YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌లకు సైన్ అప్ చేయడం

Premium మెంబర్‌షిప్‌తో YouTubeలో మీ వీడియో, మ్యూజిక్ అనుభవాన్ని మెరుగుపరుచుకోండి. మీ వ్యక్తిగత పెయిడ్ మెంబర్‌షిప్‌ను ఎలా ప్రారంభించాలో ఈ రోజే తెలుసుకోండి.
YouTube విద్యార్థి మెంబర్‌షిప్ కోసం చూస్తున్నారా? ఇక్కడ మరింత తెలుసుకోండి.

YouTube Music Premium

YouTube Music Premium, YouTube Music యూజర్‌ల కోసం ఉద్దేశించిన పెయిడ్ మ్యూజిక్ మెంబర్‌షిప్. ఇది చాలా దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉంది.

YouTube Music Premium ప్రయోజనాలు

YouTube Music Premiumతో మీకు ఏ ప్రయోజనాలు లభిస్తాయి?

  • యాడ్‌లు లేకుండా YouTube Musicలో లక్షల కొద్దీ పాటలు, వీడియోలను ఆస్వాదించండి. 
  • YouTube Music యాప్‌లో ఆఫ్‌లైన్‌లో వినడం కోసం కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ ప్లే‌ను ఉపయోగిస్తున్నప్పుడు మ్యూజిక్‌ను అలాగే పాడ్‌కాస్ట్‌లను ప్లే చేయండి.
  • Google Home లేదా Chromecast Audioలో మ్యూజిక్‌ను లేదా పాడ్‌కాస్ట్‌లను వినండి.

పాడ్‌కాస్ట్‌లలో క్రియేటర్ పొందుపరిచిన బ్రాండింగ్ లేదా ప్రమోషన్‌లు YouTube Music Premium, YouTube Premium మెంబర్‌లకు ఇప్పటికీ కనిపించవచ్చు. కంటెంట్ లోపలే కాకుండా కంటెంట్ చుట్టూరా కూడా మీకు ప్రమోషనల్ లింక్‌లు, షెల్ఫ్‌లు, ఇంకా ఇతర ఫీచర్‌లు కనిపించవచ్చు, కాకపోతే వీటిని క్రియేటర్ జోడించి ఉండాలి లేదా ఆన్ చేసి ఉండాలి.

గమనిక: ఎంపిక చేసిన దేశాల్లో/ప్రాంతాల్లో ఉండే యూజర్లకు వివిధ ప్రోడక్ట్‌లకు సంబంధించి భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది.

YouTube Premium

YouTube Premium అనేది పెయిడ్ మెంబర్‌షిప్, ఇది YouTubeలోను, ఇతర YouTube యాప్‌లలోను మీకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది చాలా దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉంది.

YouTube Premium ప్రయోజనాలు

YouTube Premiumతో, మీరు వీటిని చేయవచ్చు:

  • యాడ్‌లు లేకుండా YouTubeలో లక్షల కొద్దీ వీడియోలను చూడవచ్చు. 
  • ఆఫ్‌లైన్‌లో చూడటం కోసం మీ మొబైల్ పరికరంలో వీడియోలను అలాగే ప్లేలిస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇతర యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లేదా మీ స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు, వీడియోలను ప్లే చేయడాన్ని మీ మొబైల్ పరికరంలో కొనసాగించవచ్చు.
  • ఎటువంటి ఛార్జీ లేకుండా YouTube Music Premiumకు సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.
  • మీ Google Home లేదా Chromecast Audioలో మీ మ్యూజిక్ అలాగే పాడ్‌కాస్ట్‌లను ఆస్వాదించవచ్చు.

మీ YouTube Premium ప్రయోజనాలు వీటిలో అంతటా వర్తిస్తాయి:

  • YouTube
  • YouTube Kids
  • YouTube Music

పాడ్‌కాస్ట్‌లలో క్రియేటర్ పొందుపరిచిన బ్రాండింగ్ లేదా ప్రమోషన్‌లు YouTube Music Premium, YouTube Premium మెంబర్‌లకు ఇప్పటికీ కనిపించవచ్చు. కంటెంట్ లోపలే కాకుండా కంటెంట్ చుట్టూరా కూడా మీకు ప్రమోషనల్ లింక్‌లు, షెల్ఫ్‌లు, ఇంకా ఇతర ఫీచర్‌లు కనిపించవచ్చు, కాకపోతే వీటిని క్రియేటర్ జోడించి ఉండాలి లేదా ఆన్ చేసి ఉండాలి.

మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించడం

YouTube Premium

యాడ్స్ లేకుండా లక్షల కొద్దీ పాటలు, మ్యూజిక్ వీడియోలను ఆస్వాదించడానికి YouTube Premium మెంబర్ అవ్వండి. ఆఫ్‌లైన్‌లో వినడం కోసం మీరు ఇష్టపడే కంటెంట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

YouTube Premiumకు సైన్ అప్ చేయడానికి,

  1. మీ ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, YouTube యాప్‌ను తెరవండి.
  2. మీరు మీ మెంబర్‌షిప్‌ను ప్రారంభించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటోను ఎంచుకోండి.
  4. అర్హత ఉన్నట్లయితే, మీ ట్రయల్‌ను ప్రారంభించండి. లేదంటే, YouTube Premiumను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ మెంబర్‌షిప్ గురించిన వివరాలను చూడటానికి ఎప్పుడైనా youtube.com/paid_memberships కు వెళ్లండి.

YouTube Music Premium

యాడ్స్ లేకుండా లక్షల కొద్దీ పాటలు, మ్యూజిక్ వీడియోలను ఆస్వాదించడానికి YouTube Music Premium మెంబర్ అవ్వండి. మీరు ఆఫ్‌లైన్‌లో వినడం కోసం పాటలు, వీడియోలు అలాగే పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: మీ మెంబర్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా మీరు పాడ్‌కాస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని ఎపిసోడ్‌లు/షోల విషయంలో ఆడియో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు.

YouTube Music Premium కోసం సైన్ అప్ చేయడానికి,

  1. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో, YouTube Music యాప్‌ను తెరవండి.
  2. మీరు మీ మెంబర్‌షిప్‌ను ప్రారంభించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటోను ఎంచుకోండి.
  4. అర్హత ఉన్నట్లయితే, మీ ట్రయల్‌ను ప్రారంభించండి. లేదంటే, Music Premiumను పొందండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

​మీ మెంబర్‌షిప్ గురించిన వివరాలను చూడటానికి ఎప్పుడైనా youtube.com/paid_memberships కు వెళ్లండి.

బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించడాన్ని పరిగణించండి, తద్వారా మీ ప్రధాన పేమెంట్ ఆప్షన్‌లో ఏదైనా సమస్య వచ్చినా, మీరు మీ ప్రయోజనాలను కోల్పోరు.

YouTube TVకి సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నారా? మెంబర్‌షిప్, అందుబాటులో ఉన్న లొకేషన్‌లు, ఇంకా మరిన్ని అంశాల గురించిన వివరాల కోసం YouTube TV సహాయ కేంద్రాన్ని చూడండి.
Pixel Pass సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు YouTube Premiumను పొందినట్లయితే, మీ ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.
గమనిక: 2022 నుండి, Androidలో సైన్ అప్ చేసిన కొత్త YouTube Premium, Music Premium సబ్‌స్క్రయిబర్‌లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారిని ఈ మార్పు ప్రభావితం చేయదు. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు payments.google.com‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3988446450004254280
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false