మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను మేనేజ్ చేయండి

మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ అనేది Google Chrome, అలాగే Gmailలో ఫిషింగ్, ఇంకా మాల్‌వేర్ నుండి మరింత మెరుగైన రక్షణ అందించడంలో సహాయపడగలదు.
మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఆన్ చేయండి

మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ ఎలా పని చేస్తుంది

ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లు, డౌన్‌లోడ్‌లు, ఇంకా ఎక్స్‌టెన్షన్‌ల నుండి వేగవంతమైన, చురుకైన రక్షణను అందించడానికి, 'మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్' ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తూ ఉంటుంది.
మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను మీరు ఆన్ చేయాలనుకుంటే, ఈ మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ అనేది మీరు సైన్ ఇన్ చేసినప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంతో పాటు, Google Chrome, ఇంకా Gmailలో మీ సెక్యూరిటీని మెరుగుపరుస్తుంది.
మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ ఉపయోగించే సమాచారం
మీ ఖాతాను, ఇంకా డేటాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ అనేది ఈ కింద పేర్కొన్న ప్రమాదకరమైన వాటి కోసం మీ ఖాతాను చెక్ చేస్తుంది:
  • URLలు
  • డౌన్‌లోడ్‌లు
  • బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌లు
  • సిస్టమ్ సమాచారం
  • పేజీల చిన్న శాంపిల్
మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది
Google:
  • మీరు సైన్ ఇన్ చేసినప్పుడు Google Chrome, ఇంకా Gmailలో మీ సెక్యూరిటీని మెరుగుపరచడానికి, మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ నుండి సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
  • మీరు సైన్ ఇన్ చేసినప్పుడు Google యాప్‌ల అంతటా మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి, మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ నుండి వచ్చిన సమాచారాన్ని తాత్కాలికంగా మీ Google ఖాతాతో అనుబంధిస్తుంది.
సెక్యూరిటీ విషయంలో ఈ సమాచారం ఎలా సహాయపడుతుంది
Google ఈ కింద పేర్కొన్న విషయాల్లో సహాయపడటానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది:
  • ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లు, డౌన్‌లోడ్‌లు, అలాగే ఎక్స్‌టెన్షన్‌ల గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి లేదా వాటిని బ్లాక్ చేయడానికి రియల్ టైమ్ సెక్యూరిటీ స్కానింగ్‌ను అందించడంలో.
  • మీ కోసం, అలాగే వెబ్‌లో ఉండే అందరి కోసం, ఫిషింగ్, ఇంకా మాల్‌వేర్‌ను గుర్తించి, వాటి నుండి సురక్షితంగా ఉంచడానికి Google సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో.
  • Google యాప్‌ల అంతటా ప్రమాదకరమైన లింక్‌ల నుండి మీకు మెరుగైన రక్షణను అందించడంలో.

మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను మేనేజ్ చేయండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. "మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్"కు స్క్రోల్ చేయండి.
  4. మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి. 
    • మీ ఖాతా కోసం మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను మీరు ఆన్ చేస్తే, ఈ కింద పేర్కొన్న సందర్భాలలో Chromeలో మెరుగైన సురక్షిత బ్రౌజింగ్ కూడా ఆన్ అవుతుంది:
    • మీ ఖాతాలో మీరు మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను ఆఫ్ చేస్తే:
      • ఈ సెట్టింగ్ మార్పు పూర్తి అవ్వడానికి 24 గంటల దాకా సమయం పట్టవచ్చు.
      • ప్రమాదకరమైన వెబ్‌సైట్‌లు, డౌన్‌లోడ్‌లు, అలాగే ఎక్స్‌టెన్షన్‌ల నుండి మిమ్మల్ని రక్షించడంలో Google సురక్షిత బ్రౌజింగ్ సహాయం చేయడాన్ని కొనసాగిస్తుంది
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15168303525999085540
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false