2-దశల వెరిఫికేషన్ ఆఫ్ చేయండి

మీరు సైన్ ఇన్ చేయడానికి మీకు పాస్‌వర్డ్, అలాగే వెరిఫికేషన్ కోడ్ అవసరం ఉన్నప్పుడు మీ ఖాతా మరింత సురక్షితంగా ఉంటుంది. మీరు ఈ అదనపు సెక్యూరిటీ లేయర్‌ను తీసివేస్తే, మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు మిమ్మల్ని పాస్‌వర్డ్ మాత్రమే అడగటం జరుగుతుంది. దీనివల్ల ఎవరైనా మీ ఖాతాకు సులభంగా ప్రవేశించవచ్చు.

  1. మీ Google ఖాతాను తెరవండి.
  2. సెక్యూరిటీని క్లిక్ చేయండి.
  3. "మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు" విభాగంలో, 2-దశల వెరిఫికేషన్‌ను ఎంచుకోండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  4. ఆఫ్ చేయిని ఎంచుకోండి.
  5. మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆఫ్ చేయాలనుకుంటున్నారని నిర్ధారించడానికి ఒక పాప్-అప్ విండో కనిపిస్తుంది. ఆఫ్ చేయిని ఎంచుకోండి.

ఈ ఖాతాకు సైన్ ఇన్ చేయడం కోసం మీరు సేవ్ చేసిన అన్ని బ్యాకప్ కోడ్‌లను నాశనం చేయండి.

మీరు ఇకపై ఉపయోగించని యాప్ పాస్‌వర్డ్‌లను ఉపసంహరిస్తోంది

మీ Google ఖాతాను యాక్సెస్ చేసేందుకు యాప్‌లను అనుమతించడానికి మీరు యాప్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించినట్లయితే, మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆఫ్ చేసినప్పుడు మీకు ఎర్రర్‌లు కనిపించవచ్చు. ఇలా జరిగితే, మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మళ్లీ ఎంటర్ చేయండి.

మేము మీకు మీ యాప్ పాస్‌వర్డ్‌లను ఉపసంహరించుకోమని సిఫార్సు చేస్తున్నాము:

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. సెక్యూరిటీని క్లిక్ చేయండి.
  3. "Googleకు సైన్ ఇన్ చేయడం" విభాగంలో, యాప్ పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  4. యాప్‌ పాస్‌వర్డ్‌లను ఎంచుకోండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. యాప్ లేదా పరికరానికి పక్కన, తీసివేయి Removeని ఎంచుకోండి.

మీరు తర్వాతి సారి యాప్ లేదా పరికరానికి సైన్ ఇన్ చేసినప్పుడు, మిమ్మల్ని మీ Google ఖాతా యూజర్‌నేమ్, అలాగే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడగటం జరుగుతుంది. ఒకవేళ యాప్ వెంటనే అడగకపోతే, దాని యాప్ పాస్‌వర్డ్ ఉపసంహరించబడిందని గుర్తించడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18203826714277086986
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false