YouTube Premium, YouTube Music Premium సైన్ అప్ ఎర్రర్‌లను పరిష్కరించండి

YouTube Premiumలో లేదా YouTube Music Premiumలో చేరడానికి ట్రై చేసేటప్పుడు మీకు ఎర్రర్ మెసేజ్ వస్తే, సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి కింద ఉన్న సంబంధిత ఎర్రర్ మెసేజ్‌ను కనుగొనండి.

“మేము మీ దేశాన్ని వెరిఫై చేయలేకపోయాము”

మీకు అందుబాటులో ఉన్న ప్లాన్‌లను, ఆఫర్‌లను చూపించడానికి YouTube మీ దేశాన్ని వెరిఫై చేయాలి. “మేము మీ దేశాన్ని వెరిఫై చేయలేకపోయాము” అనే మెసేజ్ మీకు వచ్చినట్లయితే, సమస్యను పరిష్కరించడానికి కింద ఉన్న దశలను ఫాలో అవ్వండి.

  • వేరొక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి.
  • వేరే పరికరాన్ని ఉపయోగించండి.
  • మొబైల్ యాప్‌లో YouTube Premiumను కొనుగోలు చేయండి:
  1. మీ ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, YouTube యాప్‌ను తెరవండి.
  2. మీరు మెంబర్‌షిప్‌ను ప్రారంభించాలనుకుంటున్న Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటో  > YouTube Premiumను పొందండి లేదా Music Premiumను పొందండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. అర్హత ఉన్నట్లయితే, మీ ట్రయల్‌ను ప్రారంభించండి. లేకపోతే, మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను ప్రారంభించడానికి, దశలను ఫాలో అవ్వండి.
మీరు VPNను లేదా ప్రాక్సీ సర్వీసును యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నట్లయితే, దాన్ని ఎలా ఆఫ్ చేయాలనే సమాచారం కోసం దయచేసి సర్వీసు సహాయ కేంద్రాన్ని లేదా వెబ్‌సైట్‌ను చూడండి. పూర్తయిన తర్వాత, youtube.com/premium లో లేదా youtube.com/musicpremium లో మీ మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి.

Workspace ఖాతాలు

  • Workspace ఖాతా అనేది Workspace వ్యక్తిగత ఎడిషన్ ఖాతా అయితే తప్ప మీరు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ను ఉపయోగించి YouTube Premiumకు సైన్ అప్ చేయలేరు.
  • మీరు ఏ Workspace ఖాతాతోనైనా YouTube Premium విద్యార్థి మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయవచ్చు.
  • మీకు ట్రయల్‌కు అర్హత ఉందని భావిస్తున్నారు, కానీ మీకు ట్రయల్ ఆప్షన్ కనిపించకపోతే, మీ వ్యక్తిగత ఖాతాకు మారి, youtube.com/premium లింక్‌లో సైన్ అప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17372062565489360474
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false