యాక్సెస్ బ్లాక్ చేయబడింది: థర్డ్-పార్టీ యాప్, సపోర్ట్ చేయని OAuth పద్ధతిని ఉపయోగిస్తోంది

యూజర్‌లు సైన్ ఇన్ చేయడానికి, వారి Google ఖాతా డేటాను థర్డ్-పార్టీ అప్లికేషన్‌లతో షేర్ చేయడానికి సంబంధించి Google దగ్గర సురక్షితమైన మార్గాలు ఉన్నాయి. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, తక్కువ సురక్షితమైన ప్రామాణీకరణ పద్ధతులు గల యాప్‌ల నుండి వచ్చే Google సైన్ ఇన్ రిక్వెస్ట్‌లు బ్లాక్ చేయబడతాయి, ఎందుకంటే, ఆ యాప్‌లు ఫిషింగ్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది, అలాగే వేరే యాప్‌లు ఆ యాప్‌లలా నటించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.

మీ డేటా థర్డ్-పార్టీ యాప్‌లతో ఎలా షేర్ చేయబడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి

యాప్ చెల్లని రిక్వెస్ట్‌ను పంపింది

సపోర్ట్ లేని ప్రామాణీకరణ పద్ధతిని ఉపయోగిస్తున్నందున ఏదైనా యాప్ బ్లాక్ చేయబడితే, మీరు "యాక్సెస్ బ్లాక్ చేయబడింది: యాప్ చెల్లని రిక్వెస్ట్‌ను పంపింది" అనే టెక్స్ట్‌ను ప్రదర్శించే "ఎర్రర్ 400" పేజీకి మళ్లించబడవచ్చు.

ఈ ఎర్రర్ విషయంలో నేను ఏం చేయగలను?

మీరు యాప్ తాజా వెర్షన్‌ను ఉపయోగించకుంటే, మీ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసి, మళ్లీ ట్రై చేయండి.

  • యాప్ ఇన్‌స్టాల్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టమ్ (OS) పాతది అయితే, OSను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.

మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించి, మరింత సురక్షితమైన ప్రామాణీకరణ పద్ధతులను ఉపయోగించడానికి వారి యాప్‌ను అప్‌డేట్ చేయమని కూడా వారిని అడగవచ్చు.

డెవలపర్ కాంటాక్ట్ సమాచారాన్ని కనుగొనడానికి:

  1. థర్డ్-పార్టీ యాప్‌నకు వెళ్లండి.
  2. "Googleతో సైన్ ఇన్" ప్రక్రియను ప్రారంభించండి.
  3. "Googleతో సైన్ ఇన్" సమ్మతి స్క్రీన్‌పై డెవలపర్‌కు సంబంధించిన కాంటాక్ట్ ఈమెయిల్‌ను చూడటానికి యాప్ పేరుపై క్లిక్ చేయండి.

యాప్ డెవలపర్‌లకు సమాచారం

ఒకవేళ మీ యాప్, iOS, Android, ఇంకా Chrome యాప్ OAuth క్లయింట్ రకాల కోసం లూప్‌బ్యాక్ IP అడ్రస్ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటే, లేదా ఏదైనా క్లయింట్ రకం కోసం అవుట్-ఆఫ్-బ్యాండ్ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటే, మీరు మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయ పద్ధతికి మారాల్సి ఉంటుంది. మరిన్ని వివరణాత్మక సూచనల కోసం, అవుట్-ఆఫ్-బ్యాండ్ (OOO) ప్రక్రియ తరలింపు గైడ్‌ను, అలాగే లూప్‌బ్యాక్ IP అడ్రస్ ప్రక్రియ తరలింపు గైడ్‌ను చెక్ చేయండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3684136219684270547
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false