మీ YouTube Premium ప్రయోజనాలను ఉపయోగించండి

YouTube Premium అనేది పెయిడ్ మెంబర్‌షిప్, ఇది YouTubeలో మీకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. దిగువున ఉన్న Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి, లేదా Premium మెంబర్‌షిప్ ఆఫర్‌లను బ్రౌజ్ చేయండి.

యాడ్స్ లేకుండా వీడియోలను చూడండి

YouTube Premiumతో, వీడియో ఓవర్‌లే యాడ్స్‌తో సహా వీడియోకు ముందు అలాగే వీడియో సమయంలో వచ్చే యాడ్స్ వల్ల కలిగే అంతరాయాలు లేకుండా మీరు లక్షలాది వీడియోలను చూడవచ్చు. మీకు థర్డ్-పార్టీ బ్యానర్ యాడ్‌లు అలాగే సెర్చ్ యాడ్‌లు కూడా కనిపించవు.

క్రియేటర్ ద్వారా కంటెంట్‌లో పొందుపరచబడిన బ్రాండింగ్ లేదా ప్రమోషన్‌లు అలాగే క్రియేటర్ ద్వారా జోడించబడిన లేదా ఎనేబుల్ చేయబడిన కంటెంట్‌కు చుట్టుపక్కల ఉన్న ప్రమోషనల్ లింక్‌లు, షెల్ఫ్‌లు ఇంకా ఫీచర్‌లు మీకు ఇప్పటికీ కనిపించవచ్చు. ఈ లింక్‌లు, షెల్ఫ్‌లు అలాగే ఫీచర్‌లు వారి వెబ్‌సైట్, అమ్మకపు వస్తువులు, వారి ఛానెల్‌కు మెంబర్‌షిప్, ఈవెంట్ టికెట్‌లు లేదా వారు ప్రమోట్ చేస్తున్న ఇతర సంబంధిత గమ్యాలకు కావచ్చు.

అనుకూల స్మార్ట్ టీవీలు/గేమింగ్ కన్సోల్స్, YouTube, YouTube Music, ఇంకా YouTube Kids మొబైల్ యాప్‌లు మీ లొకేషన్‌లో అందుబాటులో ఉన్నట్లయితే వాటితో పాటు—మీరు Google ఖాతాతో సైన్ ఇన్ చేయగల అన్ని పరికరాలు అలాగే ప్లాట్‌ఫామ్‌ల వ్యాప్తంగా యాడ్-రహిత వీడియోలకు సపోర్ట్ ఉంటుంది.

YouTube Music Premium అనేది అదే రకమైన అనుభవాన్ని అందిస్తుంది, ఇది యాడ్స్ లేకుండా YouTube Music యాప్‌లో మ్యూజిక్ కంటెంట్‌ను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీడియోలను డౌన్‌లోడ్ చేయండి

మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీడియోలు, ప్లేలిస్ట్‌లను డౌన్‌లోడ్ చేయండి. మీరు YouTube Music యాప్‌ను ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అలాగే YouTube Music యాప్‌ను ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో వినడానికి పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఇంకా YouTube Kids యాప్‌లో ఆటో-డౌన్‌లోడ్ చేయబడిన వీడియోలను చూడవచ్చు.

స్మార్ట్ డౌన్‌లోడ్‌లతో, ఆఫ్‌లైన్‌లో చూడటానికి లేదా వినడానికి సిఫార్సు చేయబడిన కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా మీ లైబ్రరీకి జోడించబడింది. ప్రయాణంలో ఉన్నప్పుడు వీడియోలను చూడండి, సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా కొత్త కంటెంట్‌ను చూడండి. స్మార్ట్ డౌన్‌లోడ్‌లను మేనేజ్ చేయడం లేదా ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

వీటిలో అందుబాటులో ఉన్నాయి: YouTube Premium, YouTube Music Premium.

బ్యాక్‌గ్రౌండ్ ప్లే

ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మీ స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు మీ మొబైల్ పరికరంలో వీడియోలను ప్లే చేయండి. మీరు మీ YouTube Premium మెంబర్‌షిప్ ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, YouTube, YouTube Music, అలాగే YouTube Kids మొబైల్ యాప్‌లలో (ఈ యాప్‌లు మీ లొకేషన్‌లో అందుబాటులో ఉన్నట్లయితే) 'బ్యాక్‌గ్రౌండ్ ప్లే' అందుబాటులో ఉంటుంది.

'బ్యాక్‌గ్రౌండ్ ప్లే'ని అనుకూలంగా మార్చండి లేదా ఆఫ్ చేయండి

మీరు మీ YouTube Premium మెంబర్‌షిప్ ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు YouTube మొబైల్ యాప్‌లలో 'బ్యాక్‌గ్రౌండ్ ప్లే' అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్‌గా, వీడియోలు ఎల్లప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతాయి.

'బ్యాక్‌గ్రౌండ్ ప్లే'ని మార్చడానికి లేదా ఆఫ్ చేయడానికి:

  1. YouTubeలో, మీ ప్రొఫైల్ ఫోటోను ఎంచుకొని, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. బ్యాక్‌గ్రౌండ్, డౌన్‌లోడ్‌లు ఆ తర్వాత ప్లేబ్యాక్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎంచుకోండి:
    • ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచు: వీడియోలు ఎల్లప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతాయి (ఆటోమేటిక్ సెట్టింగ్).
    • హెడ్‌ఫోన్స్ లేదా బాహ్య స్పీకర్‌లు: మీ పరికరం హెడ్‌ఫోన్స్, స్పీకర్‌లు, లేదా బాహ్య ఆడియో అవుట్‌పుట్‌కు కనెక్ట్ చేసి ఉంటే మాత్రమే వీడియోలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతాయి.
    • ఆఫ్‌లో ఉంచడం: వీడియోలు ఎప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవ్వవు. 

వీటిలో అందుబాటులో ఉంది: YouTube Premium, YouTube Music Premium.

YouTube Music Premium

మీ ప్రయోజనాల్లో భాగంగా, మీరు YouTube Music Premiumకు కూడా యాక్సెస్‌ను పొందుతారు. YouTube Music Premiumతో మీరు వీటిని చేయవచ్చు:

  • యాడ్‌లు లేకుండా YouTube Musicలో లక్షలాది పాటలు అలాగే వీడియోలను ఆస్వాదించవచ్చు.
  • ఆఫ్‌లైన్‌లో వినడం కోసం మీ మొబైల్ పరికరానికి పాటలు అలాగే వీడియోలను డౌన్‌లోడ్ చేయవచ్చు.
  • మీరు ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు మీ మ్యూజిక్‌ను ప్లే చేస్తూ ఉండటానికి 'బ్యాక్‌గ్రౌండ్ ప్లే'ని ఉపయోగించవచ్చు.
  • వీడియో లోడ్ అవ్వకుండానే మ్యూజిక్‌ను వినడానికి 'ఆడియో-మాత్రమే మోడ్'‌ను ఆన్ చేయవచ్చు.
చూడటం కొనసాగించండి

మీ Premium మెంబర్‌షిప్‌తో, నిరంతరాయమైన వీక్షణ అనుభవం కోసం మీరు ఆపిన చోటు నుండే వీడియోలను చూడటాన్ని కొనసాగించవచ్చు.

మీరు వీడియోను చూడటం ఆపివేసినట్లయితే, మీరు ఎక్కడి వరకు చూశారో ఆ ప్రదేశాన్ని మేము సేవ్ చేస్తాము, తద్వారా మీరు పలు పరికరాలలో వీడియోలను చూడటాన్ని కొనసాగించవచ్చు.

దీనిలో అందుబాటులో ఉంది: YouTube Premium.

Premium కంట్రోల్స్‌తో ప్లేబ్యాక్‌ను మార్చండి

Premium మెంబర్‌షిప్‌తో, Premium కంట్రోల్స్‌ను ఉపయోగించి మీరు మల్టీ టాస్క్ చేయవచ్చు, అలాగే వీడియోలను మీకు నచ్చిన వేగంతో ఆస్వాదించవచ్చు. కంటెంట్‌ను స్కిప్ చేయండి, మీ ప్లేబ్యాక్ వేగాన్ని మార్చండి, అలాగే మరిన్ని పనులు చేయండి.

YouTube మొబైల్ యాప్ నుండి Premium కంట్రోల్స్‌ను యాక్సెస్ చేయడానికి:

  1. సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతాను ఉపయోగించి వీడియోను తెరవండి.
  2. సెట్టింగ్‌లు సెట్టింగ్‌లును ట్యాప్ చేయండి.
  3. అదనపు సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  4. Premium కంట్రోల్స్‌ను ఎంచుకోండి.

మీ వీడియో ఎక్కువ కంట్రోల్స్ ఉన్న మెనూను తెరుస్తుంది, మీరు అక్కడ కింద పేర్కొన్న వాటిని చేయగలరు:

  • వీడియోలను ప్లే చేయవచ్చు, పాజ్ చేయవచ్చు, లేదా ఒక వీడియో నుండి ఇంకో వీడియోకు స్కిప్ చేయవచ్చు.
  • వీడియోలలో +/- 10 సెకన్లు ముందుకు/వెనుకకు స్కిప్ చేయవచ్చు.
  • వీడియోను లైక్ చేయండి.
  • తర్వాత చూడటం కోసం వీడియోను సేవ్ చేయవచ్చు.
  • మీ ప్లేబ్యాక్ వేగాన్ని మార్చండి.
  • స్థిరమైన వాల్యూమ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Premium కంట్రోల్స్ Android, iPhone, టాబ్లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి, కానీ డెస్క్‌టాప్‌లో అందుబాటులో లేవు.

వీటిలో అందుబాటులో ఉన్నాయి: YouTube Premium, YouTube Music Premium.

పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP)

మీ మొబైల్ పరికరంలో ఇతర యాప్‌లను ఉపయోగిస్తూనే పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ద్వారా మీరు వీడియోలను చూడవచ్చు.

మీ మొబైల్ పరికరంలో పిక్చర్-ఇన్-పిక్చర్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

లభ్యత:

  • Premium యూజర్‌లు (Android/iOS): నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు (Androidలో Shorts).
  • USలో యాడ్‌లు గల యూజర్‌లు: నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు (మ్యూజిక్ వీడియోల వంటి నిర్దిష్ట కంటెంట్ మినహాయించి).
  • US వెలుపల ఉన్న యాడ్‌లు గల యూజర్‌లు: PiP అందుబాటులో ఉండదు.

మొబైల్ పరికరాలు, టాబ్లెట్‌లలో వీడియోలను 'క్యూ'కు జోడించండి

మీరు చూస్తున్న వీడియోకు అంతరాయం కలగకుండా తర్వాతి దాన్ని చూడటానికి వీడియోలను సెటప్ చేయండి. మొబైల్ పరికరాలు, టాబ్లెట్‌లలో క్యూకు జోడించడం అనేది YouTube Premiumతో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

దీనిలో అందుబాటులో ఉంది: YouTube Premium

మీ వీడియో క్వాలిటీని మార్చడం

YouTube Premiumతో, మీరు వీడియోలను 1080p Premiumలో చూడవచ్చు.

1080p Premium అనేది 1080pకి చెందిన మెరుగుపరచిన బిట్ రేట్ వెర్షన్. మెరుగుపరచిన బిట్ రేట్ ప్రతి పిక్సెల్‌కు మరింత సమాచారాన్ని అందిస్తుంది, ఫలితంగా అధిక క్వాలిటీ వీక్షణ అనుభవం లభిస్తుంది. వీడియోలను 1080pలో అప్‌లోడ్ చేస్తే మాత్రమే అవి మెరుగుపరచిన బిట్ రేట్‌కు అర్హత పొందుతాయి. మీరు వీటి కోసం 1080p Premium ఆప్షన్‌ను కనుగొనలేరు:

  • లైవ్ స్ట్రీమ్‌లు
  • Shorts
  • 1080p కంటే ఎక్కువ లేదా తక్కువ రిజల్యూషన్‌లలో అప్‌లోడ్ చేసిన వీడియోలు

మీకు అత్యుత్తమ వీక్షణ అనుభవాన్ని అందించడానికి, మీ వీక్షణ పరిస్థితులకు అనుగుణంగా YouTube మీ స్ట్రీమింగ్ వీడియో క్వాలిటీని మారుస్తుంది. మీరు Premium membershipను కలిగి ఉంటే, మీ రిజల్యూషన్ ఆటోమేటిక్‌గా 1080p Premiumకు సెట్ చేయబడవచ్చు. మీరు YouTube యాప్‌లో మీ క్వాలిటీ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయవచ్చు.

దీనిలో అందుబాటులో ఉంది: YouTube Premium

Premium బ్యాడ్జ్‌లు

Premium టెన్యూర్‌కు లింక్ అయి ఉన్న బ్యాడ్జ్‌లు యూజర్‌ల విశ్వసనీయతకు గానూ వారికి రివార్డ్‌గా అందించడం జరుగుతుంది, అయితే ప్రయోజనాల బ్యాడ్జ్‌లు యూజర్‌ల విశ్వసనీయతకు గానూ వారికి రివార్డ్‌గా అందించడం జరుగుతుంది. మీరు ఎక్కువ టెన్యూర్ గల బ్యాడ్జ్‌లను సంపాదించవచ్చు, మీ Premium ప్రయోజనాలు (ఉదా. ఆఫ్టర్ పార్టీ, YouTube Music, చూడటం కొనసాగించండి)తో ఎంగేజ్ కావచ్చు. ప్రస్తుతం 18+ వయస్సు ఉన్న యూజర్‌లకు అవి అందుబాటులో ఉన్నాయి.

మీ Premium బ్యాడ్జ్‌లను మీ YouTube ఖాతాలోని Premium ప్రయోజనాల పేజీలో కనుగొనవచ్చు.

మీ Premium బ్యాడ్జ్‌లను కనుగొనడానికి:

  1. YouTube యాప్‌ను తెరవండి
  2. మీ హోమ్ పేజీకి వెళ్లండి
  3. మీ ప్రొఫైల్ చిహ్నంపై ట్యాప్ చేయండి 
  4. మీ Premium ప్రయోజనాలు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  5. పేజీని కిందికి స్క్రోల్ చేసి మీ Premium బ్యాడ్జ్‌లను చూడండి

లాక్ చేసిన ఏ బ్యాడ్జ్‌లను క్లిక్ చేసి అయినా, మీరు ఆ బ్యాడ్జ్‌ను ఎలా సంపాదించాలి అనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను పొందవచ్చు.

గమనికలు

  • వీక్షణ హిస్టరీని పాజ్ చేస్తే, మీ Premium ప్రయోజనాలు (ఉదా ఆఫ్టర్ పార్టీ, YouTube Music, చూడటం కొనసాగించండి)కి సంబంధించిన బ్యాడ్జ్‌లను యూజర్‌లు పొందలేరు. 
  • వీక్షణ హిస్టరీని రీసెట్ చేస్తే, మీ Premium ప్రయోజనాలకు సంబంధించి మీరు గతంలో సంపాదించిన బ్యాడ్జ్‌లు తీసివేయబడతాయి. 
  • Premiumను రద్దు చేస్తే, బ్యాడ్జ్‌లు స్టోర్ అయి ఉన్న మీ Premium ప్రయోజనాల పేజీకి యూజర్‌లకు ఇకపై యాక్సెస్ ఉండదు. 
  • Premiumకు తిరిగి సైన్ అప్ చేస్తే, గతంలో సంపాదించిన బ్యాడ్జ్‌లను యూజర్‌లు చూసేలా ఇది ఎనేబుల్ చేస్తుంది.

ఇతర Premium ప్రయోజనాలు

YouTube Premium మెంబర్‌గా, మీరు కింద పేర్కొన్న వాటితో పాటు ఇతర 'మెంబర్‌లకు-మాత్రమే' ఫీచర్‌లకు యాక్సెస్ ఉంటుంది:

గమనిక: వీటిలో కొన్ని ఫీచర్‌లు కొన్ని ప్రాంతాలు, పరికరాలు, ప్లాన్‌లకే అందుబాటులో ఉంటాయి. మీ YouTube Premium ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి మేము తరచుగా కొత్త ఫీచర్‌లను జోడిస్తూ ఉంటాము, వీటి గురించి మీరు మా Premium అప్‌డేట్‌ల పేజీలో తెలుసుకోవచ్చు.
చిట్కాలు:
  • YouTube Premium అలాగే మా పెయిడ్ మెంబర్‌షిప్‌ల గురించి మరింత సమాచారాన్ని పొందండి.
  • YouTube క్రియేటర్‌లను సపోర్ట్ చేయడానికి మీ YouTube Premium మెంబర్‌షిప్ ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి.
  • మీరు YouTube Premium ప్రయోజనాలకు యాక్సెస్‌ను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవడానికి YouTube యాప్ తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.

Premium ప్రయోజనాలను ఆస్వాదించడానికి సైన్ అప్ చేయండి

Premium ప్రయోజనాలను ఆస్వాదించడానికి, youtube.com/premium/inapp లింక్‌లోకి వెళ్లి సైన్ అప్ చేయండి.

YouTube Premium లేదా YouTube Music Premiumను పొందడం ఎలా

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

గమనిక: YouTube TV, Primetime ఛానెల్స్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, NFL సండే టికెట్ YouTube Premium లేదా Music Premium ప్రయోజనాలలో భాగం కావు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7569260724706913739
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false