YouTubeలో Playables

Playables అనేవి డెస్క్‌టాప్, మొబైల్ పరికరాలు రెండింటిలో YouTubeలో నేరుగా ఆడగల గేమ్‌లు.

ఎలా ఆడాలి

YouTube మొదటి ట్యాబ్‌లోని Playables షెల్ఫ్‌లో లేదా అన్వేషణ మెనూ నుండి వెళ్లగల Playables గమ్యస్థాన పేజీలో Playablesను కనుగొనవచ్చు. Searchను ఉపయోగించి, చూస్తున్నప్పుడు షేర్ చేసిన లింక్‌లను ఉపయోగించి, లేదా మూడు చుక్కల మరిన్ని మెనూ ద్వారా గేమ్ ఆడుతూ, తర్వాత ఆడటం కోసం గేమ్‌ను సేవ్ చేసిన తర్వాత ఖాతా ట్యాబ్‌ను ఉపయోగించి కూడా Playablesను కనుగొనవచ్చు. మేము నిరంతరం మరిన్ని గేమ్‌లను జోడిస్తూ ఉంటాము, కాబట్టి కొత్త టైటిల్స్ కోసం అన్వేషిస్తూ ఉండండి.

గేమ్ కార్డ్‌లలో దేనిని క్లిక్ చేసి అయినా గేమ్ ఆడే విధానానికి వెళ్లండి. మీరు కార్డ్ నుండి లేదా గేమ్‌ను ఆడుతున్నప్పుడు మూడు డాట్స్ మరిన్ని '' మెనూ ద్వారా కూడా గేమ్‌ను షేర్ చేయవచ్చు.

Playables FAQ

సపోర్ట్ చేసే పరికరాలు, ఆవశ్యకతలు

Playables కోసం మీకు అదనంగా ఎటువంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, లేదా డౌన్‌లోడ్‌లూ అవసరం లేదు. మీకు కావలసిందల్లా YouTube తాజా వెర్షన్, సపోర్ట్ చేసే పరికరం, Wi-Fi లేదా డేటా ప్లాన్ (డేటా ధరలు వర్తించవచ్చు)కు కనెక్ట్ అయి ఉండాలి.

ప్రస్తుతం కింది పరికరాలు Playablesను సపోర్ట్ చేస్తున్నాయి:

  • Android
    • YouTube యాప్ వెర్షన్: 18.33, పై వెర్షన్‌లు
    • మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు:
      • Android S, పై వెర్షన్‌లు
      • Android O, P, Q, R (కేవలం 64 బిట్‌లో లేదా అధిక మెమరీ గల 32 బిట్ పరికరాలలో)
  • iOS
    • YouTube యాప్ వెర్షన్: 18.33, పై వెర్షన్‌లు
    • మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు: iOS 14, తర్వాతి వెర్షన్‌లు
  • డెస్క్‌టాప్/మొబైల్ వెబ్
    • బ్రౌజర్‌లు: Chrome, Safari, Firefox

Playables లభ్యత

ప్రస్తుతం Playables అనేది అర్హత గల దేశాలు/ప్రాంతాలలో ఎంపిక చేసిన యూజర్‌లకు రిలీజ్ చేసిన ప్రయోగాత్మక ఫీచర్. అదనంగా, ఈ ప్రాంతాలలో కొందరు యూజర్‌లకు YouTubeలో కనిపించగల Playables కనిపించకపోవచ్చు, కానీ ప్రతి గేమ్‌కు గల షేర్ చేయగల ప్రత్యేక లింక్‌ల ద్వారా వాటిని వారు యాక్సెస్ చేయగలరు. భవిష్యత్తులో మరింత మందికి దీనిని అందుబాటులోకి తీసుకు రావడమే మా లక్ష్యం.

Playables తక్కువగా కనిపించాలని మీరు భావిస్తే, YouTubeలో “ఆసక్తి లేదు” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా Playables షెల్ఫ్ లేదా ఒక్కొక్క Playables స్థాయిని తగ్గించవచ్చు.

గేమ్ ప్రోగ్రెస్, అత్యుత్తమ స్కోర్‌లు, సేవ్ చేసిన హిస్టరీ

గేమ్ ప్రోగ్రెస్ ఆటోమేటిక్‌గా సేవ్ అయ్యి, మీరు YouTube ఖాతాకు లాగిన్ చేసిన సపోర్ట్ చేసే ఏ పరికరంలో అయినా సింక్ చేయబడుతుంది.

ప్రతి గేమ్‌కు సంబంధించి సేవ్ చేయబడిన మీ ప్రోగ్రెస్ YouTube హిస్టరీ > ఇంటరాక్షన్‌లో స్టోర్ చేయబడుతుంది. ప్రతి గేమ్‌కు సంబంధించి సేవ్ చేసిన ఫైల్ ఒక్కటే ఉంటుంది, మీ గేమ్ ప్రోగ్రెస్ సిఫార్సుల కోసం వినియోగించబడదు. గేమ్‌కు సంబంధించి గల సేవ్ చేసిన ఫైల్‌ను మీరు తొలగిస్తే, పరికరాలన్నింటిలో ఆ గేమ్‌కు సంబంధించి గల ప్రోగ్రెస్ మొత్తాన్ని మీరు కోల్పోతారు.

ప్రతి గేమ్‌కు సంబంధించి మీ ఆల్-టైమ్ అత్యుత్తమ స్కోర్ కూడా YouTube హిస్టరీ > ఇంటరాక్షన్‌లలో స్టోర్ చేయబడుతుంది. గేమ్ ప్రోగ్రెస్‌తో కాకుండా ఇది విడిగా స్టోర్ చేయబడుతుంది, కాబట్టి సేవ్ చేసిన స్కోర్‌ను తొలగిస్తే, గేమ్ ప్రోగ్రెస్ తొలగించబడదు, అలాగే గేమ్ ప్రోగ్రెస్‌ను తొలగిస్తే, సేవ్ చేసిన స్కోర్ తొలగించబడదు.

ఒక గేమ్‌కు సంబంధించిన సేవ్ చేసిన ప్రోగ్రెస్ మరియు/లేదా స్కోర్‌లు YouTube హిస్టరీ > ఇంటరాక్షన్‌లలో కనిపించకపోతే, గేమ్ ఈ డేటాను YouTube హిస్టరీలో స్టోర్ చేయదని అర్థం.

Playables హిస్టరీ YouTube హిస్టరీలో స్టోర్ అవుతుంది, మీరు ఇటీవల ఆడిన గేమ్‌లను ఇక్కడ సులభంగా కనుగొనగలరు. అది ఆన్‌లో ఉన్నప్పుడు, సంబంధిత గేమ్ సిఫార్సులను అందించడానికి హిస్టరీ మాకు అనుమతినిస్తుంది. మీ హిస్టరీని తొలగించడం లేదా ఆఫ్ చేయడం ద్వారా Playables హిస్టరీని మీరు కంట్రోల్ చేయవచ్చు. హిస్టరీ ఆఫ్‌లో ఉన్నప్పుడు మీరు ఆడే ఏ గేమ్‌లు అయినా YouTube హిస్టరీలో కనిపించవు.

మీ YouTube హిస్టరీ సెట్టింగ్‌లను మార్చడానికి

  1. myactivity.google.com‌కు వెళ్లండి. 
  2. YouTube హిస్టరీని క్లిక్ చేసి, మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయండి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4570384194299464061
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false