మీ Google ఖాతా ఫోటోను, పేరును, ఇతర సమాచారాన్ని మార్చండి

Googleను ఉపయోగించే ఇతర వ్యక్తులు మీ పేరు, మీ ప్రొఫైల్ ఫోటో, అలాగే ఇతర ప్రాథమిక సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. Google సర్వీస్‌లు అంతటా మీ గురించి ఇతరులకు ఏమి కనిపించాలో మీరు కంట్రోల్ చేయవచ్చు.

ముఖ్య గమనిక: మీరు మీ Google పేరును లేదా ప్రొఫైల్ ఫోటోను మారిస్తే, మీ YouTube పేరు లేదా ప్రొఫైల్ ఫోటో మారదు. మరింత సమాచారం కోసం, మీ ఛానెల్ బ్రాండింగ్‌ను మేనేజ్ చేయండి ఆప్షన్‌కు వెళ్ళండి.

మీ YouTube ఛానెల్‌కు చెందిన ప్రాథమిక సమాచారం గురించి మరింత తెలుసుకోండి.

మీ ప్రొఫైల్ ఫోటోను జోడించండి లేదా మార్చండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. "వ్యక్తిగత సమాచారం" కింద, ఫోటో ను క్లిక్ చేయండి.
  3. మీ కంప్యూటర్ నుండి ఫోటోను అప్‌లోడ్ చేయండి లేదా మీ Google Photosలో ఒకదాన్ని ఎంచుకోండి.
  4. మీ ఫోటోను అవసరమైన విధంగా తిప్పి కత్తిరించండి.
    • దిగువున సహాయక టెక్నాలజీతో మీ ఫోటోను కత్తిరించడానికి దశలను కనుగొనండి.
  5. దిగువున ఉన్న, ప్రొఫైల్ ఫోటోగా సేవ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సహాయక టెక్నాలజీ లేదా కీబోర్డ్‌తో మీ ఫోటోను కత్తిరించండి

మీ ఫోటోను ఒక మూల నుండి కత్తిరించండి

  1. మీ ఫోటో యొక్క మూలను ఎంచుకోవడానికి నావిగేట్ చేయండి.
  2. ఫోటోను కత్తిరించడానికి బాణం కీలను ఉపయోగించండి.

కత్తిరించే స్క్వేర్ భాగం మొత్తాన్ని తరలించండి

  1. కత్తిరించే స్క్వేర్ భాగం మొత్తాన్ని ఎంపిక చేయడానికి నావిగేట్ చేయండి.
  2. కత్తిరించే స్క్వేర్ భాగం స్థితిని మార్చడానికి బాణం కీలను ఉపయోగించండి.

మీ పేరును ఎడిట్ చేయండి

మీరు మీ పేరును మీకు కావలసినన్ని సార్లు మార్చుకోవచ్చు.
 

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. "వ్యక్తిగత సమాచారం," కింద పేరు ఆ తర్వాత ఎడిట్ చేయండి ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
  3. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.
చిట్కా: మీ పేరు ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి.

 

ఇప్పటికీ పాత పేరు కనిపిస్తూ ఉంటే, ఆ సమస్యను పరిష్కరించండి

మీరు మీ పేరును మార్చిన తర్వాత, మీ కాష్, కుక్కీలను క్లియర్ చేయండి. మీ కాష్, కుక్కీలను క్లియర్ చేయడం వలన ప్రతి ప్రోడక్ట్‌లోనూ మీ పేరు అప్‌డేట్ కాకపోవచ్చు. గతంలో చాట్ సంభాషణలలో ఎక్కడ అయితే మీ పేరు ఉందో, అక్కడ మీ పాత పేరు కనిపించవచ్చు.

ముఖ్య గమనిక: మీరు మీ కుక్కీలను క్లియర్ చేసినప్పుడు, Google యేతర సైట్‌ల నుండి మీరు సైన్ అవుట్ చేయబడవచ్చు.

వ్యక్తిగత సమాచారాన్ని మార్చండి

మీరు మీ పుట్టినరోజు, లింగం వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు. మీరు మీ ఖాతాలోని ఇమెయిల్ అడ్రస్, అలాగే ఫోన్ నంబర్‌లను మార్చవచ్చు.
  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. "వ్యక్తిగత సమాచారం" కింద, మీరు మార్చాలనుకొనే సమాచారాన్ని క్లిక్ చేయండి.
  3. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

మరిన్ని వివరాలు

పేరు

మీరు మీ పేరును మీకు కావలసినన్ని సార్లు మార్చుకోవచ్చు.
 

మారుపేరు

మీ మారుపేరును జోడించడానికి, అప్‌డేట్ చేయడానికి, లేదా తీసివేయడానికి, నా పరిచయం లేదా account.google.com కు వెళ్లండి. account.google.com కోసం ఈ సూచనలను ఫాలో అవ్వండి:

  1. వ్యక్తిగత సమాచారం అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ పేరుకు కుడి వైపున, ఆ తర్వాత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "మారుపేరు" పక్కన, ఎడిట్ చేయండి ఎడిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
పుట్టినరోజు

మీ ఖాతాకు మీ పుట్టినరోజును జోడించిన తర్వాత, మీరు దాన్ని తొలగించవచ్చు. అయితే, మీరు దీన్ని ఎడిట్ చేసి, ఎవరు చూడగలరో ఎంచుకోవచ్చు.

ముఖ్య గమనిక: Google, ఖాతా సెక్యూరిటీ, ఇంకా వ్యక్తిగతీకరణ కోసం Google సర్వీస్‌ల అంతటా మీ పుట్టినరోజును ఉపయోగించవచ్చు.

మీ పుట్టినరోజును ఎవరు చూడగలరు

మేము మీ పుట్టినరోజును Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులతో ఆటోమేటిక్‌గా షేర్ చేయము. మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో కంట్రోల్ చేయడానికి:

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “ప్రాథమిక సమాచారం” కింద, పుట్టినరోజు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ పుట్టినరోజు సమాచారాన్ని ఇప్పటికే లేకపోతే, దాన్ని పూరించండి.
  5. "మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి" కింద, మీరు మాత్రమే లేదా ఎవరైనా ఆప్షన్‌ను ఎంచుకోండి.

పుట్టినరోజును హైలైట్ చేయండి

మీరు “మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి” కోసం ఎవరికైనా(లేదా వర్తిస్తే, మీ సంస్థ) సెట్ చేసినప్పుడు, మీరు దానిని హైలైట్ చేయడానికి Googleను అనుమతించవచ్చు. ఉదాహరణకు, మీ పుట్టినరోజు సమీపంలో Google మీ ప్రొఫైల్ ఫోటో ఎక్కడ కనిపించినా దాన్ని అలంకరించవచ్చు. ఇతరులు మీతో కమ్యూనికేట్ అయినప్పుడు లేదా కొన్ని Google సర్వీస్‌లలో మీరు క్రియేట్ చేసే కంటెంట్‌ను చూసినప్పుడు, మీ పుట్టినరోజు, పుట్టినరోజు హైలైట్‌లను వారు చూడగలరు.

మీ పుట్టినరోజు కనిపించకూడదు అని మీరు భావిస్తే, “మీ పుట్టినరోజును ఎవరు చూడవచ్చో ఎంచుకోండి” ఆప్షన్‌ను మీరు మాత్రమే ఆప్షన్‌కు సెట్ చేయండి, అప్పుడు Google దాన్ని హైలైట్ చేయదు. Google ఇప్పటికీ కొన్ని స్థలాలలో మీ ప్రొఫైల్ ఫోటోను అలంకరించడం వంటి పనులను చేస్తుంది, కానీ మీరు మాత్రమే వాటిని చూడగలరు.

చిట్కా: మీ పుట్టినరోజు సరైన తేదీలో హైలైట్ చేయబడకపోతే, మీ ప్రొఫైల్‌లో మీ పుట్టినరోజు సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. ఇది ఇతరులకు వేరే తేదీలో హైలైట్ చేయబడినట్లు కనిపిస్తే, వారు తమ Google Contactsలో దాన్ని తప్పుగా ఎంటర్ చేసి ఉండవచ్చు.

Google మీ పుట్టినరోజును ఉపయోగించే కొన్ని మార్గాలు

Google మీ పుట్టినరోజును దీనికోసం ఉపయోగించవచ్చు:

లింగం

మీ Google ఖాతాకు సంబంధించిన లింగం విభాగంలో మీకు కొన్ని ఆప్షన్‌లు ఉన్నాయి. మీరు వీటిని చేయవచ్చు:

  • మీ లింగాన్ని పేర్కొనడం
  • మీ లింగాన్ని పేర్కొనకుండా ఉండటానికి ఎంచుకోవటం
  • అనుకూల లింగాన్ని జోడించి, Google మిమ్మల్ని ఎలా సూచిస్తుందో ఎంచుకోవడం

మీ లింగాన్ని ఎవరు చూడగలరు

ఆటోమేటిక్‌గా, Google సర్వీస్‌లను ఉపయోగించే ఇతర వ్యక్తులతో మీ లింగం షేర్ చేయబడదు. మీ లింగం ఎవరు చూస్తారు అనేది కంట్రోల్ చేయడానికి, మీ Google ఖాతాకు సంబంధించిననా పరిచయం విభాగానికి వెళ్లండి.

Google మీ లింగాన్ని ఎలా ఉపయోగిస్తుంది

Google సర్వీస్‌లను మరింత వ్యక్తిగతంగా చేయడానికి మేము మీ లింగాన్ని ఉపయోగిస్తాము. మీరు మీ లింగాన్ని పేర్కొన్నప్పుడు, మీరు మాకు ఈ విధంగా సహాయపడతారు:

  • మిమ్మల్ని సూచించే మెసేజ్‌లు, అలాగే ఇతర టెక్స్ట్‌లను వ్యక్తిగతీకరించడానికి. ఉదాహరణకు, మీ లింగాన్ని చూడగలిగే వ్యక్తులకు "అతనికి మెసేజ్ పంపు" లేదా "ఆమె సర్కిల్‌లలో" వంటి టెక్స్ట్ కనిపిస్తుంది.
  • యాడ్‌ల వంటి, మరింత సందర్భోచితమైన, మీకు బాగా ఆసక్తి ఉన్న అనుకూలమైన కంటెంట్‌ను అందించండి.

మీరు మీ లింగాన్ని పేర్కొనకపోతే, "వారికి మెసేజ్‌ను పంపండి" వంటి లింగ-తటస్థ పరంగా ఉండే పదాలతో మిమ్మల్ని మేము సూచిస్తాము.

ఇతర సమాచారాన్ని మార్చండి

మీ పాస్‌వర్డ్‌ను మార్చండి
  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. "సెక్యూరిటీ" విభాగంలో, మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. ప్రాంప్ట్ వచ్చినప్పుడు మళ్లీ సైన్ ఇన్ చేయండి.
  4. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఆన్‌లైన్ సెక్యూరిటీ, అలాగే భద్రత గురించి మరింత సమాచారాన్ని పొందండి.

మీ గురించి ఇతరులకు కనిపించే అంశాలను కంట్రోల్ చేయండి

Google సర్వీస్‌లలో ఇతర వ్యక్తులు మీ గురించి ఏ సమాచారాన్ని చూస్తారు అనేది ఎంచుకోవడానికి, మీ Google ఖాతాకు సంబంధించిన నా పరిచయం విభాగానికి వెళ్లండి.

మీరు ఏ సమాచారాన్ని మార్చవచ్చో, అలాగే ఎలా మార్చాలో అనేది తెలుసుకోండి.

మీ టైమ్ జోన్‌ను మార్చండి

మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు మీ ప్రస్తుత లొకేషన్‌కు చెందిన టైమ్ జోన్‌లో ఈవెంట్‌లను చూడవచ్చు.

Google Calendarలో మీ టైమ్ జోన్‌ను మార్చడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
200190851773280190
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false