పెయిడ్ మెంబర్‌షిప్ బిల్లింగ్ లేదా యాక్సెస్ సమస్యలను పరిష్కరించండి

మీ పెయిడ్ మెంబర్‌షిప్ తిరస్కరించబడితే, మేము మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము, తద్వారా మీ మెంబర్‌షిప్‌ను మీరు రీస్టోర్ చేసుకోగలరు.

ఈ ఈమెయిల్‌ను అందుకొన్న తర్వాత:

  • ఆ సమస్యను పరిష్కరించడానికి మీకు 3 రోజుల సమయం ఉంటుంది, ఆ లోపు సమస్య పరిష్కారం అవ్వకపోతే, మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు మీరు యాక్సెస్‌ను కోల్పోతారు. ఈ 3 రోజుల వ్యవధిలో, మీ నెలవారీ పేమెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మేము క్రమం తప్పకుండా తిరిగి ట్రై చేస్తూనే ఉంటాము.

  • ఒకవేళ 3 రోజుల తర్వాత కూడా మేము విజయవంతంగా మీకు ఛార్జీ విధించలేకపోతే, మీ సబ్‌స్క్రిప్షన్ "పాజ్ చేయబడింది" స్టేటస్‌కు మారుతుంది, ఈ స్టేటస్ 30 రోజుల పాటు ఉంటుంది. ఈ పాజ్ చేయబడిన స్టేటస్‌లో ఉన్నప్పుడు, మీ సబ్‌స్క్రిప్షన్‌ను మీరు రద్దు చేసుకుంటే తప్ప, మీ మెంబర్‌షిప్ యాక్సెస్‌ను రీస్టోర్ చేయడం కోసం, పేమెంట్‌ను ప్రాసెస్ చేయడానికి మేము క్రమం తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటాము.

ఈ సమయంలో మీ పేమెంట్ సమాచారాన్ని మీరు అప్‌డేట్ చేస్తే, మీ పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీ విధించడానికి మేము చేసే తదుపరి ప్రయత్నంలో, మీ మెంబర్‌షిప్ ఆటోమేటిక్‌గా రీస్టోర్ అవుతుంది. సిస్టమ్ తిరిగి ట్రై చేసే దాకా వేచి ఉండాలని మీకు లేకపోతే, యాక్సెస్‌ను వెంటనే పొందడానికి, మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకొని, మళ్లీ సైన్ అప్ చేయవచ్చు.

Premium మెంబర్‌షిప్‌కు సంబంధించిన బిల్లింగ్ సమస్యలను పరిష్కరించండి

పెయిడ్ మెంబర్‌షిప్ కోసం మీకు ఛార్జీ విధించబడిందని మీరు భావిస్తే, కానీ మీరు సంబంధిత ప్రయోజనాలను యాక్సెస్ చేయలేకపోతున్నట్లయితే, ఈ ఆర్టికల్‌ను చూడండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

మీ YouTube బిల్లుకు సంబంధించిన పరిష్కారం కోసం లేదా దాని గురించి తెలుసుకోవడానికి కింది బటన్‌ను నొక్కండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

పెయిడ్ మెంబర్‌షిప్ కోసం మీరు చేసిన పేమెంట్ తిరస్కరించబడితే, మీ పేమెంట్ ఆప్షన్‌లో ఏదైనా సమస్య ఉండవచ్చు, దాన్ని పరిష్కరిస్తే అంతా సెట్ అయిపోవచ్చు. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దానికి సంబంధించి మేము అందించిన చిట్కాలను ఈ కింద చూడండి.

తిరస్కరించబడిన పేమెంట్‌ను పరిష్కరించండి

మీ కార్డ్ లేదా ఇతర పేమెంట్ ఆప్షన్‌లో ఉన్న సమస్య కారణంగా మీ నెలవారీ మెంబర్‌షిప్ పేమెంట్ తిరస్కరించబడి ఉండవచ్చు. ఏవైనా పేమెంట్ సమస్యలు ఉంటే, వాటిని మీరు పరిష్కరించిన తర్వాత, సిస్టమ్ ఆటోమేటిక్‌గా మీకు మళ్లీ ఛార్జీని విధించి, మీ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు మీ యాక్సెస్‌ను రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది.

మీ కార్డ్ సమాచారం అప్‌డేట్ అయ్యి ఉందని నిర్ధారించుకోండి

ఇప్పుడే అప్‌డేట్ చేయండి                

పేమెంట్‌లు ఎక్కువగా, గడువు ముగిసిన క్రెడిట్ కార్డ్ లేదా తప్పు బిల్లింగ్ అడ్రస్ వలన విఫలం అవుతుంటాయి. ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి:

  1. మీరు కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంటే, youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి. మీరు YouTube మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తుంటే, మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. "ప్రస్తుత పేమెంట్ ఆప్షన్‌ను ప్రాసెస్ చేయడం సాధ్యపడలేదు" మెసేజ్‌కు పక్కన ఉండే ను క్లిక్ చేయండి.
  3. పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

గడువు ముగింపు తేదీతో సహా మీ కార్డ్ సమాచారం అంతా సరిగ్గానే ఉందని నిర్ధారించుకోవడానికి, దాన్ని ఒకసారి చెక్ చేయవలసిందిగా సిఫార్సు చేస్తున్నాము. మీ పేమెంట్ ఆప్షన్‌కు లిస్ట్ చేయబడి ఉన్న జిప్ కోడ్ కూడా మీ కార్డ్‌కు సంబంధించిన ప్రస్తుత బిల్లింగ్ అడ్రస్‌లోని జిప్ కోడ్‌కు మ్యాచ్ అవ్వాలి.

ఫైల్‌లోని మీ పేమెంట్ ఆప్షన్‌ను ఇప్పుడు ఉపయోగించడం కుదరకపోతే, ఒక పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి లేదా మరొక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: "పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయడానికి" మీకు ఆప్షన్ కనిపించకపోతే, మీరు దాన్ని Google Pay సబ్‌స్క్రిప్షన్‌లు & సర్వీస్‌ల పేజీ నుండి కూడా అప్‌డేట్ చేయవచ్చు.

రిక్వెస్ట్ చేయబడిన ఏదైనా సమాచారాన్ని సమర్పించండి

Googleకు మరింత సమాచారాన్ని సమర్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేసే ఎర్రర్ మెసేజ్ మీకు కనిపిస్తే, ఆ వివరాలను సమర్పించడానికి సూచనలను ఫాలో అవ్వండి. ఉదాహరణకు, మీ Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేయడానికి ముందు, మీరు Google Payలో మీ గుర్తింపును వెరిఫై చేయాల్సి రావచ్చు.

ఖాతా సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లు లేదా వాటిని పరిష్కరించమని వచ్చే రిక్వెస్ట్‌ల కోసం ఏ సమయంలో అయినా మీరు Google Payని కూడా చెక్ చేయవచ్చు.

కొనుగోలు చేయడానికి మీ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయో లేదో చెక్ చేయండి

తగినన్ని నిధులు లేకపోవడం వల్ల కొన్నిసార్లు లావాదేవీలు తిరస్కరించబడుతుంటాయి. కొనుగోలును పూర్తి చేయడానికి మీ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ ఖాతాను చెక్ చేయండి.

మీ బ్యాంక్‌ను లేదా కార్డ్ జారీ చేసిన సంస్థను సంప్రదించండి

మీ కార్డ్‌కు నిర్దిష్ట పరిమితులు ఉండవచ్చు, అందువల్లే మీ పేమెంట్ విఫలం అయ్యి ఉండవచ్చు. విఫలమైన లావాదేవీ గురించి అడగడానికి, బ్యాంక్‌ను లేదా మీ కార్డ్‌ను జారీ చేసిన కంపెనీని సంప్రదించండి.

వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించి పే చేయడానికి ట్రై చేయండి 

ఇప్పుడే అప్‌డేట్ చేయండి

ఈ దశలను ఫాలో అయ్యి, మీరు మరొక పేమెంట్ ఆప్షన్‌కు మారడానికి ట్రై చేయవచ్చు:

  1. మీరు కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంటే, youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి. మీరు YouTube మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తుంటే, మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. "ప్రస్తుత పేమెంట్ ఆప్షన్‌ను ప్రాసెస్ చేయడం సాధ్యపడలేదు" మెసేజ్‌కు పక్కన ఉండే చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  3. పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. వేరే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఛార్జీ విధించబడిన తర్వాత, ప్రయోజనాలను యాక్సెస్ చేయడంలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

ఏదైనా కొనుగోలు చేశాక, ఆ కొనుగోలు చేసిన దాన్ని మీరు యాక్సెస్ చేయలేకపోతే, ఆ ఛార్జీ ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉండటం అనేది అందుకు కారణం కావచ్చు. ఛార్జీ తిరస్కరించబడటం కూడా మీరు యాక్సెస్ చేయలేకపోవడానికి కారణం కావచ్చు.

ప్రామాణీకరణ నిలుపుదలలు, పెండింగ్‌లో ఉన్న లావాదేవీల గురించి సమాచారం

Google Payలో లేదా మీ కార్డ్ స్టేట్‌మెంట్‌లో, పెండింగ్‌లో ఏవైనా ఛార్జీలు ఉంటే, వాటిని ఇంకా ప్రాసెస్ అవ్వని ప్రామాణీకరణ నిలుపుదలలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకే సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన పేమెంట్ విషయంలో, పెండింగ్‌లో పలు ఛార్జీలు ఉన్నట్లు మీకు కనిపించే అవకాశం ఉంది, పెండింగ్‌లో ఉన్న ఒక్కో ఛార్జీ, ఒక్కో ప్రామాణీకరణ ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఏ ఛార్జీ అయినా ప్రాసెస్ చేయబడింది అని కాకుండా "పెండింగ్‌లో ఉంది" అని ఉంటే, అది మీకు ఛార్జీ చేయబడలేదని అర్థం, అలాగే ఏదైనా పేమెంట్ విషయంలో కార్డ్ ప్రామాణీకరణ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైతే, అవి మీ స్టేట్‌మెంట్‌ల నుండి ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి, వాటికి మీకు బిల్ చేయడం జరగదు.

పెండింగ్‌లో ఉన్న ఛార్జీని ఎలా చెక్ చేయాలి

  • మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌ను లేదా Google Payని చెక్ చేయండి. మీరు Google Payలో లావాదేవీని క్లిక్ చేస్తే, సదరు కొనుగోలు, పూర్తయింది అని కాకుండా "పెండింగ్‌లో ఉంది" అని లిస్ట్ చేయబడి ఉన్నట్లు మీకు కనిపిస్తుంది.
  • ఈమెయిల్ ద్వారా అందిన రసీదు కోసం సెర్చ్ చేయండి. ఏదైనా ఛార్జీ ప్రాసెస్ అయితే, మీకు YouTube నుండి ఈమెయిల్ ద్వారా ఒక రసీదు అందుతుంది.
  • ఖాతా సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లు లేదా వాటిని పరిష్కరించమని వచ్చే రిక్వెస్ట్‌ల కోసం ఏ సమయంలో అయినా మీరు Google Payని కూడా చెక్ చేయవచ్చు. ఉదాహరణకు, మీ Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేయడానికి ముందు, మీరు Google Payలో మీ గుర్తింపును వెరిఫై చేయాల్సి రావచ్చు. Google Payలో ఏ అలర్ట్‌లూ లేకపోతే, పెండింగ్‌లో ఉన్న ఈ ఛార్జీ 1-14 పని దినాల లోపు ప్రాసెస్ అయిపోతుంది, లేదా పేమెంట్ తిరస్కరించబడితే, అది కనిపించడం ఆగిపోతుంది. ఈ సమయం తర్వాత కూడా మీకు ఛార్జీ పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే, మీ పేమెంట్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

తిరస్కరించబడిన ఛార్జీని ఎలా చెక్ చేయాలి

మీ కొనుగోలుకు సంబంధించిన స్టేటస్‌ను మీరు Google Payలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. Google Payలో లావాదేవీ స్టేటస్ మీకు "తిరస్కరించబడింది" అని కనిపిస్తుంది. తిరస్కరించబడిన పేమెంట్‌ను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవడానికి, పైన ఉన్న విభాగంలో మేము అందించిన చిట్కాలను చూడండి.
మీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లో ఇప్పటికీ "పెండింగ్‌లో ఉంది" అని కనిపిస్తుంటే, 1-14 పని దినాల లోపు ఈ ఛార్జీ ప్రాసెస్ అయిపోతుంది, లేదా తిరస్కరించబడితే, అది కనిపించడం ఆగిపోతుంది. ఈ సమయం తర్వాత కూడా మీకు ఛార్జీ పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తే, మీ పేమెంట్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15947840061139044367
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false