మీ YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి

 

మీ YouTube విద్యార్థి మెంబర్‌షిప్ గురించి మీకు ఏవైనా సందేహాలున్నాయా? మీ మెంబర్‌షిప్ వెరిఫికేషన్ లేదా మార్పులకు సంబంధించి సహాయం కోసం దిగువున చూడండి. మీకు మరింత సహాయం కావాలంటే, మీరు YouTube సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

మీ విద్యార్థి స్టేటస్‌ను మళ్లీ వెరిఫై చేయండి

YouTube Music Premium లేదా YouTube Premiumకు విద్యార్థి మెంబర్‌షిప్‌ల విషయంలో మీ డిస్కౌంట్‌తో కూడిన విద్యార్థి ధరలను కొనసాగించడానికి, మీరు విద్యార్థిగా మీ స్టేటస్‌ను ప్రతి సంవత్సరం వెరిఫై చేయడం అవసరం. మెంబర్‌షిప్‌నకు సంబంధించి ప్రతి సంవత్సరం ముగింపులో మీకు మీ విద్యార్థి స్టేటస్‌ను మళ్లీ వెరిఫై చేయాల్సిందిగా గుర్తు చేస్తూ మీరు ఈమెయిల్ మరియు/లేదా యాప్‌లో నోటిఫికేషన్‌ను అందుకుంటారు.
మీ విద్యార్థి స్టేటస్‌ను మళ్లీ వెరిఫై చేయడానికి మీకు అర్హత ఉండి, మీ విద్యార్థి స్టేటస్ గడువు ముగియడానికి 30 రోజుల కంటే తక్కువ వ్యవధి మాత్రమే ఉన్నట్లయితే, మీరు మీ రీ-యాక్టివేషన్‌ను ప్రారంభించవచ్చు. మీ విద్యార్థి స్టేటస్ గడువు ఎప్పుడు ముగుస్తుందో చూడటానికి, లేదా మీ విద్యార్థి మెంబర్‌షిప్‌ను రీ-యాక్టివేట్ చేయడానికి, http://youtube.com/purchases లింక్‌ను సందర్శించండి.
వెరిఫికేషన్ ప్రాసెస్ విషయంలో సహాయం కోసం, SheerIDని customerservice@sheerid.comకు ఈమెయిల్ చేయండి. మీ మెంబర్‌షిప్ విషయంలో మీకు సహాయం కావాలంటే, YouTube సపోర్ట్‌ను సంప్రదించండి.

మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి

మీరు ఎప్పుడైనా మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు. మీరు రద్దు చేసినప్పుడు, మీ నెలవారీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే వరకు మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు మీకు ఇప్పటికీ యాక్సెస్ ఉంటుంది.

విద్యార్థి మెంబర్‌షిప్ ముగింపు

మీరు 4 సంవత్సరాల వరకు YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌లో ఉండవచ్చు. ప్రతి సంవత్సరం ముగింపులో, మీరు మీ అర్హతను మళ్లీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు సబ్‌స్క్రయిబర్‌గానే ఉన్నప్పటికీ, విద్యార్థి ధరలకు ఇకపై అర్హత పొందలేకపోతే, మీ విద్యార్థి మెంబర్‌షిప్ ఆటోమేటిక్‌గా పూర్తి ధర చెల్లించాల్సిన మెంబర్‌షిప్‌నకు మార్చబడుతుంది. మీరు ఎప్పుడైనా మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3606524038422432694
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false