మీ Google ఖాతాలోని మీ అడ్రస్‌లను మేనేజ్ చేయండి

మీ Google ఖాతాలోని వివిధ రకాల అడ్రస్‌ల గురించి, అలాగే వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్

Google ప్రోడక్ట్‌లలో మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మీరు మీ Google ఖాతా, ఆఫీస్ అడ్రస్‌లను ఉపయోగించవచ్చు.

మరింత సందర్భోచిత ఫలితాలను పొందడానికి, నావిగేషన్ దిశలను మరింత క్విక్‌గా పొందడానికి, మీ Google ఖాతా కోసం ఇంటి, ఆఫీస్ అడ్రస్‌ను సెట్ చేయండి.

Google అంతటా మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మేము మీ అడ్రస్‌లను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మేము కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:

  • మీ ఇంటికి సమీపంలో ఉన్న వాటికి సంబంధించిన సెర్చ్ ఫలితాలను చూపవచ్చు.
  • ఆఫీస్‌కు సంబంధించిన దిశలను పొందవచ్చు.
  • మరింత సందర్భోచిత యాడ్‌లను చూపవచ్చు.

మీరు మీ Google ఖాతాలో ఎప్పుడైనా మీ అడ్రస్‌లను తీసివేయవచ్చు.

మీ ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ను జోడించండి లేదా మార్చండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ పరికర సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "అడ్రస్‌ల" కింద, ఇల్లు లేదా ఆఫీస్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
  5. సేవ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు. మీరు మీ Google ఖాతాలో అడ్రస్‌ను పబ్లిక్ చేయాలనుకుంటే, మీరు దాన్ని ప్రొఫైల్ అడ్రస్‌గా జోడించవచ్చు.

మీ ఇంటి అడ్రస్‌ను మేనేజ్ చేయండి

మీ ఆఫీస్ అడ్రస్‌ను మేనేజ్ చేయండి

మీ ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ను తీసివేయండి

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, మీ పరికర సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆ తర్వాత వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. "అడ్రస్‌లు" అనే విభాగంలో, ఇల్లు లేదా ఆఫీస్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. తీసివేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇంటికి లేదా ఆఫీస్‌కు సంబంధించిన దిశలను పిన్ చేయండి

Google Mapsలోని "దీనికి వెళ్లండి" ట్యాబ్‌లో, మీరు మీ పిన్ చేసిన ట్రిప్‌లను వాటి ETA, అలాగే ట్రాఫిక్ సమాచారంతో చూడవచ్చు. మీకు ఇష్టమైన ట్రిప్‌ల గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్ కోసం సెర్చ్ చేయండి.
  3. దిశలు Directions ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ ప్రయాణ మోడ్‌ను ఎంపిక చేయండి.
  5. ఇల్లు లేదా ఆఫీస్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. కింద, పిన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇల్లు లేదా ఆఫీస్ కోసం ఒక చిహ్నాన్ని ఎంపిక చేసుకోండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Maps యాప్‌ను Maps తెరవండి.
  2. సేవ్ చేసినవి Save place ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. "మీ లిస్ట్‌లు" అనే విభాగంలో, లేబుల్ చేసినవి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "ఇల్లు" లేదా "ఆఫీస్" పక్కన, మరిన్ని ఆ తర్వాత చిహ్నాన్ని మార్చండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ ఇల్లు లేదా ఆఫీస్ కోసం ఒక చిహ్నాన్ని ఎంచుకోండి.
  6. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇతర అడ్రస్‌లు

మీరు Google సర్వీస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీ Google ఖాతాకు జోడించబడిన అడ్రస్‌లను మీరు కనుగొనవచ్చు, వాటిని మేనేజ్ చేయవచ్చు.

దిగువ మీ Google ఖాతాలోని ఇతర అడ్రస్‌ల గురించి మరింత సమాచారాన్ని కనుగొనండి.

మీ Google ఖాతాకు అడ్రస్‌లు ఎలా జోడించబడతాయి

మీరు Google సర్వీస్ ద్వారా అడ్రస్‌ను జోడించినప్పుడు, మీరు దానిని మీ Google ఖాతాలో కనుగొనవచ్చు, మేనేజ్ చేయవచ్చు.

మీ అడ్రస్‌లను ఉపయోగించండి

మీరు కింద పేర్కొన్న పనులు చేయడానికి మీ Google ఖాతాలోని అడ్రస్‌లను ఉపయోగించవచ్చు:

  • మీరు Chromeను ఉపయోగిస్తున్నప్పుడు అడ్రస్ ఫారమ్‌లను ఆటోఫిల్ చేయడానికి.
  • Google Play Store నుండి ఏదైనా కొనుగోలు చేయడానికి.
  • Google సబ్‌స్క్రిప్షన్ కోసం పే చేయడానికి.
  • Google Payతో కొనుగోలు చేయడం కోసం ఉపయోగించడానికి.

ప్రొఫైల్ అడ్రస్‌లు

ప్రొఫైల్ అడ్రస్ అనేది మీకు సంబంధించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొఫైల్స్‌తో అనుబంధించబడిన అడ్రస్. కొన్ని Google యాప్‌లలో, సర్వీస్‌లలో, మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది ఆ సర్వీస్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులకు కనిపిస్తుంది. Google యాప్‌లలో, సర్వీస్‌లలో ఎవరైనా మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు లేదా మీరు క్రియేట్ చేసే కంటెంట్‌ను చెక్ చేసినప్పుడు ఈ సమాచారాన్ని కనుగొనవచ్చు.

చిట్కా: Google సర్వీస్‌లలో ప్రొఫైల్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, Google సర్వీస్‌లలో ప్రొఫైల్స్‌ను చూడండి, మేనేజ్ చేయండి అనే లింక్‌కు వెళ్లండి.

బిల్లింగ్ అడ్రస్‌లు

బిల్లింగ్ అడ్రస్ అనేది మీ పేమెంట్ ఆప్షన్‌తో అనుబంధించబడిన అడ్రస్.

చిట్కా: మీ బిల్లింగ్ అడ్రస్‌లను మేనేజ్ చేయడానికి, మీ ఇంటి లేదా బిల్లింగ్ అడ్రస్‌ను మార్చండి అనే లింక్‌కు వెళ్లండి.

చట్టపరమైన అడ్రస్

మీ చట్టపరమైన అడ్రస్ అనేది మీ Google పేమెంట్స్ ప్రొఫైల్‌తో అనుబంధించబడిన అడ్రస్.

చిట్కా: మీ చట్టపరమైన అడ్రస్‌లను మేనేజ్ చేయడానికి, మీ ఇంటి లేదా బిల్లింగ్ అడ్రస్‌ను మార్చండి అనే లింక్‌కు వెళ్లండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13269715348155502114
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false