మీ Google ఖాతాలోని వివిధ రకాల అడ్రస్‌ల గురించి, అలాగే వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
ఇంటి అడ్రస్, ఆఫీస్ అడ్రస్
Google ప్రోడక్ట్‌లు అంతటిలో మీ ఎక్స్‌పీరియన్స్‌ను వ్యక్తిగతీకరించడానికి, మీ Google ఖాతాకు ఇల్లు, అలాగే ఆఫీస్ అడ్రస్‌ను సెట్ చేయండి. ఉదాహరణకు, మేము కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:
- మీ ఇంటికి సమీపంలో ఉన్న వాటికి సంబంధించిన సెర్చ్ ఫలితాలను చూపవచ్చు.
- ఆఫీస్‌కు సంబంధించిన దిశలను పొందవచ్చు.
- మరింత సందర్భోచిత యాడ్లను చూపవచ్చు.
మీరు మీ Google ఖాతాలో ఎప్పుడైనా మీ అడ్రస్‌లను తీసివేయవచ్చు.
మీ ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ను జోడించండి లేదా మార్చండి
- మీ కంప్యూటర్లో, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపున, వ్యక్తిగత సమాచారం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- "అడ్రస్‌లు" అనే విభాగంలో, ఇల్లు లేదా ఆఫీస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- మీ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
- సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
చిట్కా: ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు. మీరు మీ Google ఖాతాలో అడ్రస్‌ను పబ్లిక్ చేయాలనుకుంటే, మీరు దాన్ని ప్రొఫైల్ అడ్రస్‌గా జోడించవచ్చు.
మీ ఇల్లు లేదా ఆఫీస్ అడ్రస్‌ను తీసివేయండి
- మీ కంప్యూటర్లో, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
- ఎడమ వైపున, వ్యక్తిగత సమాచారం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- "అడ్రస్‌లు" అనే విభాగంలో, ఇల్లు లేదా ఆఫీస్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
- తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఇతర అడ్రస్‌లు
మీరు Google సర్వీస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీ Google ఖాతాకు జోడించబడిన అడ్రస్‌లను మీరు కనుగొనవచ్చు, వాటిని మేనేజ్ చేయవచ్చు.
దిగువ మీ Google ఖాతాలోని ఇతర అడ్రస్‌ల గురించి మరింత సమాచారాన్ని కనుగొనండి.
మీ Google ఖాతాకు అడ్రస్‌లు ఎలా జోడించబడతాయి
మీరు Google సర్వీస్ ద్వారా అడ్రస్‌ను జోడించినప్పుడు, మీరు దానిని మీ Google ఖాతాలో కనుగొనవచ్చు, మేనేజ్ చేయవచ్చు.
మీ అడ్రస్‌లను ఉపయోగించండి
మీరు కింద పేర్కొన్న పనులు చేయడానికి మీ Google ఖాతాలోని అడ్రస్‌లను ఉపయోగించవచ్చు:
- మీరు Chromeను ఉపయోగిస్తున్నప్పుడు అడ్రస్ ఫారమ్‌లను ఆటోఫిల్ చేయడానికి.
- Google Play Store నుండి ఏదైనా కొనుగోలు చేయడానికి.
- Google సబ్స్క్రిప్షన్ కోసం పే చేయడానికి.
- Google Payతో కొనుగోలు చేయడం కోసం ఉపయోగించడానికి.
ప్రొఫైల్ అడ్రస్‌లు
ప్రొఫైల్ అడ్రస్ అనేది మీకు సంబంధించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రొఫైల్స్‌తో అనుబంధించబడిన అడ్రస్. కొన్ని Google యాప్‌లలో, సర్వీస్‌లలో, మీకు ఒక ప్రొఫైల్ ఉంటుంది, అది ఆ సర్వీస్‌ను ఉపయోగించే ఇతర వ్యక్తులకు కనిపిస్తుంది. Google యాప్‌లలో, సర్వీస్‌లలో ఎవరైనా మీతో కమ్యూనికేట్ చేసినప్పుడు లేదా మీరు క్రియేట్ చేసే కంటెంట్‌ను చెక్ చేసినప్పుడు ఈ సమాచారాన్ని కనుగొనవచ్చు.
చిట్కా: Google సర్వీస్‌లలో ప్రొఫైల్స్ గురించి మరింత తెలుసుకోవడానికి, Google సర్వీస్‌లలో ప్రొఫైల్స్‌ను చూడండి, మేనేజ్ చేయండి అనే లింక్‌కు వెళ్లండి.
బిల్లింగ్ అడ్రస్‌లు
బిల్లింగ్ అడ్రస్ అనేది మీ పేమెంట్ ఆప్షన్‌తో అనుబంధించబడిన అడ్రస్.
చిట్కా: మీ బిల్లింగ్ అడ్రస్‌లను మేనేజ్ చేయడానికి, మీ ఇంటి లేదా బిల్లింగ్ అడ్రస్‌ను మార్చండి అనే లింక్‌కు వెళ్లండి.
చట్టపరమైన అడ్రస్
మీ చట్టపరమైన అడ్రస్ అనేది మీ Google పేమెంట్స్ ప్రొఫైల్‌తో అనుబంధించబడిన అడ్రస్.
చిట్కా: మీ చట్టపరమైన అడ్రస్‌లను మేనేజ్ చేయడానికి, మీ ఇంటి లేదా బిల్లింగ్ అడ్రస్‌ను మార్చండి అనే లింక్‌కు వెళ్లండి.