మీ Google ఖాతాకు, థర్డ్-పార్టీలకు మధ్య కనెక్షన్‌లను మేనేజ్ చేయండి

సహాయకరమైన ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి, మీ Google ఖాతాకు, ఇంకా థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లకు మధ్య డేటాను మీరు షేర్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: Googleకు చెందని కంపెనీలను లేదా డెవలపర్‌లను థర్డ్-పార్టీలు అంటారు. మీరు విశ్వసించే థర్డ్-పార్టీలతో మాత్రమే మీ డేటాను షేర్ చేయండి. మీ అనుమతి లేకుండా Google కనెక్షన్‌లను సెటప్ చేయదు.

థర్డ్-పార్టీ కనెక్షన్‌ల గురించి తెలుసుకోండి

ప్రస్తుతం ఉన్న మీ థర్డ్-పార్టీ కనెక్షన్‌లన్నింటినీ రివ్యూ చేయడానికి:

  1. మీ Google ఖాతాకు చెందిన థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
  2. లిస్ట్‌లో యాప్ లేదా సర్వీస్‌ను కనుగొనండి.
  3. మీరు ఏ యాప్ లేదా ఏ సర్వీస్‌కు సంబంధించిన కనెక్షన్‌లను అయితే రివ్యూ చేయాలనుకుంటున్నారో, ఆ యాప్ లేదా సర్వీస్‌ను ఎంచుకోండి.

చిట్కా: Google Password Managerలో 'సేవ్ చేసిన పాస్‌వర్డ్' ఉన్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను మీరు ఎంచుకుంటే, ఆ పేజీ, లింక్‌ను డిస్‌ప్లే చేస్తుంది. మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడం, మేనేజ్ చేయడం, ఇంకా సురక్షితంగా ఉంచడం ఎలాగో తెలుసుకోండి.

థర్డ్-పార్టీ కనెక్షన్‌లను మేనేజ్ చేయండి

Googleతో సైన్ ఇన్

థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లలోకి సైన్ ఇన్ చేయడం కోసం మీ Google ఖాతాను ఉపయోగించడానికి, 'Googleతో సైన్ ఇన్'ను ఉపయోగించండి. కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండానే, మీరు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో, అలాగే బ్రౌజర్‌లలో సైన్ ఇన్ చేయవచ్చు.

ఈ కనెక్షన్‌లను రివ్యూ చేయండి, మేనేజ్ చేయండి

ఏదైనా యాప్ లేదా సర్వీస్ విషయంలో, 'Googleతో సైన్ ఇన్'ను ఉపయోగించడం ఆపివేయడానికి:

ముఖ్య గమనిక: మీరు ఈ కనెక్షన్‌ను తొలగిస్తే, యాప్ లేదా సర్వీస్‌కు Google ఆటోమేటిక్ సైన్-ఇన్‌ను నిలిపివేస్తుంది. ఈ చర్య, థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను తొలగించదు.

  1. మీ Google ఖాతాకు చెందిన థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
  2. Googleతో సైన్ ఇన్‌ను ఎంచుకోండి.
  3. మీరు కనెక్షన్ తీసివేయాలనుకుంటున్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను ఎంచుకోండి ఆ తర్వాత వివరాలను చూడండిని ఎంచుకోండి.
    • చిట్కా: ఆ యాప్ లేదా సర్వీస్‌తో మీకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్‌లు ఉంటే, మీ 'Googleతో సైన్ ఇన్' కనెక్షన్ "{యాప్ పేరు}‌లోకి సైన్ ఇన్ చేయడానికి మీకు Google ఎలా సహాయపడుతుంది" అనే దాని కింద కనిపిస్తుంది.
  4. 'Googleతో సైన్ ఇన్'ను ఉపయోగించడం ఆపివేయండి ఆ తర్వాత నిర్ధారించండిని ఎంచుకోండి.

'Googleతో సైన్ ఇన్' గురించి మరింత తెలుసుకోండి.

డేటాను సురక్షితంగా షేర్ చేయడంలో 'Googleతో సైన్ ఇన్' మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.

మీ Google ఖాతాను లింక్ చేయండి
మెరుగైన, ఇంకా వ్యక్తిగతీకరించబడిన ఎక్స్‌పీరియన్స్‌లను అందించడానికి మీ Google ఖాతాను మీ థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో మీరు లింక్ చేయవచ్చు.

ఉదాహరణకు, మీ Google ఖాతాకు మీరు ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ను లింక్ చేయవచ్చు, తద్వారా ఆ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ నుండి ఏదైనా పాటను ప్లే చేయమని మీరు Google Assistantను అడగవచ్చు.

ఈ కనెక్షన్‌లను రివ్యూ చేయండి, మేనేజ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు ఈ కనెక్షన్‌ను తొలగిస్తే, మీ థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ ఖాతాకు Google యాక్సెస్ కోల్పోతుంది. మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్న ఏ పరికరంలో అయినా, ఏ ఫీచర్‌లకు అయితే ఈ కనెక్షన్ అవసరమో, ఆ ఫీచర్‌లను మీరు యాక్సెస్ చేయలేరు.

ఏదైనా థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు, Googleకు ఉన్న యాక్సెస్‌ను తీసివేయడానికి:

  1. మీ Google ఖాతాకు చెందిన థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
  2. లింక్ చేసిన ఖాతా‌ను ఎంచుకోండి.
  3. మీరు కనెక్షన్‌ను తొలగించాలనుకుంటున్న థర్డ్-పార్టీ యాప్‌ను లేదా సర్వీస్‌ను ఎంచుకోండి.
    • చిట్కా: ఆ యాప్ లేదా సర్వీస్‌తో మీకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్‌లు ఉంటే, "మీ {యాప్ పేరు} ఖాతా విషయంలో Googleకు కొంత యాక్సెస్ ఉంది" అనే దాని కింద ఈ కనెక్షన్ కనిపిస్తుంది.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న థర్డ్-పార్టీ ఖాతాకు పక్కన కనెక్షన్‌ను తొలగించండి ఆ తర్వాత నిర్ధారించండిని ఎంచుకోండి.

చిట్కా: మీరు కనెక్షన్‌ను తొలగించే ముందు, థర్డ్-పార్టీ Googleతో ఎలాంటి సమాచారాన్ని షేర్ చేస్తుందో తెలుసుకోవడానికి, వారి గోప్యతా పాలసీని చదవండి.

Googleతో సమాచారాన్ని షేర్ చేసుకొనే థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌ల గురించి మరింత తెలుసుకోండి.
థర్డ్-పార్టీతో మీ Google ఖాతాకు యాక్సెస్‌ను షేర్ చేయండి

మీ Google ఖాతా విషయంలో, మీరు థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లకు కొంత యాక్సెస్‌ను ఇవ్వవచ్చు.

ఉదాహరణకు, ఒక ఫిట్‌నెస్ యాప్, మీరు దాని ద్వారా సైన్ అప్ చేసిన క్లాస్‌లను డిస్‌ప్లే చేయడానికి మీ Google Calendarకు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీ Google ఖాతాకు యాక్సెస్‌ను ఏదైనా థర్డ్-పార్టీకి ఇచ్చే ముందు, ఆ థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ మీ డేటాను ఎలా ఉపయోగిస్తుంది, దాన్ని సురక్షితంగా ఎలా ఉంచుతుంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి, ఆ యాప్ లేదా సర్వీస్‌కు సంబంధించిన గోప్యతా పాలసీని, ఇంకా సెక్యూరిటీ సంబంధిత బహిర్గత ప్రకటనలను చదవండి.

ఈ కనెక్షన్‌లను రివ్యూ చేయండి, మేనేజ్ చేయండి

థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ వేటిని యాక్సెస్ చేయవచ్చు అనే దాన్ని రివ్యూ చేయడానికి లేదా తీసివేయడానికి:

ముఖ్య గమనిక: మీరు యాక్సెస్‌ను తీసివేస్తే, ఆ థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ మీ Google ఖాతాను యాక్సెస్ చేయలేదు. దీని వలన కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు.

  1. మీ Google ఖాతాకు చెందిన థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
  2. మీ Google ఖాతాకు యాక్సెస్ గలవిని ఎంచుకోండి.
  3. మీరు రివ్యూ చేయాలనుకుంటున్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను ఎంచుకోండి.
    • మీ Google ఖాతాకు నిర్దిష్ట యాక్సెస్ గల థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌ల కోసం ఫిల్టర్ చేయడానికి, వీటికి యాక్సెస్ ఉన్నవిని ఎంచుకుని, ఏదైనా Google ప్రోడక్ట్‌ను ఎంచుకోండి, లేదా ఇతర యాక్సెస్‌ను ఎంచుకోండి.
  4. వివరాలను చూడండిని ఎంచుకోండి.
    • చిట్కా: ఆ యాప్ లేదా సర్వీస్‌తో మీకు ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్‌లు ఉంటే, "మీ Google ఖాతా విషయంలో {యాప్ పేరు}‌కు కొంత యాక్సెస్ ఉంది" అనే దాని కింద ఈ కనెక్షన్ కనిపిస్తుంది.
  5. మీ Google ఖాతాకు థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు ఉన్న యాక్సెస్‌ను రివ్యూ చేయండి.
  6. యాప్ లేదా సర్వీస్‌కు ఉన్న యాక్సెస్‌ను మీరు తీసివేయాలనుకుంటే, యాక్సెస్‌ను తీసివేయండి ఆ తర్వాత నిర్ధారించండిని ఎంచుకోండి.

థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌పై రిపోర్ట్ చేయండి

థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ మీ డేటాను దుర్వినియోగం చేస్తోందని మీకు అనిపిస్తే:

  1. మీ Google ఖాతాకు చెందిన థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
  2. మీ Google ఖాతాకు యాక్సెస్ గలవిని ఎంచుకోండి.
  3. మీరు రివ్యూ చేయాలనుకుంటున్న థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను ఎంచుకోండి.
  4. వివరాలను చూడండిని ఎంచుకోండి.
  5. పేజీకి దిగువున, ఈ యాప్‌పై రిపోర్ట్ చేయండిని ఎంచుకోండి.
  6. ఫారమ్‌ను పూరించి, సమర్పించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీ Google ఖాతాకు యాక్సెస్ గల థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌ల గురించి మరింత తెలుసుకోండి.

మీ డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో Google ఎలా సహాయపడుతుంది

  • మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను ఏ థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో కూడా Google షేర్ చేయదు.
  • మీ Google ఖాతా నుండి థర్డ్-పార్టీకి, ఏ డేటా రకాన్ని అయితే షేర్ చేయడానికి మీరు సమ్మతించారో, ఆ డేటా రకాన్ని మీరు రివ్యూ చేయవచ్చు.
  • మీ Google ఖాతాకు థర్డ్-పార్టీకి ఉన్న యాక్సెస్‌ను మీరు ఏ సమయంలోనైనా తీసివేయవచ్చు.

ముఖ్య గమనిక: మీ Google ఖాతాకు, అలాగే థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు మధ్య ఉండే కనెక్షన్‌ను మీరు తొలగిస్తే, ఆ యాప్ లేదా సర్వీస్‌తో మీరు ఇప్పటికే షేర్ చేసిన డేటాను అవి అలాగే ఉంచుకోవచ్చు. థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో షేర్ చేయబడిన డేటాను తొలగించడానికి, సంబంధిత వివరాల కోసం ఆ యాప్ లేదా సర్వీస్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌కు వెళ్లండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
370895698202207241
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false