YouTube నుండి ఊహించని బిల్లింగ్ ఛార్జీలు విధించబడటాన్ని అర్థం చేసుకోండి

ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతాలో YouTube నుండి మీకు ఊహించని ఛార్జీ (“GOOGLE*YouTube”గా చూపబడుతుంది) విధించబడి ఉండటాన్ని మీరు గమనించినట్లయితే, అందుకు గల కారణం ఏమిటనే దాని గురించి ఈ దిగువున చదవండి.


YouTubeలో విధించబడే ఊహించని ఛార్జీలతో ఎలా డీల్ చేయాలి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

నాకు మరీ ఎక్కువ ఛార్జీ విధించబడింది

  • ట్యాక్స్ రేటుకు సర్దుబాటు: మీ పెయిడ్ మెంబర్‌షిప్‌నకు సంబంధించి వర్తించే ట్యాక్స్ రేట్‌లలో చోటుచేసుకునే మార్పుల వలన మీ నెలవారీ బిల్లింగ్ ఛార్జీలో మీకు చిన్నపాటి హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. YouTubeలో చేసిన కొనుగోళ్లకు విధించబడే పన్ను, మీరు నివసిస్తున్న లొకేషన్‌లో ఉండే పన్ను చట్టాలను ఆధారంగా చేసుకొని నిర్ణయించబడుతుంది, అలాగే స్థానిక పన్ను అవసరాలకు అనుగుణంగా అది ఎప్పటికప్పుడు మారుతూ ఉండవచ్చు. మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు, అలాగే వర్తించబడిన పన్నుతో సహా మీ లావాదేవీలకు సంబంధించిన రసీదులను Google Payలో మీరు కనుగొనవచ్చు.

  • మీరు ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నారు: మీరు ఇటీవల ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, మీ నెలవారీ బిల్లింగ్ ఛార్జీ, వ్యక్తిగత ఫ్లాన్ ఉన్నప్పుడు ఎంత ఉండేదో, అంత కంటే ఎక్కువగా ఉంటుంది. మీ ప్లాన్ స్టేటస్‌ను, అలాగే ఛార్జీలను చూడటానికి http://youtube.com/purchases లింక్‌కు వెళ్లండి.

  • ఫీజులు: మీ లొకేషన్‌ను బట్టి, అంతర్జాతీయ లావాదేవీలకు మీ బ్యాంక్ లేదా కార్డ్ కంపెనీ ఫీజులు వసూలు చేయవచ్చు. అదనంగా, మీ లోకల్ కరెన్సీ, అలాగే USD మధ్య మార్పిడి కారణంగా మొత్తం ఎమౌంట్‌లో మార్పులు చోటుచేసుకోవచ్చు.

  • ప్రామాణీకరణ నిలుపుదలలు: అప్పుడప్పుడూ మీకు ప్రామాణీకరణ నిలుపుదల కనిపించవచ్చు, ఈ అమౌంట్, మీ నెలవారీ బిల్లింగ్ ఛార్జీకి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ ప్రామాణీకరణలు, కార్డ్ చెల్లుబాటు అయిందా లేదా అని నిర్ధారించే వీలును, అలాగే కొనుగోలు చేయడానికి మీ ఖాతాలో తగినన్ని నిధులు ఉన్నాయో లేదో చెక్ చేసే వీలును YouTubeకు కల్పిస్తాయి - కానీ ఇవి నిజంగా విధించబడిన ఛార్జీలు కాదు. ప్రామాణీకరణ నిలుపుదలల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

మీరు http://youtube.com/purchases‌ లింక్‌లో, మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌లకు సంబంధించిన బిల్లింగ్ ఛార్జీలను చూడవచ్చు.

విద్యార్థి మెంబర్‌షిప్‌లకు సంబంధించిన YouTube Premium ధరలో ఎర్రర్: సాంకేతిక సమస్య కారణంగా, రిపీట్ అయ్యే విద్యార్థి మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేసిన కొంతమంది YouTube Premium మెంబర్‌లకు అధిక ఛార్జీ విధించబడింది. మేము బాధిత మెంబర్‌లందరికీ రీఫండ్‌లను పంపడాన్ని ప్రారంభించాము. మీరు విద్యార్థి అయ్యుండి, మీ Premium సబ్‌స్క్రిప్షన్‌ను డిస్కౌంట్ తర్వాతి ధరతో కొనసాగించాలనుకుంటే, మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే ముందే మీ ప్రస్తుత ఎన్‌రోల్‌మెంట్‌ను నిర్ధారించేలా చూసుకోండి. అలా చేయడానికి, మేము మీ ఖాతాకు పంపిన ఈమెయిల్‌లో ఉన్న “ఇప్పుడే నిర్ధారించండి” బటన్‌ను క్లిక్ చేయండి.

నేను వినిగియోగించుకున్న 'ట్రయల్‌'కు ఛార్జీ విధించబడింది

మీకు అర్హత లేనట్లయితే, మీరు ట్రయల్ కోసం సైన్ అప్ చేసిన తర్వాత, మీకు ఛార్జీ విధించబడిన విషయాన్ని మీరు చూడవచ్చు. YouTube Premium, Music Premium, ఇంకా Google Play Musicకు మొదటిసారిగా సైన్ అప్ చేసే సబ్‌స్క్రయిబర్‌లకు మాత్రమే ట్రయల్స్‌కు అర్హత ఉంటుంది.

మీరు ట్రయల్ కోసం మొదటిసారిగా సైన్ అప్ చేస్తున్నట్లయితే, మీకు కనిపించేది ప్రామాణీకరణ నిలుపుదల అయ్యుండవచ్చు, ఛార్జీ కాదు. ఈ ప్రామాణీకరణలు, కార్డ్ చెల్లుబాటు అయ్యిందా లేదా అని నిర్ధారించే వీలును, అలాగే మీ ట్రయల్ పీరియడ్ ముగిశాక, కొనుగోలు చేయడానికి మీ ఖాతాలో తగినన్ని నిధులు ఉన్నాయో లేదో చెక్ చేసే వీలును YouTubeకు కల్పిస్తాయి. ప్రామాణీకరణ నిలుపుదలల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

నాకు పలు సార్లు ఛార్జీ విధించబడింది

YouTube నుండి పలు ఛార్జీలు విధించబడి ఉండటం మీరు చూడటానికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో ప్రధానమైనవి ఇక్కడ పేర్కొనబడ్డాయి:

  • మీ ఖాతాతో మీకు ఒకటి కంటే ఎక్కువ మెంబర్‌షిప్‌లు ఉన్నాయి: మీరు పొరపాటున ఓవర్‌ల్యాప్ అయ్యే పెయిడ్ మెంబర్‌షిప్‌లకు సైన్ అప్ చేశారేమో తెలుసుకోవడానికి, ఈ సాధారణ డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్ సందర్భాలను చూడండి.

  • మీరు వేరే Google సబ్‌స్క్రిప్షన్‌కు లేదా సర్వీస్‌కు సంబంధించిన ఛార్జీని చూస్తుండవచ్చు: ఛార్జీలోని వివరాలను నిర్ధారించుకోవడానికి, అలాగే ఆ ఛార్జీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు సంబంధించినదే అని వెరిఫై చేయడానికి, మీ Google Pay ఖాతాలోని "యాక్టివిటీ"ని చెక్ చేయండి.

  • YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌తో మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. మీరు గానీ లేదా మీ ఖాతాకు యాక్సెస్ ఉన్న వేరెవరైనా గానీ, మరొక ఈమెయిల్ అడ్రస్, పరికరం, లేదా బిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి సైన్ అప్ చేసి ఉండవచ్చు. ఇతర Google ఖాతాల కోసం చెక్ చేయడానికి:
    1. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి.
    2. ఖాతాను మార్చండిని క్లిక్ చేయండి.
    3. మీరు ప్రస్తుతం ఏ ఖాతాతో అయితే సైన్ ఇన్ చేశారో, ఆ ఖాతాకు పక్కన మీకు ఒక ఎంపిక గుర్తు కనిపిస్తుంది. మీకు చెందిన మరొక ఖాతా అక్కడ మీకు కనిపించినట్లయితే, ఆ ఖాతాకు మారడానికి దాని మీద ట్యాప్ చేయండి.
    4. http://youtube.com/purchases లింక్‌కు వెళ్లి, మీకు చెందిన ఆ ఇతర ఖాతా, పెయిడ్ మెంబర్‌షిప్ కోసం సైన్ అప్ చేయబడి ఉందో లేదో చెక్ చేయండి. మీకు ఇంకే ఇతర ఖాతాలూ కనిపించకపోతే, మీరు ఏ సమయంలోనైనా మీకు చెందిన ఇతర Google ఖాతాలను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేసి, యాక్టివ్ మెంబర్‌షిప్‌ల కోసం చెక్ చేయవచ్చు.
  • మీరు ప్రామాణీకరణ నిలుపుదలను గానీ లేదా "పెండింగ్"లో ఉన్న ఛార్జీని కానీ చూస్తుండవచ్చు: ఈ ప్రామాణీకరణలు, కార్డ్ చెల్లుబాటు అయ్యిందా లేదా అని నిర్ధారించే వీలును, అలాగే కొనుగోలు చేయడానికి మీ ఖాతాలో తగినన్ని నిధులు ఉన్నాయో లేదో చెక్ చేసే వీలును YouTubeకు కల్పిస్తాయి - కానీ ఇవి నిజంగా విధించబడిన ఛార్జీలు కాదు. ప్రామాణీకరణ నిలుపుదలల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

నేను చేయని లావాదేవీకి నాకు ఛార్జీ విధించబడింది

మీ ఖాతాకు విధించబడిన ఛార్జీని మీరు గుర్తించలేకపోయినట్లయితే, అనధికార ఛార్జీ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి, ఈ సూచించబడిన తర్వాతి దశలు, సూచనలను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6083179253298727760
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false