అనుమతి లేని ఛార్జీని రిపోర్ట్ చేయండి

YouTubeలో మీరు చేయని డిజిటల్ కొనుగోలుకు మీ కార్డ్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఛార్జీ విధించబడినట్లు మీరు గమనించినట్లయితే, లావాదేవీ జరిగిన 120 రోజుల లోపు మీరు ఆ ఛార్జీలను మా సపోర్ట్ టీమ్‌కు రిపోర్ట్ చేయవచ్చు.

1వ దశ: YouTube ఛార్జీలను గుర్తించండి

అన్ని YouTube కొనుగోళ్లు మీ స్టేట్‌మెంట్‌లో GOOGLE*YouTube [service name]గా కనిపిస్తాయి. ఉదాహరణకు, YouTube TV ఛార్జీ GOOGLE*YouTube TVగా కనిపిస్తుంది.

సందేహాస్పద ఛార్జీ ఈ ఫార్మాట్‌లలో ఒక దాని మాదిరిగా లేకపోతే, అది YouTubeకు సంబంధించిన చార్జీ కాదు. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్‌ను లేదా కార్డ్ జారీ చేసిన సంస్థను సంప్రదించండి.

2వ దశ: మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో చెక్ చేయండి

మీరు YouTube లావాదేవీని గుర్తించలేకపోతే, ఒకవేళ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కింది విధంగా చేశారేమో అని చెక్ చేయండి:

  • వారు కొనుగోలు చేశారా లేదా అని చెక్ చేయండి, లేదా
  • చిన్నారి అనుకోకుండా ఛార్జీ‌లకు దారితీసే గేమ్‌ను ఆడి ఉండవచ్చు

ఛార్జీ అనేది అనుమతి లేకుండా, అనుకోకుండా విధించబడింది, కానీ మోసపూరిత చర్య కాదని మీరు కనుగొంటే, రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయండి.

3వ దశ: మీ క్లెయిమ్‌ను ఫైల్ చేసి, ట్రాక్ చేయండి

ఛార్జ్ YouTubeకు సంబంధించినదని, దాన్ని మీకు తెలిసిన వారు ఎవరూ చేయలేదని మీరు నిర్ధారించుకున్న తర్వాత, లావాదేవీ జరిగిన 120 రోజుల లోపు ఆ ఛార్జీలను మా సపోర్ట్ టీమ్‌కు రిపోర్ట్ చేయండి. మీ క్లెయిమ్‌ను కనుగొనడానికి, మీరు క్లెయిమ్‌ను సమర్పించడానికి ఉపయోగించిన ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్‌కు పంపబడిన క్లెయిమ్ ID మీకు అవసరం.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13483212715888038362
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false