మీ వీడియో క్వాలిటీని మార్చండి

మీకు అత్యుత్తమ వీక్షణ అనుభవాన్ని అందించడానికి, మీ వీక్షణ పరిస్థితుల ఆధారంగా YouTube మీ వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీని మారుస్తుంది. ఈ పరిస్థితుల వల్లనే మీరు వీడియోలను చూసేటప్పుడు, మీ వీడియో క్వాలిటీ మారుతూ ఉండటాన్ని మీరు గమనించే అవకాశం ఉంది.

వీడియో క్వాలిటీని నిర్ణయించే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:

  • మీ ఇంటర్నెట్ కనెక్షన్ వేగం.
  • వీడియో ప్లేయర్/స్క్రీన్ సైజ్: అధిక క్వాలిటీ గల వీడియోలు సాధారణంగా పెద్ద స్క్రీన్‌లలో బాగా ప్లే అవుతాయి.
  • అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ వీడియో క్వాలిటీ: వీడియోను స్టాండర్డ్ డెఫినిషన్‌లో రికార్డ్ చేసినట్లయితే, అది హై డెఫినిషన్‌లో అందుబాటులో ఉండదు.
  • మీ బ్రౌజర్: కొన్ని బ్రౌజర్‌లు, కొత్త వీడియో ఫార్మాట్‌లను లేదా క్వాలిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేయవు.
గమనిక: YouTube Premiumతో, మీరు Apple ఫోన్‌లో, టాబ్లెట్స్‌లో 1080p Premiumలో వీడియోలను చూడవచ్చు. YouTube Premium మెంబర్‌గా మారండి లేదా YouTube Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

వీడియో క్వాలిటీని మార్చడం

మీరు కంప్యూటర్, టీవీ లేదా మొబైల్ పరికరంలో చూస్తున్న ఏ వీడియో క్వాలిటీనైనా మాన్యువల్‌గా మార్చవచ్చు.

మీరు చూస్తున్న వీడియో క్వాలిటీని ఎలా మార్చాలి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ టీవీలో వీడియో క్వాలిటీని మార్చండి:

  1. వీడియో ప్లేయర్‌లో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి.
  2. క్వాలిటీని ఎంచుకోండి.
  3. మీ ప్రాధాన్య వీడియో క్వాలిటీని ఎంచుకోండి.
గమనిక: కొన్ని అధిక క్వాలిటీ గల ఫార్మాట్‌లు (ఉదాహరణకు, 1080p, 4K) అన్ని పరికరాలలో అందుబాటులో ఉండకపోవచ్చు, ఎందుకంటే అవి కొత్త వీడియో కంప్రెషన్ టెక్నాలజీని (VP9) సపోర్ట్ చేయకపోవచ్చు.

మీ కంప్యూటర్‌లో చూసేటప్పుడు వీడియో క్వాలిటీని మార్చడానికి:

  1. వీడియో ప్లేయర్‌లో, సెట్టింగ్‌లు ను ఎంచుకోండి.
  2. క్వాలిటీపై క్లిక్ చేయండి.
  3. మీ ప్రాధాన్య వీడియో క్వాలిటీని ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16336258089096510740
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false