YouTube Premium విద్యార్థి మెంబర్‌షిప్‌ను పొందండి

మీరు విద్యార్థి అయితే, YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌నకు మీకు అర్హత ఉండవచ్చు. విద్యార్థి మెంబర్‌షిప్‌ను పొందే అర్హత ఎవరికి ఉంది, దానికి ఎలా సైన్ అప్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకోండి.

YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు (YouTube లేదా YouTube TVలో NFL సండే టికెట్‌ను మినహాయిస్తే) మీకు యాక్టివ్‌గా ఉన్న సబ్‌స్క్రిప్షన్ ఉండి, విద్యార్థి మెంబర్‌షిప్‌నకు మారాలనుకుంటే, ముందుగా ఇప్పటికే ఉన్న మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోండి. ఇప్పటికే ఉన్న మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకున్నాక, మీరు YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయవచ్చు.

YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌నకు కావలసిన అర్హత

YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయడానికి మీరు తప్పనిసరిగా ఈ కింద పేర్కొన్న వాటికి అనుగుణంగా ఉండాలి:

  • YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌లు అందించబడే లొకేషన్‌లో ఉండే ఒక ఉన్నత విద్యా సంస్థలో మీరు విద్యార్థిగా ఎన్‌రోల్ అయ్యి ఉండాలి.
  • ఆ ఉన్నత విద్యా సంస్థ, SheerID ఆమోదం పొంది ఉండాలి. విద్యా సంస్థకు అర్హత ఉందా లేదా అనేది SheerID ప్రోగ్రామ్ నిర్ణయిస్తుంది.

    మీ స్కూల్‌లో విద్యార్థి ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేయడానికి:
    1. YouTube Premiumకు లేదా YouTube Music Premiumకు సంబంధించిన విద్యార్థి ప్లాన్ ల్యాండింగ్ పేజీకి వెళ్లండి.
    2. Premiumను పొందండిని ఎంచుకోండి.
    3. SheerID ఫారమ్‌లో మీ స్కూల్ పేరును టైప్ చేయండి. లిస్ట్‌లో మీ స్కూల్ ఉంటే, విద్యార్థి మెంబర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయని అర్థం.
  • SheerID ద్వారా మీరు విద్యార్థిగా వెరిఫై అయ్యి ఉండాలి. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో సహాయం కోసం, customerservice@sheerid.com ఈమెయిల్ అడ్రస్‌కు ఈమెయిల్ చేయడం ద్వారా SheerIDని సంప్రదించండి.

మెంబర్‌షిప్‌ను పొందడానికి కావలసిన అర్హతలు ఉంటే, మీకు గరిష్ఠంగా 4 సంవత్సరాలు విద్యార్థి మెంబర్‌షిప్‌ను పొందడానికి అర్హత లభిస్తుంది. ప్రతి సంవత్సరం, మీ అర్హతను మీరు తిరిగి వెరిఫై చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది.

విద్యార్థి మెంబర్‌షిప్ అందుబాటులో ఉన్న లొకేషన్‌లు

ప్రస్తుతం YouTube విద్యార్థి మెంబర్‌షిప్‌లు ఈ కింద ఉన్న లొకేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి:

  • అల్జీరియా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • అజర్‌బైజాన్
  • బహ్రెయిన్
  • బంగ్లాదేశ్
  • బెల్జియం
  • బొలీవియా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కంబోడియా
  • కెనడా
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • ఫ్రెంచ్ గియానా
  • ఫ్రెంచ్ పాలినేషియా
  • జార్జియా
  • జర్మనీ
  • ఘనా
  • గ్రీస్
  • గ్వాటెమాలా
  • హోండురస్
  • హాంకాంగ్
  • హంగేరీ
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఇరాక్
  • ఇజ్రాయెల్
  • ఐర్లాండ్
  • ఇటలీ
  • జమైకా
  • జపాన్
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కెన్యా
  • కువైట్
  • లావోస్
  • లెబనాన్
  • లిబియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మాల్టా
  • మెక్సికో
  • మొరాకో
  • నేపాల్
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • ఉత్తర మాసిడోనియా
  • నార్వే
  • ఒమన్
  • పాకిస్థాన్
  • పనామా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • ఖతార్
  • రీయూనియన్
  • రొమేనియా
  • రష్యా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సింగపూర్
  • స్లోవేకియా
  • దక్షిణాఫ్రికా
  • స్పెయిన్
  • శ్రీలంక
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • టాంజానియా
  • థాయ్‌లాండ్
  • ట్యునీషియా
  • టర్కీ
  • ఉగాండా
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • వియత్నాం
  • యెమెన్
  • జింబాబ్వే

విద్యార్థి మెంబర్‌షిప్ ఆప్షన్‌లు

YouTube నుండి మీరు పొందే అనుభవాన్ని మెరుగుపరచడానికి మేము అనేక ఆప్షన్‌లను అందిస్తున్నాము. విద్యార్థిగా మీరు YouTube Music Premiumకు గానీ లేదా YouTube Premium మెంబర్‌షిప్‌నకు గానీ సైన్ అప్ చేయవచ్చు. మీకు అవే ప్రయోజనాలు తగ్గింపు ధరకు లభిస్తాయి. మీకు ఏది సరైనదో నిర్ణయించుకోవడానికి మా పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌ల గురించి తెలుసుకోండి.

పెయిడ్ విద్యార్థి మెంబర్‌షిప్‌ను ప్రారంభించండి

YouTube Premium

మీరు YouTube Premium మెంబర్ అయినప్పుడు, మీ ప్రయోజనాలను మీరు YouTubeలో, YouTube Musicలో, ఇంకా YouTube Kidsలో ఉపయోగించుకోవచ్చు.
  1. మీ కంప్యూటర్ లేదా మొబైల్ వెబ్ బ్రౌజర్‌లో youtube.com/premium/student లింక్‌కు వెళ్లండి.
  2. Premiumను పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. SheerIDతో వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి దశలను ఫాలో అవ్వండి. SheerID మీ అర్హతను వెరిఫై చేయగలిగితే, సైన్ అప్ ప్రాసెస్‌ను కొనసాగించడానికి, మీరు YouTubeకు మళ్లించబడతారు.
    • SheerID మీ అర్హతను వెరిఫై చేయగలిగితే, సైన్ అప్ ప్రాసెస్‌ను కొనసాగించడానికి, మీరు YouTubeకు మళ్లించబడతారు.
    • మీ వెరిఫికేషన్ వెంటనే పూర్తి కాకపోతే, మీ అర్హతను వెరిఫై చేయడానికి మరిన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్‌లను మాన్యువల్‌గా రివ్యూ చేయడం జరుగుతుంది. U.S.లో ఉంటే, మీ అర్హత స్టేటస్‌ను తెలియజేస్తూ మీకు 20 నిమిషాలలో ఒక ఈమెయిల్ వస్తుంది. U.S.లో కాకుండా ఇతర లొకేషన్‌లలో ఉంటే, ఈమెయిల్ నోటిఫికేషన్ రావడానికి 48 గంటల దాకా సమయం పట్టవచ్చు.
    • ఒకవేళ మీ అర్హత, అదనపు వెరిఫికేషన్ దశ ద్వారా నిర్ధారించబడితే, మీరు మళ్లీ మీ ఖాతాకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేసి మీ ప్రొఫైల్‌కు వెళ్లండి. పెయిడ్ మెంబర్‌షిప్‌లను ఎంచుకోండి, ఈ కింద ఉన్న దశలను ఉపయోగించి సైన్ అప్‌ను పూర్తి చేయమని అడుగుతూ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి, లేదా ఒక కొత్త పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి.
  5. లావాదేవీని పూర్తి చేయడానికి కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

మీ మెంబర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలను చూడటానికి ఏ సమయంలోనైనా http://youtube.com/purchases లింక్‌కు వెళ్లండి.

YouTube Music Premium

యాడ్‌లు లేకుండా లక్షల కొద్దీ పాటలను, ఇంకా మ్యూజిక్ వీడియోలను ఆస్వాదించడానికి YouTube Music Premium మెంబర్ అవ్వండి. ఆఫ్‌లైన్‌లో వినడం కోసం మీకు ఇష్టమైన పాటలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఇంకా అనేక సదుపాయాలను పొందండి.
  1. మీ కంప్యూటర్ లేదా మొబైల్ వెబ్ బ్రౌజర్‌లో youtube.com/musicpremium/student లింక్‌కు వెళ్లండి.
  2. Premiumను పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. SheerIDతో వెరిఫికేషన్‌ను పూర్తి చేయడానికి దశలను ఫాలో అవ్వండి. SheerID మీ అర్హతను వెరిఫై చేయగలిగితే, సైన్ అప్ ప్రాసెస్‌ను కొనసాగించడానికి, మీరు YouTubeకు మళ్లించబడతారు.
    • SheerID మీ అర్హతను వెరిఫై చేయగలిగితే, సైన్ అప్ ప్రాసెస్‌ను కొనసాగించడానికి, మీరు YouTubeకు మళ్లించబడతారు.
    • మీ వెరిఫికేషన్ వెంటనే పూర్తి కాకపోతే, మీ అర్హతను వెరిఫై చేయడానికి మరిన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్‌లను మాన్యువల్‌గా రివ్యూ చేయడం జరుగుతుంది. U.S.లో ఉంటే, మీ అర్హత స్టేటస్‌ను తెలియజేస్తూ మీకు 20 నిమిషాలలో ఒక ఈమెయిల్ వస్తుంది. U.S.లో కాకుండా ఇతర లొకేషన్‌లలో ఉంటే, ఈమెయిల్ నోటిఫికేషన్ రావడానికి 48 గంటల దాకా సమయం పట్టవచ్చు.
    • ఒకవేళ మీ అర్హత, అదనపు వెరిఫికేషన్ దశ ద్వారా నిర్ధారించబడితే, మీరు మళ్లీ మీ ఖాతాకు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేసి మీ ప్రొఫైల్‌కు వెళ్లండి. పెయిడ్ మెంబర్‌షిప్‌లను ఎంచుకోండి, ఈ కింద ఉన్న దశలను ఉపయోగించి సైన్ అప్‌ను పూర్తి చేయమని అడుగుతూ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి, లేదా ఒక కొత్త పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి.
  5. లావాదేవీని పూర్తి చేయడానికి కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

మీ మెంబర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలను చూడటానికి ఏ సమయంలోనైనా http://youtube.com/purchases లింక్‌కు వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4278950032816191644
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false