ఇంప్రెషన్‌లు & క్లిక్-త్రూ రేట్ FAQలు

ఈ కింది FAQల ద్వారా ఇంప్రెషన్‌లు, క్లిక్-త్రూ రేట్ డేటాకు సంబంధించిన టాప్ ప్రశ్నలకు సమాధానాలను పొందండి.

నా వీడియోకు అధిక క్లిక్-త్రూ రేట్, సగటు వీక్షణ వ్యవధి ఉన్నప్పటికీ తక్కువ ఇంప్రెషన్‌లు ఎందుకు ఉన్నాయి?

క్రియేటర్‌లు వారి ఛానెల్‌లోని ఇతర వీడియోలతో సరిపోల్చినప్పుడు, YouTube సిస్టమ్‌లు వీక్షకులు చూసే అవకాశం ఉన్న ప్రతి వీడియోను అన్ని ఇతర వీడియోలతో సరిపోల్చి ర్యాంక్ చేస్తాయి. మీ ఛానెల్‌లోని ఇతర వీడియోలతో సరిపోలిస్తే వీడియో పనితీరు బావున్నప్పటికీ, ఇతర ఛానెల్స్‌లోని వీడియోలు ఇంకా చక్కటి పనితీరును కనబరచడం దీనికి కారణం కావచ్చు. తక్కువ ఇంప్రెషన్‌లు, వీక్షణలు కలిగి ఉన్న వీడియోలు అధిక క్లిక్-త్రూ రేట్‌లను, సగటు వీక్షణ వ్యవధిని కలిగి ఉండటం సాధారణమే. ఆ వీడియోలను సంక్షిప్తమైన, మరింత నమ్మకమైన ప్రేక్షకులు చూడటమే ఈ అధిక సంఖ్యలకు కారణం. వీడియో పనితీరును సరిపోల్చే సమయంలో, వివిధ రకాల వీక్షకుల డేటా వాటిని మరింత స్పష్టంగా వివరించవచ్చని గుర్తుంచుకోండి.

నా క్లిక్-త్రూ రేట్ డేటాతో నేను ఏమి చేయకూడదు?

  • తగినంత డేటా లేకుండా నిర్ణయం తీసుకోవడం. గణనీయమైన సంఖ్యల ఇంప్రెషన్‌లను పొందిన తర్వాత మీ క్లిక్-త్రూ రేట్‌ను చూడటం చాలా ముఖ్యం. అప్‌లోడ్ చేసిన వెంటనే మీ క్లిక్-త్రూ రేట్‌ను చెక్ చేయడాన్ని నివారించండి.
  • క్లిక్-త్రూ రేట్‌లో చిన్న మార్పుల కోసం మెరుగుదలలు చేయడం. క్లిక్-త్రూ రేట్‌లో స్వల్ప భేదాలు ఉండటం సాధారణం, వాటి కోసం తక్షణ చర్యను తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లిక్-త్రూ రేట్‌లో సంఖ్యాపరంగా గణనీయమైన మార్పు ఉన్నప్పుడు మెరుగుదలలు సహాయపడవచ్చు.
  • ఒకే వీడియోలో అనేక థంబ్‌నెయిల్స్ లేదా టైటిల్స్‌ను పరీక్షించడం. ప్రతి వీడియోను అదే ప్రేక్షకులు చూస్తారని నిర్ధారించుకోవడం కష్టం. క్లిక్-త్రూ రేట్‌లోని వ్యత్యాసాలకు టైటిల్ లేదా థంబ్‌నెయిల్ కాకుండా, ట్రాఫిక్ సోర్స్ అనేది కారణం కావచ్చు.

ఇంప్రెషన్‌ల క్లిక్-త్రూ-రేట్ ఎక్కువ లేదా తక్కువగా ఉందని నాకు ఎలా తెలుస్తుంది?

YouTubeలో రిజిస్టర్ అయిన ఇంప్రెషన్‌ను చూసిన తర్వాత వీక్షకులు ఎంత తరచుగా ఒక వీడియోను చూశారు అన్నదాన్ని ఇంప్రెషన్‌ల క్లిక్-త్రూ-రేట్ కొలుస్తుంది. వెలుపలి వెబ్‌‌సైట్‌లు లేదా ఎండ్ స్క్రీన్‌ల వంటి వాటిలో ఈ కొలమానంలో ఇంప్రెషన్‌లన్నీ లెక్కించబడవు కాబట్టి మీ ఛానెల్ మొత్తం వీక్షణల సబ్‌సెట్‌లను ఇది సూచించే అవకాశముంది.

కంటెంట్ రకం, ప్రేక్షకులు, YouTubeలో ఇంప్రెషన్ ఎక్కడ చూపించబడింది అన్న అంశాల ఆధారంగా ఇంప్రెషన్‌ల క్లిక్-త్రూ-రేట్ మారుతూ ఉంటుంది. హోమ్ పేజీలో, వీక్షణా పేజీలోని "తర్వాత ప్లే అయ్యేది"లో, సెర్చ్ ఫలితాల్లోనైనా, అలాగే సబ్‌స్క్రిప్షన్ ఫీడ్‌లలోనైనా ఇతర వీడియోలతో మీ వీడియో థంబ్‌నెయిల్‌లు ఎల్లప్పుడూ పోటీపడతాయని గుర్తుంచుకోండి.

YouTubeలోని అన్ని ఛానెళ్లు, అలాగే వీడియోల్లోని సగం వాటి ఇంప్రెషన్‌ల CTR 2% నుండి 10% వరకు ఉంటుంది.

కొత్త వీడియోలు లేదా ఛానెళ్లు (వారం లోపలివి వంటివి) లేదా 100 కంటే తక్కువ వీక్షణలు కలిగి ఉన్న వీడియోలకు కూడా విస్తృత పరిధి ఉండవచ్చు. ఒక వీడియో ఎక్కువ ఇంప్రెషన్‌లను పొందితే (ఇది మొదటి పేజీలో కనిపించే తరహాలో), CTR తక్కువగా ఉండడం సహజమైన విషయమే. ఎక్కువ శాతం మీ ఛానెల్ పేజీ వంటి సోర్స్‌ల నుండి పొందే వీడియోలు అధిక రేటు కలిగి ఉండవచ్చు.

అంతిమంగా, సుదీర్ఘ కాలం వీడియోల మధ్య CTRలను సరిపోల్చడం, అలాగే వాటి ట్రాఫిక్ సోర్స్‌లు వాటి CTRలను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవడం ఉత్తమం.

క్లిక్‌బెయిట్ థంబ్‌నెయిల్స్‌ను లేదా టైటిల్స్‌ను ఉపయోగించి మీ CTRను పెంచడానికి ట్రై చేయడం మానుకోండి. వీక్షకులకు వీడియో సందర్భోచితంగా ఉంటే, వీడియో సగటు వీక్షణ వ్యవధి వీక్షకులు ఆసక్తిగా ఉన్నట్లు సూచిస్తే YouTube వారికి వీడియోను సిఫార్సు చేస్తుంది. క్లిక్‌బెయిట్ వీడియోలకు సగటు వీక్షణ వ్యవధి తక్కువ ఉంటుంది కాబట్టి, YouTube ద్వారా సిఫార్సు చేయబడే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ థంబ్‌నెయిల్ అధిక CTRని పొందుతూ, సగటు వీక్షణ వ్యవధి తక్కువ ఉండి, ఆశించిన ఇంప్రెషన్‌ల కంటే తక్కువగా పొందితే, అది క్లిక్‌బెయిట్ అని మీరు చెప్పగలరు. 

నేను ఇంప్రెషన్‌ల కంటే ఎందుకు ఎక్కువ వీక్షణలను కలిగి ఉన్నాను?

మీ వీడియోకు పెద్ద మొత్తంలో ట్రాఫిక్ YouTube వెలుపల నుండి వచ్చినట్లయితే, మీరు ఇంప్రెషన్‌ల కంటే ఎక్కువ వీక్షణలను కలిగి ఉండే అవకాశం ఉంది. వీడియో థంబ్‌నెయిల్‌ను వీక్షకులు చూసే ప్రతి సందర్భం ఒక ఇంప్రెషన్‌గా పరిగణించబడదు, అలాగే అన్ని వీక్షణలు థంబ్‌నెయిల్ ఇంప్రెషన్‌ల నుండి రావు. రిజిస్టర్ అయిన ఇంప్రెషన్‌గా ఏది పరిగణించబడుతుందో తెలుసుకోండి.

క్లిక్-త్రూ రేట్ కొలమానం నా గణాంకాలకు ఎందుకు మ్యాచ్ అవ్వడం లేదు?

క్లిక్-త్రూ రేట్ అనేది పరిగణనలోకి తీసుకున్న ఇంప్రెషన్‌ల నుండి వచ్చిన వీక్షణలపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ వీడియోకు వచ్చిన మొత్తం వీక్షణలను ఇంప్రెషన్‌ల సంఖ్యతో విభజిస్తే, క్లిక్-త్రూ రేట్‌కు సమానమైన సంఖ్యను చూడలేరు. కొన్ని వీక్షణలు థంబ్‌నెయిల్ ఇంప్రెషన్‌ల నుండి రావు.

ఇంప్రెషన్‌లకు, మానిటైజేషన్‌కు మధ్య సంబంధం ఏమిటి?

మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం, వీడియో ఎక్కువ మంది ప్రేక్షకులకు తగినది కాకపోతే, అది వీడియోకు వచ్చే ఇంప్రెషన్‌ల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఈ పరిమితి వల్ల తక్కువ వీక్షణలు, తక్కువ ఆదాయం కూడా రావచ్చు. దీనితో పాటు, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం, వీడియో ఎక్కువ మంది ప్రేక్షకులకు తగినది కాకపోతే, వీడియోను పరిమితం చేయవచ్చు, యాడ్స్ లేకుండా చేయవచ్చు.

గమనిక: ఈ సూచనలు YouTube అంతటా ఉన్న మొత్తం సక్సెస్ రేట్‌లపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ సూచనలను పాటించడం ద్వారా మీ నిర్దిష్ట సందర్భం కోసం ఏదైనా నిర్దిష్ట ఫలితాన్ని పొందుతారని వారు హామీ ఇవ్వలేరు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
892958925613845345
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false