'Youtube.com/new'లో కొత్త ఫీచర్ ప్రయోగాలను పరీక్షించండి

youtube.com/new‌లో మీరు ప్రయోగాత్మక YouTube ఫీచర్‌ల గురించి తెలుసుకోవచ్చు, అలాగే ప్రారంభించవచ్చు. 

అన్ని ప్రయోగాలు లైవ్‌లోకి వెళ్లవు. ఫీచర్ భవిష్యత్తును నిర్ణయించడంలో సహాయపడటానికి, ఈ 2 వారాల వ్యవధిలో మీకు వీలైనంత ఎక్కువ ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వండి.

పాల్గొనాలంటే:

  1. youtube.com/new‌ను సందర్శించి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు ట్రై చేసి చూడాలని భావించే ప్రయోగం ఏదైనా మీకు కనిపిస్తే, దీన్ని ట్రై చేయండి‌ని ఎంచుకోండి.* 
  3. మీరు ఎంచుకొన్న ఫీచర్‌ను ఉపయోగించి, ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వండి. 

*కొన్ని ప్రయోగాలలో పాల్గొనడానికి, మీకు ఒక యాక్టివ్ YouTube Premium మెంబర్‌షిప్ అవసరం కావచ్చు.

ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి మరిన్ని అవకాశాల కోసం, మా రీసెర్చ్ అధ్యయనాలలో ఏదోక దానిలో పాల్గొనడానికి మీరు ఎప్పుడైనా సైన్ అప్ చేయవచ్చు

ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేయడానికి: ​

  1. youtube.com/new‌ను సందర్శించండి.
  2. మీరు ట్రై చేసిన ప్రయోగాన్ని కనుగొనండి.
  3. ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి.

ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించమని గుర్తు చేసే మెసేజ్‌లు మీకు YouTubeలో కనిపించవచ్చు, ప్రత్యేకించి ఎక్కువగా ప్రయోగం ముగుస్తున్న దశలో మీకు ఈ మెసేజ్‌లు కనిపించే అవకాశం ఉంది.

ప్రయోగం నుండి నిష్క్రమించడానికి:

  1. youtube.com/new‌ను సందర్శించండి.
  2. ప్రయోగం పక్కన ఉండే ఆఫ్ చేయి బటన్‌ను ఎంచుకోండి. గమనిక: YouTube Premium సబ్‌స్క్రిప్షన్ అవసరం ఉన్న ప్రయోగాల విషయంలో, మీరు Premium మెంబర్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఆఫ్ చేయగలరు.

మీరు ముందుగానే నిష్క్రమించకపోతే, షెడ్యూల్ చేయబడిన ముగింపు తేదీన ప్రయోగాత్మక ఫీచర్ ఆటోమేటిక్‌గా అదృశ్యమైపోతుంది, మీ YouTube అనుభవం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9391531868240975350
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false