వ్యక్తిగత సమాచారం అనేది వెబ్‌లో ఇటీవల, మరింత ఎక్కువగా దర్శనమిస్తోంది. ఉదాహరణకు, మీ స్నేహితులలో కొందరు ఏదైనా సోషల్ నెట్‌వర్క్‌లో మీ పేరు పేర్కొని ఉండొచ్చు లేదా ఆన్‌లైన్ ఫొటోలలో మిమ్మల్ని ట్యాగ్ చేసి ఉండొచ్చు లేదా బ్లాగ్ పోస్ట్‌లు లేదా వార్తా కథనాల్లో మీ పేరు ప్రస్తావించబడి ఉండొచ్చు.
సాధారణంగా మీ గురించి ప్రచురించబడిన సమాచారం కోసం వ్యక్తులు సెర్చ్ చేసే వాటిలో Google Search ముందు వరుసలో ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీ ప్రసిద్ధిని మేనేజ్ చేయడానికి, అలాగే Googleలో మీ గురించి సెర్చ్ చేసినప్పుడు వ్యక్తులు చూసే సమాచారాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడే కొన్ని మార్గాలు ఇవిగోండి:
1. మీ కోసం సెర్చ్ చేయండిమీ గురించి ఏ సమాచారం వస్తుందో తెలుసుకోవడానికి, మీ పేరుతో Googleలో Search చేయండి.
Google ఖాతాతో, Google సర్వీస్‌లు అంతటా వ్యక్తులకు కనిపించే మీ వివరాలు, కాంటాక్ట్ వివరాలు, అలాగే మీ గురించిన ఇతర సమాచారం వంటి సమాచారాన్ని మీరు మేనేజ్ చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో కనిపించకూడదని మీరు అనుకున్న కంటెంట్, ఉదాహరణకు మీ టెలిఫోన్ నంబర్ లేదా మీకు సంబంధించిన అనుచితమైన ఫోటో వంటి వాటిని మీరు ఆన్‌లైన్‌లో కనుగొన్నట్లయితే, ముందుగా ఆ కంటెంట్‌ను కంట్రోల్ చేసేది మీరేనా లేక వేరెవరైనా అనేది తెలుసుకోండి. అవాంఛిత కంటెంట్ ఒకవేళ మీ కంట్రోల్‌లో లేని సైట్ లేదా పేజీలో ఉన్నట్లయితే, మీరు 'Google నుండి వ్యక్తిగత సమాచారాన్ని తీసివేయడం' వద్ద ఉన్న మా చిట్కాలను ఫాలో చేయవచ్చు.