డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి

మేము YouTube కోసం అనేక పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌లను అందిస్తున్నాము. అప్‌గ్రేడ్ చేసిన తర్వాత లేదా ఒక మెంబర్‌షిప్ ఆప్షన్ నుండి మరొకదానికి మారిన తర్వాత, మీరు డబుల్ బిల్ పొందుతున్నట్లు కనుగొనవచ్చు. మా పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌లలో కొన్ని ఇతర సబ్‌స్క్రిప్షన్‌లకు కూడా ఆటోమేటిక్‌గా యాక్సెస్‌ను అందిస్తాయి, కాబట్టి మీరు తక్కువ స్థాయి సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ప్రతి ఒక్క పెయిడ్ మెంబర్‌షిప్ ఇతరులతో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటుంది; డ్యూయల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా పరిష్కరించాలి లేదా ఎలా నిరోధించాలి అనే దాని గురించి తెలుసుకోండి.

మీరు చూస్తున్న డూప్లికేట్ ఛార్జీ, ఒకటి కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉండటం వల్ల విధించినది కాదని మీరు విశ్వసిస్తే, దయచేసి ఈ పేజీని సందర్శించండి. మీరు ప్రామాణీకరణ నిలుపుదల, పెండింగ్ ఛార్జీ లేదా మరొక రకమైన ఊహించని ఛార్జీని చూస్తూ ఉండవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌లు & బిల్లింగ్

YouTube Premium:

  • మీకు అన్ని YouTube Premium ప్రయోజనాలకు యాక్సెస్ + అన్ని YouTube Music Premium ప్రయోజనాలకు యాక్సెస్ ఇస్తుంది.
  • YouTube లేదా Apple ద్వారా బిల్ చేయబడుతుంది (మీరు iOSలో సైన్ అప్ చేసినట్లయితే).

YouTube Music Premium:

  • మీకు YouTube Music Premium ప్రయోజనాలన్నిటికీ యాక్సెస్ ఇస్తుంది.
  • YouTube లేదా Apple ద్వారా బిల్ చేయబడుతుంది (మీరు iOSలో సైన్ అప్ చేసినట్లయితే).

డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా పరిష్కరించాలి

మీరు పొరపాటున YouTube Premium, YouTube Music Premium కోసం సైన్ అప్ చేసినట్లయితే: మీ YouTube Music మెంబర్‌షిప్‌ను రద్దు చేయడం ద్వారా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు; ఎందుకంటే మీ YouTube Premium మెంబర్‌షిప్‌లో అది చేర్చబడి ఉంటుంది. మీరు Appleతో YouTube Music Premium కోసం సైన్ అప్ చేసినట్లయితే, Apple ద్వారా మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి. మీరు YouTubeతో సైన్ అప్ చేసినట్లయితే మీ మెంబర్‌షిప్‌ను ఎలా రద్దు చేయాలో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15372370499222328537
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false