మీ మొబైల్ ప్రొవైడర్ (డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్) ద్వారా పేమెంట్ చేయడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

మీ మొబైల్ ఫోన్ క్యారియర్ ద్వారా బిల్లు పేమెంట్ చేసిన కొనుగోలుతో మీకు సమస్య ఉన్నట్లయితే, ఈ పరిష్కార ప్రక్రియ చిట్కాలను ట్రై చేయండి.

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్‌ను మొదటిసారి ఉపయోగించే కస్టమర్‌ల కోసం చిట్కాలు

క్యారియర్ బిల్లింగ్‌ను ఉపయోగించి కొనుగోలు చేయడంలో మీకు సమస్య ఉంటే, మీరు కింది వాటిని నిర్ధారించడం ద్వారా ప్రారంభించాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము:

  • మీరు YouTubeలో క్యారియర్ బిల్లింగ్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అయితే, మీ క్యారియర్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ మీరు అయ్యి ఉన్నారని నిర్ధారించుకోండి.
  • మొబైల్ బ్రౌజర్ లేదా కంప్యూటర్‌ను కాకుండా, మీరు YouTube యాప్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

అలాగే, మీ పరికరాన్ని మీరు ఆఫ్ చేసి, కొన్ని సెకన్లు వేచి ఉండి, ఆపై దాన్ని తిరిగి ఆన్ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. మీ పరికరాన్ని ఆన్ చేసిన తర్వాత, కొనుగోలు చేయడానికి మళ్లీ ప్రయత్నించండి.

అదనపు పరిష్కార ప్రక్రియ చిట్కాలు

మీరు ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే:

  • మీరు వ్యక్తిగత ఖాతాను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. కొన్ని కంపెనీలు కార్పొరేట్ ఖాతాలలో క్యారియర్ బిల్లింగ్‌ను బ్లాక్ చేయవచ్చు.
  • మీరు నిర్వాహక పరికరాన్ని ఉపయోగించడం లేదని నిర్ధారించుకోండి.
  • మీరు రెండు SIM కార్డ్‌లు ఉన్న పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, సరైన SIM కార్డ్‌ను 1వ స్లాట్‌లో ఉంచి, 2వ స్లాట్ ఖాళీగా ఉండేలా చూసుకోండి.

మీ క్యారియర్ సెట్టింగ్‌లను చెక్ చేయండి

పైన అందించిన చిట్కాలు ఏవీ మీ సమస్యను పరిష్కరించలేకపోతే, కొన్ని క్యారియర్ సెట్టింగ్‌లు మీ సర్వీస్‌ను ప్రభావితం చేస్తుండవచ్చు. మీ క్యారియర్‌ను సంప్రదించి, వీటిని నిర్ధారించుకోండి:

  • నెలవారీ ఖర్చుల అమౌంట్ లేదా ఒక్కో కొనుగోలుకు పేమెంట్ చేసే అమౌంట్‌పై మీ క్యారియర్ విధించిన ఏవైనా పరిమితులను మీరు చేరుకోలేదని నిర్ధారించుకోండి (ఈ పరిమితులను చేరుకున్నప్పుడు, ఈ బిల్లింగ్ ఆప్షన్ కనిపించదు).
  • మీరు ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, కొనుగోలు మొత్తం కోసం మీ వద్ద తగినంత బ్యాలెన్స్ ఉందని నిర్ధారించుకోండి.
  • మీ పరికరం, అలాగే సర్వీస్ ప్లాన్, ప్రీమియం కంటెంట్ కొనుగోళ్లను అనుమతిస్తాయని నిర్ధారించుకోండి.
  • మీ పరికరం మొబైల్ ఫోన్ బిల్లింగ్‌ను ఉపయోగించగలదని నిర్ధారించుకోండి.

మీరు ఈ సూచనలను ట్రై చేసిన తర్వాత కూడా, ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మరింత సహాయం కోసం మీ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

మొబైల్ ఫోన్ క్యారియర్ ద్వారా బిల్లింగ్ చేయబడిన ప్రస్తుత మెంబర్‌షిప్‌లకు సంబంధించిన చిట్కాలు

జనవరి 24, 2023 నాటికి, కెనడాలో రిపీట్ అయ్యే పెయిడ్ మెంబర్‌షిప్‌ల కోసం Rogers Communications అనేది ఇకపై ఆమోదించబడిన పేమెంట్ ఆప్షన్‌గా ఉండదు. మీరు YouTube Premium, YouTube Music Premium కోసం లేదా ఛానెల్ మెంబర్‌షిప్ కోసం Rogers Communications ద్వారా సైన్ అప్ చేసినట్లయితే, ఆమోదించబడిన పేమెంట్ ఆప్షన్‌లలో ఒక దానికి మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయండి.

YouTube పెయిడ్ మెంబర్‌షిప్ కోసం పేమెంట్ చేయడానికి మీరు డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్‌ను ఉపయోగిస్తూ, పేమెంట్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీ క్యారియర్‌ను సంప్రదించి, పేమెంట్ తిరస్కరణకు గల కారణాన్ని తెలుసుకోండి. మీ ఖాతాతో ఏదైనా సమస్య ఉండవచ్చు, ఉదాహరణకు, ఖర్చు పరిమితిని మించిపోవడం.

మీ క్యారియర్ ఖాతాతో ఎటువంటి సమస్య లేకపోతే, దాన్ని పేమెంట్ ఆప్షన్‌గా తీసివేసి, మళ్లీ జోడించేందుకు ట్రై చేయండి:

  1. Google Payలో మీ పేమెంట్ ఆప్షన్‌ల పేజీకి వెళ్లి, మీ క్యారియర్ బిల్లింగ్ పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయండి. గమనిక: ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మెంబర్‌షిప్‌ల కోసం మీరు క్యారియర్ బిల్లింగ్‌ను పేమెంట్ ఆప్షన్‌గా ఉపయోగిస్తున్నట్లయితే, మీ ఖాతా నుండి క్యారియర్ బిల్లింగ్‌ను తీసివేయడం సాధ్యపడదు.
  2. YouTube యాప్‌నకు వెళ్లి, మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లను ట్యాప్ చేసి, మళ్లీ సైన్ అప్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

క్యారియర్ బిల్లింగ్‌ను తిరిగి జోడించడంలో మీకు సమస్యలు ఎదురైతే, మొదటిసారి ఉపయోగిస్తున్న యూజర్‌ల కోసం పైన అందించిన పరిష్కార ప్రక్రియ చిట్కాలను ట్రై చేయండి.

ఈ చిట్కాలు సహాయపడకపోతే, మరింత సహాయం కోసం దయచేసి మీ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14726956271039957371
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false