్ వంటి బెదిరింపుల నుండి బలమైన రక్షణను అందిస్తాయి. మీరు పాస్-కీని క్రియేట్ చేసిన తర్వాత, మీ Google ఖాతాకు, అదే విధంగా కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లకు, ఇంకా సర్వీస్‌లకు సులభంగా సైన్ ఇన్ చేయడానికి, అలాగే మీరు గోప్యమైన మార్పులు చేసినప్పుడు అది మీరేనని వెరిఫై చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

ముఖ్య గమనిక:

  • మీ ఖాతా 2-దశల వెరిఫికేషన్‌ను కలిగి ఉన్నట్లయితే లేదా అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ చేయబడి ఉంటే, పాస్-కీ మీ రెండవ ప్రామాణీకరణ దశను బైపాస్ చేస్తుంది, ఎందుకంటే ఈ పరికరం మీదేనని ఇది వెరిఫై చేస్తుంది.
  • వేలిముద్ర లేదా ఫేస్ అన్‌లాక్ కోసం ఉపయోగించే మీ బయోమెట్రిక్ డేటా మీ పరికరంలో ఉంటుంది, ఇది Googleతో ఎప్పటికీ షేర్ చేయబడదు.

మీరు పాస్-కీని క్రియేట్ చేయడానికి ఏమి అవసరమో చెక్ చేయండి

మీరు ఈ పరికరాలలో పాస్-కీలను క్రియేట్ చేయవచ్చు:

  • కనీసం Windows 10, macOS Ventura లేదా ChromeOS 109తో రన్ అయ్యే ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్
  • కనీసం iOS 16 లేదా Android 9తో రన్ అయ్యే మొబైల్ పరికరం
  • FIDO2 ప్రోటోకాల్‌ను సపోర్ట్ చేసే హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీ

మీ కంప్యూటర్ లేదా మొబైల్ పరికరానికి ఈ కింద పేర్కొన్న సపోర్ట్ చేసే బ్రౌజర్ కూడా అవసరం:

  • Chrome 109 లేదా అంతకంటే అధునాతన వెర్షన్
  • Safari 16 లేదా అంతకంటే అధునాతన వెర్షన్
  • EDGE 109 లేదా అంతకంటే అధునాతన వెర్షన్
  • FireFox 122 లేదా అంతకంటే అధునాతన వెర్షన్

పాస్-కీని క్రియేట్ చేయడానికి, అలాగే ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా కింది వాటిని ఎనేబుల్ చేయాలి:

  • స్క్రీన్ లాక్
  • బ్లూటూత్
    • మీరు మరొక కంప్యూటర్‌కు సైన్ ఇన్ చేయడానికి ఫోన్‌లో పాస్-కీని ఉపయోగించాలనుకుంటే ఇది వర్తిస్తుంది.
  • iOS లేదా macOS కోసం: మీరు తప్పనిసరిగా iCloud కీచైన్‌ను ఎనేబుల్ చేయాలి.
    • మీరు మీ Apple పరికరంలో పాస్-కీని సెటప్ చేసినప్పుడు, ఇది ఇప్పటికే సెటప్ చేయనట్లయితే మీ iCloud కీచైన్‌ను ఎనేబుల్ చేయమని మీకు ప్రాంప్ట్ చేస్తుంది. iCloud కీచైన్‌ను ఎలా సెటప్ చేయాలి అనే దానిపై మరింత సమాచారం కోసం, ఇక్కడకు వెళ్లండి.

చిట్కా: పాస్-కీలకు సంబంధించిన మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అందించడానికి, మీ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా బ్రౌజర్ అప్‌డేట్ అయ్యి ఉన్నాయని నిర్ధారించుకోండి.

మీ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా బ్రౌజర్ ఆధారంగా, మీరు అజ్ఞాత మోడ్‌లో ఉన్నప్పుడు పాస్-కీలను క్రియేట్ చేయలేరు లేదా ఉపయోగించలేరు.

Google Workspace కోసం పాస్-కీలు

మీరు మీ స్కూల్ లేదా ఉపాధి సంస్థ ద్వారా Google Workspace ఖాతాను కలిగి ఉన్నట్లయితే, మీరు కేవలం పాస్-కీతో మీ ఖాతాకు సైన్ ఇన్ చేయలేకపోవచ్చు. మీరు ఇప్పటికీ మీ పరికరాలలో పాస్-కీలను క్రియేట్ చేయవచ్చు, కానీ అవి 2-దశల వెరిఫికేషన్‌లోని, ఖాతా రికవరీలోని, అలాగే Google మీ గుర్తింపును మళ్లీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్న మీ ఖాతాలోని కొన్ని గోప్యమైన చర్యల కోసం మాత్రమే రెండవ దశ ప్రామాణీకరణగా ఉపయోగించబడతాయి.

"సాధ్యమైనప్పుడు పాస్‌వర్డ్‌ను స్కిప్ చేయండి" ఖాతా సెట్టింగ్‌ల పేజీలో, కేవలం పాస్-కీతో సైన్ ఇన్ చేయడానికి మీ అడ్మిన్ మిమ్మల్ని అనుమతిస్తారో లేదో మీరు కనుగొనవచ్చు.

Workspace అడ్మిన్‌లు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

పాస్-కీలను సెటప్ చేయండి

ముఖ్య గమనిక: మీరు పాస్-కీని క్రియేట్ చేసినప్పుడు, మీరు పాస్-కీ-ఫస్ట్, పాస్‌వర్డ్-రహిత సైన్-ఇన్ ఎక్స్‌పీరియన్స్ కోసం సమ్మతిని తెలియజేస్తారు. మీరు కంట్రోల్ చేసే వ్యక్తిగత పరికరాలలో మాత్రమే పాస్-కీలను క్రియేట్ చేయండి. మీరు మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేసినప్పటికీ, మీరు పరికరంలో పాస్-కీని క్రియేట్ చేసిన తర్వాత, పరికరాన్ని అన్‌లాక్ చేయగల ఎవరైనా పాస్-కీతో మీ Google ఖాతాకు తిరిగి సైన్ ఇన్ చేయవచ్చు.

పాస్-కీని సెటప్ చేయడానికి, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు లేదా ఇది నిజంగా మీరేనని వెరిఫై చేయాల్సి రావచ్చు.

పాస్-కీని క్రియేట్ చేయండి
మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లేదా కంప్యూటర్‌లో పాస్-కీని క్రియేట్ చేయడానికి:
  1. https://myaccount.google.com/signinoptions/passkeys లింక్‌కు వెళ్లండి.
  2. పాస్-కీని క్రియేట్ చేయండి ఆ తర్వాత కొనసాగించండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
    • మీరు మీ పరికరాన్ని అన్‌లాక్ చేయాల్సి రావచ్చు.

పలు పరికరాలలో పాస్-కీలను క్రియేట్ చేయడానికి, ఆ పరికరాలలో ఈ దశలను రిపీట్ చేయండి.

మీరు బాహ్య FIDO2 సామర్థ్యం గల USB సెక్యూరిటీ కీలో కూడా పాస్-కీని క్రియేట్ చేయడానికి.

  1. https://myaccount.google.com/signinoptions/passkeys లింక్‌కు వెళ్లండి.
  2. పాస్-కీని క్రియేట్ చేయండి ఆ తర్వాత మరొక పరికరాన్ని ఉపయోగించండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
    • మీరు మీ హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీని ఇన్‌సర్ట్ చేసి, దాని PINను ఎంటర్ చేయాలి లేదా కీపై వేలిముద్ర సెన్సార్‌ను తాకాల్సి ఉంటుంది.

చిట్కాలు:

  • మీరు మీ మొదటి పాస్-కీని క్రియేట్ చేసిన తర్వాత, పాస్-కీలను సపోర్ట్ చేసే ఏదైనా పరికరంలో మీరు తదుపరిసారి సైన్ ఇన్ చేసినప్పుడు, ఆ పరికరంలో పాస్-కీని క్రియేట్ చేయమని మీకు ప్రాంప్ట్ అందుతుంది.
  • ఇతర యూజర్‌లు మీ ఖాతాను యాక్సెస్ చేయకూడదనుకుంటే, షేర్ చేసిన పరికరంలో పాస్-కీని క్రియేట్ చేయవద్దు.

సైన్ ఇన్ చేయడానికి మీ పాస్-కీని ఉపయోగించండి

మీరు ఇప్పటికే పాస్-కీని క్రియేట్ చేసిన పరికరంలో మీ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి:

మీరు Android పరికరం నుండి సైన్ అవుట్ చేసినప్పుడు, మీరు ప్రత్యామ్నాయ పద్ధతితో తిరిగి సైన్ ఇన్ చేయాలి. మీరు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు మీ గుర్తింపును మళ్లీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్న ఏవైనా గోప్యమైన చర్యలను అమలు చేసినట్లయితే, మీరు పాస్-కీని Android పరికరంలోనే ఉపయోగించవచ్చు.

ఇతర Android-యేతర పరికరాలలో, మీరు మీ ఖాతాలోకి తిరిగి సైన్ ఇన్ చేయడానికి అలాగే మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు మీ గుర్తింపును మళ్లీ వెరిఫై చేయడానికి మీ పాస్-కీని ఉపయోగించవచ్చు.

  1. మీ పరికరంలోని Google సైన్-ఇన్ పేజీలో, మీ యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
  2. మీరు మునుపు ఆ పరికరంలో మీ ఖాతా కోసం పాస్-కీని క్రియేట్ చేసినట్లయితే, ఆ పరికరానికి చెందిన పాస్-కీతో మీ గుర్తింపును వెరిఫై చేయమని Google మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
    • పరికరాన్ని అన్‌లాక్ చేయడానికి, మీ గుర్తింపును వెరిఫై చేయడానికి స్క్రీన్‌పై పాస్-కీ సూచనలను ఫాలో అవ్వండి.
      • మీ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే బ్రౌజర్ ఆధారంగా ఖచ్చితమైన UI మారుతుంది.
    • కొన్ని అరుదైన సందర్భాలలో, మీ పరికరంలో పాస్-కీ ఉన్నప్పటికీ మిమ్మల్ని మీ పాస్‌వర్డ్ కోసం అడగవచ్చు.
      • మీ పాస్-కీ కోసం ప్రాంప్ట్‌ను ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేయడానికి, మీరు "మరో మార్గంలో ట్రై చేయండి" ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు.
కంప్యూటర్‌లో మీ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి, మీరు మొబైల్ పరికరంలో క్రియేట్ చేయబడిన పాస్-కీని ఉపయోగించవచ్చు:
మీ Android లేదా iOS మొబైల్ పరికరంలో పాస్-కీ ఉన్నట్లయితే, మీరు వేరే మొబైల్ పరికరం లేదా కంప్యూటర్‌కు సైన్ ఇన్ చేయడానికి ఆ పాస్-కీని ఉపయోగించవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లోని Google సైన్-ఇన్ పేజీలో, మీ యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
  2. పాస్‌వర్డ్ ఫీల్డ్ కింద, మరో మార్గంలో ట్రై చేయండి లింక్‌ను క్లిక్ చేయండి.
  3. మీ పాస్-కీని ఉపయోగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ స్క్రీన్‌పై, QR కోడ్‌ను కనుగొనండి.
    • మీరు హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీపై క్రియేట్ చేసిన పాస్-కీని ఉపయోగించాలనుకుంటే, "USB సెక్యూరిటీ కీ" లేదా ఇతర సమానమైన దాన్ని ఎంచుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది.
  5. QR కోడ్‌ను స్కాన్ చేయడానికి, మీ ఫోన్‌లో బిల్ట్-ఇన్ QR కోడ్ స్కానర్ యాప్‌ను ఉపయోగించండి.
    • iOS కోసం: మీరు బిల్ట్-ఇన్ కెమెరా యాప్‌ను ఉపయోగించండి.
    • Google Pixel ఫోన్‌ల కోసం: మీరు బిల్ట్-ఇన్ QR కోడ్ స్కానర్‌ను ఉపయోగించవచ్చు.
    • ఇతర Android పరికరాల కోసం: మీరు స్థానిక కెమెరా యాప్ లేదా సిస్టమ్ QR కోడ్ స్కానర్‌తో QR కోడ్‌ను స్కాన్ చేయలేకపోతే, మీరు Google Lensను ఉపయోగించవచ్చు.
  6. మీ ఫోన్‌లో, పాస్-కీని ఉపయోగించండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ ఫోన్‌లో మీ గుర్తింపును వెరిఫై చేయడానికి, మీకు మీ వేలిముద్ర, ఫేస్ అన్‌లాక్ లేదా ఫోన్ PIN కోసం ప్రాంప్ట్ అందుతుంది.
    • మీరు ఈ కంప్యూటర్, ఇంకా ఫోన్ కలయికతో తదుపరిసారి సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు మీ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి నోటిఫికేషన్‌ను పొందుతారు.

చిట్కా: మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత, కంప్యూటర్‌లో పాస్-కీని క్రియేట్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. ఇతర యూజర్‌లు మీ ఖాతాను యాక్సెస్ చేయకూడదనుకుంటే, షేర్ చేసిన పరికరంలో పాస్-కీని క్రియేట్ చేయవద్దు.

మీ పాస్-కీలను చెక్ చేయండి

  1. https://myaccount.google.com/signinoptions/passkeys లింక్‌కు వెళ్లండి.
  2. మీ గుర్తింపును వెరిఫై చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
    • చిట్కా: మీరు పలు ఖాతాలకు సైన్ ఇన్ చేసినట్లయితే, మీరు కోరుకున్న ఖాతా కోసం మీ గుర్తింపును వెరిఫై చేస్తున్నారని నిర్ధారించుకోండి.

మీ ఖాతాలో ఇప్పటికే పాస్-కీలు ఉంటే, అవి ఇక్కడ లిస్ట్ చేయబడతాయి.

  • చిట్కా: మీ దగ్గర ఈ ఖాతాతో సైన్ ఇన్ చేసిన Android ఫోన్ ఉంటే, దానిలో మీ కోసం ఆటోమేటిక్‌గా నమోదు చేయబడిన పాస్-కీలు ఉండవచ్చు.

పాస్-కీలను తీసివేయండి లేదా సమ్మతిని నిలిపివేయండి

పాస్-కీను తీసివేయండి
మీరు పాస్-కీని క్రియేట్ చేసిన పరికరాన్ని పోగొట్టుకున్నా లేదా షేర్ చేసిన పరికరంలో పొరపాటున పాస్-కీను క్రియేట్ చేసినా, మీరు మీ Google ఖాతాను ఉపయోగించి పాస్-కీ ఉపయోగాన్ని చెల్లుబాటు కాకుండా చేయాలి.

మీరు క్రియేట్ చేసిన పాస్-కీను తీసివేయడం

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
    • మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. సెక్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. "మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు," కింద, పాస్-కీలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న పాస్-కీని ఎంచుకోండి.
  5. చిహ్నాన్ని ట్యాప్ చేయండి.

Android ద్వారా ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయబడిన పాస్-కీని తీసివేయండి

మీ Android పరికరంలో ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయబడిన పాస్-కీను తీసివేయడానికి, మీరు మీ Google ఖాతా నుండి పరికరాన్ని తీసివేయాలి.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. మీ పరికరాల ప్యానెల్‌లో, అన్ని పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. పరికరం and then సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. ఒకే పరికరం పేరుతో పలు సెషన్‌లు కనిపిస్తే, అవి ఒకే పరికరం లేదా పలు పరికరాల నుండి వచ్చి ఉండవచ్చు. పరికరం నుండి ఖాతా యాక్సెస్ లేదని మీరు నిర్ధారించుకోవాలనుకుంటే, ఈ పరికరం పేరుతో ఉన్న సెషన్‌లన్నింటి నుండి సైన్ అవుట్ చేయండి.

చిట్కా: మీ ఖాతాకు యాక్సెస్ ఉన్న పరికరాలు అన్నింటినీ రివ్యూ చేయడానికి మీరు google.com/devicesను చెక్ చేయవచ్చు.

పాస్-కీలతో సైన్ ఇన్ చేయడానికి సమ్మతిని నిలిపివేయండి
మీరు పాస్-కీ సైన్-ఇన్ సమ్మతిని నిలిపివేసినప్పుడు, మీరు ఇప్పటికీ మీ ఖాతాలో అన్ని పాస్-కీల నిల్వను కొనసాగిస్తారు. అన్ని భవిష్యత్ సైన్-ఇన్‌లకు మీ పాస్‌వర్డ్, అలాగే కాన్ఫిగరేషన్ ఆధారంగా ఆప్షనల్ 2-దశల వెరిఫికేషన్ అవసరం.
సైన్-ఇన్ పద్ధతిగా పాస్-కీల నుండి సమ్మతిని నిలిపివేయడానికి, అలాగే మీ మునుపటి సైన్-ఇన్ పద్ధతికి తిరిగి వెళ్లడానికి, మీ ఖాతా సెట్టింగ్‌లలో ఈ ప్రాధాన్యతను మార్చండి.
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
    • మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. సెక్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. సాధ్యమైనప్పుడు పాస్‌వర్డ్‌ను స్కిప్ చేయండి ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.

చిట్కా: మీరు మొదట పాస్-కీని క్రియేట్ చేసినప్పుడు, మీరు పాస్-కీ-ఫస్ట్, పాస్‌వర్డ్-రహిత, సైన్-ఇన్ ఎక్స్‌పీరియన్స్ కోసం సమ్మతిని తెలియజేస్తారు. పాస్-కీ లేకుండా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి, అలాగే మరొక సైన్-ఇన్ పద్ధతిని ఉపయోగించడానికి, మరొక మార్గాన్ని ట్రై చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు తరచుగా "మరొక మార్గంలో ట్రై చేయండి" ఎంచుకుంటే, Google మీ సూచించిన ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా పాస్-కీ ఛాలెంజ్‌ను భవిష్యత్తులో తక్కువ తరచుగా అందిస్తుంది. మీరు పాస్-కీలతో తరచుగా సైన్ ఇన్ చేయడం ద్వారా దీన్ని మార్చవచ్చు.

పోయిన లేదా మిస్ అయిన 'పాస్-కీ'కి సంబంధించిన సమస్యను పరిష్కరించండి

పోయిన లేదా దొంగలించబడిన పరికరం
  1. మీరు యాక్సెస్ చేయగల పరికరంలో, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన పరికరంతో అనుబంధించబడిన పాస్-కీను తీసివేయండి.
మిస్ అయిన లేదా అందుబాటులో లేని పాస్-కీ

మీరు మీ ఖాతాలో పాస్-కీలను కలిగి ఉండి, సైన్-ఇన్ సమయంలో పాస్-కీ ఆఫర్ చేయబడకపోతే, వీటిని నిర్ధారించుకోండి:

  • పాస్-కీ ఉన్న పరికరంలో స్క్రీన్ లాక్ ఎనేబుల్ చేయబడి ఉంది
    • మీ పరికరం స్క్రీన్ లాక్ డిజేబుల్ చేయబడితే, మీరు మళ్లీ స్క్రీన్ లాక్‌ను ఎనేబుల్ చేసే వరకు ఆ పరికరంలో పాస్-కీని ఉపయోగించలేరు.
  • myaccount.google.com/security లింక్‌లో మీ సెక్యూరిటీ సెట్టింగ్‌లలో "సాధ్యమైనప్పుడు పాస్‌వర్డ్‌ను స్కిప్ చేయండి" టోగుల్ ఆన్‌లో ఉంది.


పాస్-కీ లేకుండా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి, పాస్-కీ ఛాలెంజ్‌ను స్కిప్ చేసి, మీ మునుపటి సైన్ ఇన్ ఎంపికలకు తిరిగి వెళ్లడానికి మరొక మార్గాన్ని ట్రై చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు తరచుగా "మరొక మార్గంలో ట్రై చేయండి" ఎంచుకుంటే, Google మీ సూచించిన ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా పాస్-కీ ఛాలెంజ్‌ను భవిష్యత్తులో తక్కువ తరచుగా అందిస్తుంది. మీరు పాస్-కీలతో తరచుగా సైన్ ఇన్ చేయడం ద్వారా దీన్ని మార్చవచ్చు.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5212826087508150569
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false