YouTube TVకి సంబంధించి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడం

మీ YouTube TV మెంబర్‌షిప్‌లో భాగమైన ఫీచర్‌లలో లోపాలు ఉన్నా, లేదా పేర్కొన్న విధంగా అవి పని చేయకపోయినా, దిగువున ఉన్న బటన్‌ను క్లిక్ చేసి, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి. మీకు రీఫండ్ జారీ అయితే, తక్షణమే మీరు YouTube TVకి యాక్సెస్‌ను కోల్పోయి, డబ్బును తిరిగి పొందుతారు.

రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీరు చేయని దానికి మీకు ఛార్జీ విధించబడితే, బదులుగా మీరు అనుమతి లేని ఛార్జీని రిపోర్ట్ చేయవచ్చు.

YouTube TVకి సంబంధించిన రీఫండ్‌ల గురించి మరింత తెలుసుకోండి

  • క్రెడిట్ కార్డ్ రీఫండ్‌లకు సాధారణంగా 3-5 పని దినాలు పడుతుంది.
    • ప్రాసెసింగ్ సమయాలను మీ కార్డ్ జారీ చేసిన సంస్థ ప్రభావితం చేయవచ్చు. కొన్నిసార్లు, రీఫండ్‌లు ప్రాసెస్ కావడానికి 10 పని దినాల వరకు పట్టవచ్చు.
    • మీ క్రెడిట్ కార్డ్ ఇక మీదట యాక్టివ్‌గా లేకపోతే, దాన్ని జారీ చేసిన బ్యాంక్‌కు రీఫండ్ వెళుతుంది. ఫండ్స్‌ను రికవర్ చేసుకోవడానికి, బ్యాంక్‌ను సంప్రదించండి.
       
  • మీ మొబైల్ క్యారియర్ లేదా ఇంటర్నెట్ ప్రొవైడర్ ద్వారా మీరు YouTube TVకి సబ్‌స్క్రయిబ్ అయితే:
    • YouTube రీఫండ్‌ను జారీ చేయలేదు.
    • మీ ప్రొవైడర్ రీఫండ్ పాలసీలు వర్తిస్తాయి. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి లేదా మీ బిల్లుకు సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, నేరుగా వారినే సంప్రదించండి.
       
  • మీరు ఎప్పుడైనా మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు లేదా పాజ్ చేయవచ్చు.
    • పాక్షిక బిల్లింగ్ వ్యవధులకు మేము రీఫండ్‌లు లేదా క్రెడిట్‌లు ఇవ్వము.
    • మీరు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకున్నప్పుడు, మీ బిల్లింగ్ వ్యవధి ముగిసే వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10070428904962729032
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false