మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

YouTube Premium, YouTube Music Premium, లేదా ఛానెల్ మెంబర్‌షిప్‌నకు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకోవడంలో మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా? మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకోవడం ఎలా అనే దాని గురించి లేదా దాన్ని మీరు రద్దు చేశారని వెరిఫై చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఈ సూచనలను చూడండి.

రద్దు చేసుకొనేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతుంటే ఏం చేయాలి

మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకోవడానికి సంబంధించిన దశల వలన మీ సమస్య పరిష్కారం అవ్వకపోతే, మీరు ఈ కింద పేర్కొన్న కొన్నింటిని ట్రై చేయవచ్చు:

  • మీ వెబ్ బ్రౌజర్‌ను రీలోడ్ చేసి లేదా మీ యాప్‌ను రీస్టార్ట్ చేసి మళ్లీ రద్దు చేయడానికి ట్రై చేయండి.
  • మీ కంప్యూటర్‌లో వేరే బ్రౌజర్‌లో గానీ లేదా అజ్ఞాత విండోలో గానీ ట్రై చేయండి.
  • మీ ఖాతాకు మరొక పరికరంలో లాగిన్ అయ్యి, రద్దు చేయడానికి ట్రై చేయండి.

మీరు విజయవంతంగా రద్దు చేసుకున్నారని వెరిఫై చేయడం ఎలా

మీ మెంబర్‌షిప్‌ను మీరు రద్దు చేసుకున్నారని, ఇక్కడ అందించబడిన కొన్ని మార్గాల ద్వారా నిర్ధారించుకోవచ్చు:

  • నోటిఫికేషన్, ఇంకా ఈమెయిల్ కోసం సెర్చ్ చేయండి: మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను మీరు రద్దు చేసుకొన్న వెంటనే, ఆ రద్దు చర్యను నిర్ధారిస్తూ YouTube మొబైల్ యాప్‌లో గానీ లేదా మీ కంప్యూటర్‌లో గానీ మీకు ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. రద్దు చేసుకొన్న వెంటనే, మీ ఖాతాకు అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌కు ఆ రద్దుకు సంబంధించిన నిర్ధారణ ఈమెయిల్ కూడా వస్తుంది. మీ రద్దుకు సంబంధించిన నిర్ధారణ కోసం “@youtube.com”తో ముగిసే ఈమెయిల్స్ కోసం మీ ఇన్‌బాక్స్‌ను సెర్చ్ చేయండి. 
  • పెయిడ్ మెంబర్‌షిప్‌ల హబ్‌ను చెక్ చేయండి: మీ మెంబర్‌షిప్‌నకు, అలాగే ప్రయోజనాలకు ముగింపు తేదీ ఏమైనా లిస్ట్ చేసి ఉందేమో చూడటానికి youtube.com/purchases లింక్‌కు వెళ్లండి. అక్కడ కనిపించే తేదీ, మీ బిల్లింగ్ కాల వ్యవధికి ఆఖరి తేదీ, అదే రోజున మీ ప్రయోజనాలు కూడా ముగిసిపోతాయి. మీ ప్రయోజనాలు ఎప్పుడు ముగుస్తాయి అని సూచించే తేదీ మీకు కనిపించకపోతే, దయచేసి రద్దు చేయడానికి దశలను ఫాలో అయ్యి, ఆ తర్వాత మళ్లీ చెక్ చేయండి.

రద్దు చేసుకొన్న తర్వాత మీకు ఛార్జీ కనిపిస్తే ఏం చేయాలి

రద్దు చేసుకొన్న తర్వాత, ఈ కింద పేర్కొన్న కారణాల వలన మీకు ఛార్జీలు కనిపించడం కొనసాగవచ్చు:

  • మీరు వేరే Google సబ్‌స్క్రిప్షన్‌కు లేదా సర్వీస్‌కు సంబంధించిన ఛార్జీని చూస్తుండవచ్చు: ఛార్జీలోని వివరాలను నిర్ధారించుకోవడానికి, అలాగే ఆ ఛార్జీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు సంబంధించినదే అని వెరిఫై చేయడానికి, మీ Google పేమెంట్‌ల కేంద్రంలోని ‘యాక్టివిటీ’ని చెక్ చేయండి.
  • మీ మెంబర్‌షిప్ పొరపాటున రీ-యాక్టివేట్ చేయబడింది. మీరు గానీ లేదా మీ ఖాతాకు యాక్సెస్ ఉన్న వేరెవరైనా గానీ, youtube.com/purchases లింక్‌లో మీ మెంబర్‌షిప్‌ను పొరపాటున రీ-యాక్టివేట్ చేసి ఉండవచ్చు. మీకు యాక్టివ్ మెంబర్‌షిప్ ఉందేమో చూడటానికి ఆ పేజీకి వెళ్లండి, ఒకవేళ ఉంటే, రద్దు చేయడానికి సంబంధించిన దశలను ఫాలో అవ్వండి.
  • YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌తో మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. మీరు గానీ లేదా మీ ఖాతాకు యాక్సెస్ ఉన్న వేరెవరైనా గానీ, మరొక ఈమెయిల్ అడ్రస్, పరికరం, లేదా బిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి సైన్ అప్ చేసి ఉండవచ్చు. ఇతర Google ఖాతాల కోసం చెక్ చేయడానికి:
    1. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి.
    2. ఖాతాను మార్చండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    3. మీరు ప్రస్తుతం ఏ ఖాతాతో అయితే సైన్ ఇన్ చేసి ఉన్నారో, ఆ ఖాతాకు పక్కన మీకు ఒక ఎంపిక గుర్తు కనిపిస్తుంది. మీకు చెందిన మరొక ఖాతా అక్కడ మీకు కనిపించినట్లయితే, ఆ ఖాతాకు మారడానికి దాని మీద ట్యాప్ చేయండి.
    4. youtube.com/purchases లింక్‌కు వెళ్లి, మీకు చెందిన ఆ ఇతర ఖాతా, పెయిడ్ మెంబర్‌షిప్ కోసం సైన్ అప్ చేయబడి ఉందో లేదో చెక్ చేయండి. మీకు ఇంకే ఇతర ఖాతాలూ కనిపించకపోతే, మీరు ఏ సమయంలోనైనా మీకు చెందిన ఇతర Google ఖాతాలను ఉపయోగించి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేసి, యాక్టివ్ మెంబర్‌షిప్‌ల కోసం చెక్ చేయవచ్చు
  • మీ ఖాతాతో మీకు ఒకటి కంటే ఎక్కువ మెంబర్‌షిప్‌లు ఉన్నాయి. మీరు పొరపాటున ఓవర్‌ల్యాప్ అయ్యే పెయిడ్ మెంబర్‌షిప్‌లకు సైన్ అప్ చేశారేమో తెలుసుకోవడానికి, ఈ సాధారణ డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్ సందర్భాలను చూడండి.
  • మీరు iPhone లేదా iPad ద్వారా సైన్ అప్ చేసి ఉంటే, మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు మీకు Apple ద్వారా బిల్ చేయడం జరుగుతుంది. Appleకు స్వంతంగా రద్దు, ఇంకా బిల్లింగ్ పాలసీ ఉంది, అది YouTubeకు చెందిన పాలసీకి భిన్నంగా ఉండవచ్చు. మీ మెంబర్‌షిప్‌నకు సంబంధించిన వివరాల కోసం, ఇంకా రద్దును వెరిఫై చేసుకోవడం కోసం Apple సపోర్ట్‌ను సంప్రదించండి.

మీరు రద్దు చేసుకొన్న తర్వాత ఏం జరుగుతుంది

మీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసేంత వరకు, మీ ప్రయోజనాలకు మీకు ఉన్న యాక్సెస్ అలాగే కొనసాగుతుంది. మీ బిల్లింగ్ కాల వ్యవధిలో మీరు ఎప్పుడు రద్దు చేసుకున్నారు అనే దానితో సంబంధం లేకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న మీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసేంత వరకు, మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు మీకు యాక్సెస్ ఉంటుంది. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లి, మీ మెంబర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలను, అలాగే మీ బిల్లింగ్ కాల వ్యవధి ఆఖరి రోజును మీరు చూడవచ్చు.

 

గమనిక: 2022 నుండి, Androidలో సైన్ అప్ చేసిన కొత్త YouTube Premium, Music Premium సబ్‌స్క్రయిబర్‌లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారిని ఈ మార్పు ప్రభావితం చేయదు. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు payments.google.com‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
కంప్యూటర్ Android
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16132080663580367458
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false