'Googleతో సైన్ ఇన్' ఏమి చేస్తుంది
'Googleతో సైన్ ఇన్' అనేది ఇప్పటికే ఉన్న మీ Google ఖాతాతో థర్డ్-పార్టీ ఖాతాలకు సురక్షితంగా, సులభంగా సైన్ ఇన్ చేయడంలో సహాయపడుతుంది. మీరు Googleతో సైన్ ఇన్ ఆప్షన్‌ను ఉపయోగించినప్పుడు, మీరు వివిధ సర్వీస్‌లలో పదేపదే యూజర్‌నేమ్‌ను, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
'Googleతో సైన్ ఇన్' ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి. మీ Google ఖాతా, Gmail, Drive, ఇతర Google యాప్‌ల కోసం మీరు ఉపయోగించే అదే ఖాతా అవుతుంది. మీకు Google ఖాతా లేకుంటే, మీరు తప్పనిసరిగా ఒక దాన్ని క్రియేట్ చేసుకోవాలి.
చిట్కాలు:
- Googleకు చెందని కంపెనీలు లేదా డెవలపర్లను థర్డ్ పార్టీలు అంటారు. మీరు విశ్వసించే థర్డ్-పార్టీలతో మాత్రమే మీ డేటాను షేర్ చేయండి.
- మీ Google ఖాతా యాక్సెస్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, మీరు మీ Google ఖాతా లేదా Gmailను ఎలా రికవర్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవచ్చు.
- మీకు Googleతో సైన్ ఇన్ చేయడంలో సమస్య ఉంటే, థర్డ్-పార్టీ కనెక్షన్లతో సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.
మీరు Googleతో సైన్ ఇన్ ఫీచర్‌ను ఉపయోగించినప్పుడు ఏమి జరుగుతుంది
Googleతో సైన్ ఇన్, మీ Google ఖాతా ఆధారంగా సురక్షితంగా ప్రసారం అయిన కోడ్‌ను ఉపయోగిస్తుంది. ఇది మీ పేరు, ఈమెయిల్, ప్రొఫైల్ ఫోటో వంటి Google ఖాతా నుండి షేర్ చేసే సమాచారం ఆధారంగా మిమ్మల్ని ప్రామాణీకరించడానికి, ఖాతాను క్రియేట్ చేయడానికి యాప్‌లను, సర్వీస్‌లను అనుమతిస్తుంది. డేటాను సురక్షితంగా షేర్ చేయడంలో 'Googleతో సైన్ ఇన్' మీకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
మీరు Googleతో సైన్ ఇన్ చేసే కనెక్షన్‌లను ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు. మీ Google ఖాతాకు, థర్డ్-పార్టీలకు మధ్య కనెక్షన్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.
సైన్ ఇన్ చేయడానికి వివిధ మార్గాలు
మీ Google ఖాతాను మీరు థర్డ్-పార్టీ యాప్‌లు అలాగే సర్వీస్‌లలో సైన్ ఇన్ చేయడానికి 3 మార్గాలలో ఉపయోగించవచ్చు.
Googleతో సైన్ ఇన్ బటన్
మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే, మీరు ఏ ఖాతాను ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోమని 'Googleతో సైన్ ఇన్' మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తుంది. మీకు కావలసిన ఖాతా కనిపించకపోతే, మరొక ఖాతాను జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీరు ఇంతకు ముందు థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో 'Googleతో సైన్ ఇన్' ఆప్షన్‌ను ఉపయోగించినట్లయితే, అది మీ ప్రొఫైల్ ఫోటోను, ఈమెయిల్ అడ్రస్‌ను చూపించే వ్యక్తిగతీకరించబడిన బటన్‌ను డిస్‌ప్లే చేస్తుంది. మీరు ఈ యాప్‌నకు చివరిసారిగా ఎలా సైన్ ఇన్ చేశారో గుర్తుంచుకోవడానికి, ఈ బటన్ మీకు సహాయపడుతుంది. మీరు బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను నిర్ధారించవచ్చు. అది మిమ్మల్ని యాప్‌లోకి లేదా సర్వీస్‌లోకి సైన్ ఇన్ చేస్తుంది.
చిట్కా: మీకు థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌తో ఖాతా ఉంటే, మీరు లాగిన్ చేయడానికి 'Googleతో సైన్ ఇన్' ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. మీకు థర్డ్-పార్టీతో ఇప్పటికే ఒక ఖాతా లేనట్లయితే, మీరు 'Googleతో సైన్ ఇన్' ఆప్షన్‌ను ఉపయోగించినప్పుడు, మీ కోసం ఆటోమేటిక్‌గా ఒకటి క్రియేట్ చేయబడవచ్చు.
ముఖ్య గమనిక: ఆటోమేటిక్ సైన్-ఇన్‌ను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా ఇప్పటికే మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి, అలాగే సైన్ ఇన్ చేయడానికి మీ ప్రొఫైల్‌ను థర్డ్-పార్టీతో షేర్ చేయడానికి మునుపు సమ్మతిని మంజూరు చేసి ఉండాలి. మీరు థర్డ్-పార్టీకి సమ్మతిని మంజూరు చేయకుంటే, Google సైన్-ఇన్ ప్రాంప్ట్ కనిపిస్తుంది.
ఆటంకం లేని అనుభవాన్ని అందించడానికి, ఆటోమేటిక్ సైన్-ఇన్ మీరు యాప్ లేదా సర్వీస్‌కు తిరిగి వచ్చినప్పుడు సైన్ ఇన్ చేయడానికి మాన్యువల్ దశలను తీసివేస్తుంది. సైన్-ఇన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ దాన్ని చూపిస్తుంది.
Googleతో సైన్ ఇన్ ప్రాంప్ట్‌ను డిజేబుల్ చేయడం ఎలా
ప్రాంప్ట్‌ను డిజేబుల్ చేయడానికి:
- మీ 'Googleతో సైన్ ఇన్' సెట్టింగ్‌లకు వెళ్లండి.
- "సైన్-ఇన్ ప్రాంప్ట్‌లు" పక్కన ఉన్న టోగుల్‌ను ఆఫ్ చేయండి.
మీరు Googleతో సైన్ ఇన్ ప్రాంప్ట్‌ను డిజేబుల్ చేసినప్పుడు, మీ Google ఖాతాతో మీరు సైన్ ఇన్ చేసిన అన్ని Android డివైజ్‌లలో ఉన్న అన్ని థర్డ్-పార్టీ యాప్‌లు లేదా సర్వీస్‌లకు ప్రాంప్ట్ డిజేబుల్ అవుతుంది. మీరు మీ సెట్టింగ్‌లలో ప్రాంప్ట్‌ను డిజేబుల్ చేస్తే, Chromeలో, అలాగే కొన్ని ఇతర బ్రౌజర్‌లలో కూడా ప్రాంప్ట్ డిజేబుల్ అవుతుంది. అయితే, దీని వల్ల మీరు ఉపయోగించే అన్ని బ్రౌజర్‌లలో ప్రాంప్ట్ డిజేబుల్ కాదు.
మీరు మీ Google ఖాతా సెట్టింగ్‌లలో ప్రాంప్ట్‌ను ఎనేబుల్ చేసి ఉండి, మీ Chrome సెట్టింగ్‌లలో దాన్ని డిజేబుల్ చేస్తే, ప్రాంప్ట్ Chromeలో కనిపించదు. అన్ని ఇన్‌స్టెన్స్‌లలో ప్రాంప్ట్‌ను ఎనేబుల్ చేయడానికి, మీ Google ఖాతా సెట్టింగ్‌లు, Chrome సెట్టింగ్‌లు రెండింటిలోనూ దాన్ని ఆన్ చేసేలా చూసుకోండి. Chromeలో థర్డ్-పార్టీ సైన్ ఇన్ గురించి తెలుసుకోండి.
ఇతర బ్రౌజర్‌లలో ఈ ప్రాంప్ట్‌లను డిజేబుల్ చేయడానికి మీ నిర్దిష్ట బ్రౌజర్ సెట్టింగ్‌లను చెక్ చేయండి. అయితే, Safari వంటి ITP బ్రౌజర్‌లు ఈ ప్రాంప్ట్‌లను మేనేజ్ చేయడానికి లేదా డిజేబుల్ చేయడానికి అనుమతించవు.
మీరు ఒకే యాప్ లేదా సర్వీస్ కోసం థర్డ్-పార్టీ కనెక్షన్‌ను కూడా తీసివేయవచ్చు. మీరు ఇకపై మీ Google ఖాతాను థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌కు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించకూడదనుకుంటే, మీరు దాని కనెక్షన్‌ను తీసివేయవచ్చు. కనెక్షన్‌ను ఎలా తీసివేయాలో తెలుసుకోండి.